బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అతడే.. రాహుల్ సిప్లిగంజ్ సెన్సేషనల్ కామెంట్స్
బిగ్ బాస్ షోలో ప్రస్తుతం పదో వారం నడుస్తోంది. ఇంకా మహా అంటే ఐదారు వారాలు ఉంటుంది. ఇప్పటికే ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారు. అందులో పదో వారానికి గానూ ఆరుగురు నామినేట్ అయ్యారు. షో ముగిసేందుకు ఇంకెంతో సమయం లేదు. ప్రతీ ఒక్క కంటెస్టెంట్ మీద నెగెటివిటీ, పాజిటివిటీ ఉంది. అయితే ఇప్పుడున్న తొమ్మిది మంది కంటెస్టెంట్లలో టాప్ ప్లేస్ అంటే దాదాపు అందరూ కూడా అభిజిత్ పేరు చెబుతారు.

బిగ్ బాస్ అంటే అదే..
బిగ్ బాస్ షో అంటే కేవలం కామెడీ చేయడం కాదు.. అలా అని కేవలం టాస్కులు బ్రహ్మాండగా ఆడటమేమీ కాదు. బిగ్ బాస్ షో అనేది మనిషిని పరీక్షించడం వంటిది. క్లిష్టమైన సమయంలో ఎలా ప్రవర్తిస్తాడు.. దారులన్నీ మూసుకుపోయినా సరే ఎలా ఆలోచిస్తాడు.. అవసరమైతే గెలిచేందుకు ఎంతటి దారుణానికైనా పాల్పడతాడా?.. లేదా శాంతంగా ఆలోచించి తెలివిని ప్రదర్శిస్తూ ఆడతాడా? అని ఇలా అన్ని కోణాల్లో బిగ్ బాస్ పరీక్షిస్తాడు.

ఎవరి ప్రత్యేకత వారిదే..
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ఎవరి ప్రత్యేకత వారిదే. టాస్కులు బాగా ఆడతాడని మెహబూబ్‌కు పేరుంది. కానీ ఆ టాస్కుల్లో ప్రదర్శించే అత్యుత్సాహం వల్లె నెగెటివిటినీ మూటగట్టుకున్నాడు. అరియానా తన అతి వల్ల నెగెటివ్ అవుతోంది. సోహెల్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పాజిటివిటీ పెంచుకుంటున్నాడు. అఖిల్ కూడా ఈ మధ్యే ఆట మొదలెట్టినట్టు కనిపిస్తోంది.

స్మార్ట్ గేమ్..
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ఫిజికల్ టాస్కులు ఆడటంతో అభిజిత్ కాస్త వీక్. ఆ విషయంలో అభిజిత్‌కు ఉండే కష్టాలు అతనికి ఉన్నాయి. భుజానికి గాయం కావడం వల్లే ఫిజికల్ టాస్కులో పాల్గొనలేకపోతున్నాడు. టాస్కులు ఆడటంలో కాస్త వెనకడుగు వేసినా కూడా ఆ స్థానంలో బుర్రను వాడి అందరి మనసులను దోచుకున్నాడు.

నెగెటివిటీ సైతం..
అభిజిత్‌పై కాస్త నెగెటివిటీ కూడా ఉంది. ఎదుటి వారి అభిప్రాయాలను పట్టించుకోడని, కించపరిచినట్టు మాట్లాడతాడని, కాస్త ఈగో చూపిస్తాడనే కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ అభిజిత్ మాత్రం తప్పు చేస్తే, చేశానని అనిపిస్తే క్షమాపణలు చెప్పి అక్కడితో సమస్యను పరిష్కరించుకుంటాడు. మాట్లాడేప్పుడు ఓ క్లారిటీ ఉంటుంది. ఇలా మొత్తంగా అభిజిత్‌కు కాస్త నెగెటివిటీ ఉన్నా కూడా కంటెస్టెంట్లందరిలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

అభిజిత్ విన్నర్..
సీజీన్ 4 టైటిల్ విన్నర్ గురించి రాహుల్ మాట్లాడుతూ.. ‘సీజన్ 4లో టైటిల్ కోసం నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు.. అందరూ టఫ్ ఫైట్ ఇస్తున్నారు. అయితే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే మా అన్న నోయల్.. ఆయన ఎలాగూ బయటకు వచ్చేశాడు కాబట్టి.. ఉన్న వాళ్లలో అభిజిత్ నా ఫేవరేట్. సొహైల్, అరియానా ఇలా ఇద్దరు ముగ్గురు నా ఫేవరెట్ కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. వాళ్లకు నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అయితే వీళ్లలో విన్నర్ ఎవరూ అంటే మాత్రం అభిజిత్ కావొచ్చు. అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 విజేత అవుతాడని అనిపిస్తుంద'ని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











