చిచ్చు రగిలేలా ఉంది.. బిగ్ బాస్ విజేతల మధ్య మరో పోటీ.. ఎవరు గెలుస్తారో మరి
బిగ్ బాస్ కంటెస్టెంట్ల హవా ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ ఉత్సవం పేరిట రాబోతోన్న ప్రోగ్రాంలో కంటెస్టెంట్లందరూ కూడా దుమ్ములేపుతున్నారు. ఇదివరకే నాలుగో సీజన్ కంటెస్టెంట్లు చేసిన సందడి అంతా చూశాం. అయితే మిగిలిన మూడు సీజన్ల కంటెస్టెంట్లు చేయనున్న సందడి రానున్న ఆదివారం ప్రసారం కాబోతోంది. ఈలోపు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు అదిరిపోయే ప్రోమోలను రెడీ చేశారు. తాజాగా ఓ ప్రోమో బయటకు వచ్చింది.

బిగ్ బాస్ ఉత్సవం..
గత రెండు వారాలుగా బిగ్ బాస్ ఉత్సవంకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో సీజన్ల కంటెస్టెంట్లందరినీ ఒకే చోట చూడటంతో అందరూ తెగ సంబరపడిపోయారు. అలా నాల్గో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్లతో గత ఆదివారమే రచ్చ చేశారు.

నాటి అనుభవాలు..
బిగ్ బాస్ నాల్గో సీజన్ ముగిసి దాదాపు రెండు నెలలు కూడా కాలేదు. అలా నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరూ ఒకే చోటకు రావడంతో అందరికీ ఏదో తెలియని కొత్త అనుభూతి వచ్చింది. మళ్లీ నాల్గో సీజన్ మొత్తం ఒకే సారి చూసినట్టు అందరికీ అనిపించింది.

మూడు సీజన్ల కంటెస్టెంట్లు..
బిగ్ బాస్ మొదటి మూడు సీజన్ల కంటెస్టెంట్లు ఒకే చోటకు వచ్చారు. రీయూనియన్‌లా అందరూ ఒకే చోటకు రావడంతో సందడి మరింత రెట్టింపైంది. అయితే తాజాగా వదిలిన ప్రోమోలో కంటెస్టెంట్లు రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా మూడు సీజన్ల విన్నర్ల మధ్య మరో పోటి పెట్టారు.

వింత టాస్కులు..
బిగ్ బాస్ ఇంట్లో ఇచ్చే టాస్కులు ఆడి చాలా రోజులైనందున అందరికీ నాటి రోజులను గుర్తుకు తెచ్చారు. ఐస్ క్రీంలు తినడం, గోడకు పిడకలు కొట్టడం వంటి టాస్కులను ఇచ్చారు. ఇక చివరగా మూడు సీజన్ల విజేతలకు మరో టాస్క్ ఇచ్చారు. ఆ ముగ్గురు రంగంలోకి దిగారు.

సైక్లింగ్‌లో గెలుపు..
సైక్లింగ్ అంటూ శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ మధ్య పోటీ పెట్టారు. ముగ్గురికి ముగ్గురూ అరివీరభయంకరంగా పోటీ పడుతున్నారు. మరీ ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడిపోతారు.. ఇక మరి వారి వారి ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియాలో వార్ పెడతారేమో చూడాలి.


Click it and Unblock the Notifications











