For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జోరుగా బిగ్‌బాస్ ఓటింగ్.. టాప్ లేపుతున్న ఆ ఇద్దరు.. వెనుకబడిన ఆ ముగ్గురు ఎవరంటే!

  |

  బిగ్‌బాస్ తెలుగు 3 రియాలిటీ షో ఫైనల్ వారం ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నది. నవంబర్ 3న జరిగే ఫినాలేకు సర్వం సిద్ధమవుతున్నది. టాప్ 5 గురు సెలబ్రిటీలు రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయం ప్రస్తుతం సెన్సేషనల్‌గా మారింది. అయితే తాజా ఓటింగ్ ప్రకారం ఎవరు ఓటింగ్‌లో దూసుకుపోతున్నారంటే..

   రాహుల్ సిప్లిగంజ్ టాప్‌లో

  రాహుల్ సిప్లిగంజ్ టాప్‌లో

  టాప్ 5 బిగ్‌బాస్ సెలబ్రిటీల ఎంపికకు ముందే రాహుల్ సిప్లిగంజ్ ఫైనల్లోకి దూసుకెళ్లి టాప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకొన్నాడు. మిగితా కంటెస్టంట్ల కంటే తెలివిగా ఆడటమే కాకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించడంతో ఇటీవల కాలంలో ఫాలోయింగ్ పెరిగిందనే విషయం స్పష్టమైంది. దాంతో ఓటింగ్‌లో రాహుల్ ముందున్నాడనేది విశ్వసనీయమైన సమాచారం.

  మల్టీ టాలెంట్‌తో శ్రీముఖి

  మల్టీ టాలెంట్‌తో శ్రీముఖి

  ఇక బిగ్‌బాస్ టైటిల్ రేసులో అధిక్యతను ప్రదర్శిస్తున్న మరో సెలబ్రిటీ శ్రీముఖి. మల్టీ టాలెంటెడ్ యాంకర్, యాక్టర్‌గా పేరొందిన శ్రీముఖి ఇంట్లో తనదైన శైలిలో రాణించడం, చిలిపిగా అందరితో కలిసి వినోదాన్ని పంచడంతో ఆమెకు కూడా భారీగా క్రేజ్ ఏర్పడింది. అలాగే ఆమె టైటిల్ ఎగురేసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే విషయాన్ని పలువురు విశ్లేషిస్తున్నారు.

  జాదూ చేస్తున్న బాబా భాస్కర్

  జాదూ చేస్తున్న బాబా భాస్కర్

  ఇక ఐదుగురిలో బాబా భాస్కర్ గేమ్ చాలా విభిన్నమైందిగా కనిపిస్తున్నది. తెలుగు అభిమానులే కాకుండా తమిళ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా తోడవ్వడంతో అధిక్యతను ప్రదర్శించేందుకు ముందుకెళ్తున్నాడు. దీంతో ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ.. ఎవరికైనా నేర్పించడమా? లేదా నేర్చుకోవడామా చేస్తాననే ట్యాగ్‌తో ముందుకెళ్తున్నాడు. ఫీల్ గుడ్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు బాబాకు కలిసి వచ్చే అవకాశం ఉంది.

  అలీ రెజా క్రేజీగా

  అలీ రెజా క్రేజీగా

  ఇక ఓ దశలో టైటిల్ రేసులో ముందు వరుసలో ఉన్న అలీ రెజా అనూహ్యంగా వెనుకబడిపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌లో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన అలీ ఆ తర్వాత డిఫెన్స్ బాట పట్టడం అభిమానులను షాక్ గురిచేస్తున్నది. ఇక ఈ నాలుగు రోజుల్లో టైటిల్ కోసం అలీ ఎలాంటి వ్యూహాన్ని పన్నుతారో అనే విషయం ఆసక్తిగా మారింది.

  ఒంటరైన వరుణ్ సందేశ్

  ఒంటరైన వరుణ్ సందేశ్

  ఇక వరుణ్ సందేశ్ కూడా టైటిల్ కోసం తన వంతు కృషిని చేస్తున్నాడు. సౌమ్యుడిగానే కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. రెండుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే జోడిగా సెలబ్రిటీలుగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినీ హీరో.. తన భార్య వితిక ఎలిమినేట్ అయిన తర్వాత కాస్త దూకుడును తగ్గిందనే అభిప్రాయం కలుగుతున్నది.

  Recommended Video

  Bigg Boss Telugu 3 : Chief Guest Confirmed For Telugu Bigg Boss Finale? || Episode 100 Highlights
  మెగాస్టార్ చీఫ్ గెస్ట్‌గా

  మెగాస్టార్ చీఫ్ గెస్ట్‌గా

  కాగా, బిగ్‌బాస్ తెలుగు 3 ఫినాలే‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక కోసం మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బిగ్‌బాస్ టీమ్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాకపోవడం గమనార్హం. గత ఏడాది వెంకటేష్ చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే.

  ఓటింగ్ నంబర్లు ఇవే..

  ఓటింగ్ నంబర్లు ఇవే..

  ఇక బిగ్‌బాస్ సెలబ్రిటీలకు ఓటింగ్ కోసం ఫోన్ నెంబర్లు షో ఆరంభం నుంచే అందుబాటులో ఉంచారు.

  వరుణ్ సందేశ్‌కు ఓటు వేయాలంటే.. 8466 996 714 నంబర్‌కు..
  రాహుల్ సిప్లిగంజ్‌కు ఓటు వేయాలంటే.. 8466 996 706 నంబర్‌కు
  శ్రీముఖికి ఓటు వేయాలంటే.. 8466 996 713
  భాబా భాస్కర్‌కు ఓటు వేయాలంటే.. 8466 996 708
  అలీ రెజా‌కు ఓటు వేయాలంటే.. 8466 996 711

  English summary
  Bigg Boss Telugu 3 Finale is set to organize on November 3. Voting for this show is on high note. Rahul Simpligunj, Ali Reza, Varun Sandesh, Sreemukhi, Baba Bhaskar are in race for title. As per report, Rahul and Sreemukhi on top in voting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X