twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ముగ్గురు లేకపోతే లోకమే లేదు.. ఆ పని మాత్రం కచ్చితంగా చేస్తా.. రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్

    |

    రాహుల్ సిప్లిగంజ్ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. ప్రైవేట్ ఆల్బమ్స్, ప్లే బ్యాక్ సింగర్‌గా ఫేమస్ అయిన రాహుల్.. బిగ్ బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ సెలెబ్రిటీగా మారిపోయాడు. రాహుల్‌పై షో మొదట్లో కొంత వ్యతిరేకత ఏర్పడినా.. రాను రాను తన నిజాయితీ, ముక్కుసూటి తనం, ప్రేమించే గుణం, స్నేహం ఇలా ప్రతీ ఒక్క అంశంలో అందరి దగ్గర మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాలంల కెమిస్ట్రీ సీజన్ మొత్తానికి హైలెట్‌గా మారింది.

    వీరిద్దరి జంటకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. బయటకు వచ్చాక రాహుల్ సిప్లిగంజ్ తెగ బిజీ అయిపోయాడు. పాటలు, సినిమా అంటూ క్షణం తీరిక లేకుండా ఉన్న రాహుల్ పబ్ ఘటనతో మళ్లీ వార్తల్లోకెక్కాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ తన జీవిత లక్ష్యం ఏంటో వివరించాడు. అదేంటో ఓ సారి చూద్దాం.

    పునర్నవితో హల్చల్..

    పునర్నవితో హల్చల్..

    బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత వరకు పునర్నవితో హల్చల్ చేసిన రాహుల్ సిప్లిగంజ్.. బయట కూడా అదే రేంజ్‌లో రచ్చ చేశారు. బయట పార్టీలు, ఇంటికి వెళ్లి కలుసుకోవడం, కలిసి లైవ్‌లోకి రావడం, ఏ ఇంటర్వ్యూలో చూసినా వీరిద్దరి మధ్య ఏముందనే ప్రశ్నలు రావడం ఇలా కొన్ని రోజుల పాటు అంతా సందడి సందడిగా సాగింది.

    పబ్‌లో దాడి..

    పబ్‌లో దాడి..

    రాహుల్ సిప్లిగంజ్‌కు అమ్మాయిలతో పరిచయాలు, స్నేహాలు ఎక్కువే. ప్రతీ వీకెండ్ పబ్‌కు వెళ్లి దుమ్ములేపుతుంటాడు. ఆ క్రమంలో తన స్నేహితురాల్లతో పబ్‌కు వెళ్లిన రాహుల్‌పై కొందరు బీరు సీసాలతో దాడి చేశారు. ఈ మేరకు ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. ఈ ఘటనలో రాజకీయ నాయకులు ఎంట్రీ కావడంతో మరింత ముదిరింది. కేసులు నమోదు చేయడం వరకు వెళ్లిందీ వ్యవహారం.

    ఆ ముగ్గురు లేకపోతే..

    ఆ ముగ్గురు లేకపోతే..

    తాజాగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. తన దృష్టిలో కటింగ్ చేసేవారు, బట్టలు కుట్టేవారు, బట్టలు ఉతికేవారు లేకపోతే లోకమే లేదని చెప్పుకొచ్చాడు. బార్బర్ అనేది ఓ కళ అని అందంగా తయారుచేయడం గొప్ప విషయమని అన్నాడు. అవతల వారికి నచ్చినట్టు తయారుచేయడం మామూలు విషయం కాదన్నాడు.

    Recommended Video

    Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!
    ఓ వృద్దాశ్రమం కట్టాలి..

    ఓ వృద్దాశ్రమం కట్టాలి..

    తన జీవితంలో ఎప్పటికైనా ఓ వృద్దాశ్రమం కట్టాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. లైఫ్‌లో బాగా సంపాదించిన తరువాత.. ఓ స్టేజ్ దాటాక ఇక చాలు అనిపిస్తుంది కదా అప్పుడు కచ్చితంగా ఓల్డేజ్ హోమ్ కట్టిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఎంతమందితో మొదలు పెడతానో ఇప్పుడే చెప్పలేను గానీ కచ్చితంగా అది మాత్రం చేస్తానని అన్నాడు.

    English summary
    Rahul Sipligunh About His Life Ambition. He Shared That Good morning chichas! A small clip from my latest interview! Wanted to share with you guys
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X