దేవుడైనా వారి తరువాతే.. అది ఆ ఇద్దరి వల్లే తెలిసిందే.. రాహుల్ పోస్ట్ వైరల్
రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. గడిచిన మూడు సీజన్స్ కంటెస్టెంట్లందరిలోనూ ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తే కెరీర్ డౌన్ ఫాల్ అవుతుందని, ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న అపోహను రాహుల్ చెరిపేశాడు. మూడో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లలో దాదాపుగా అందరికీ క్రేజ్ వచ్చింది. అయితే చివరకు రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను, ప్రైజ్ మనీని ఎత్తుకెళ్లిపోయాడు.

పునర్నవితో కెమిస్ట్రీ..
బిగ్‌బాస్ షోలో రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ రేంజ్ పాపులార్టీ రావడానికి పునర్నవి ఓ కారణం. ఆమెతో స్నేహం చేయడం, అప్పడప్పుడు సరసాలు ఆడటం, వారిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడంతో ఫాలోయింగ్ పెరిగింది. మరోవైపు శ్రీముఖితో గొడవలు, పదే పదే టార్గెట్ చేయడంతో రాహుల్‌కు ప్లస్ అయింది. చివరకు టైటిల్ విజేతగా నిలబెట్టింది.

బయట అంతా హంగామా..
బిగ్‌బాస్ షో ముగిసిన తరువాత బయటకు వచ్చిన రాహుల్.. తనకున్న ఫాలోయింగ్, పెరిగిన క్రేజ్‌ను చూసి షాక్ అయ్యాడు. తన విజయానికి కారణం తన చిచ్చా (ఫ్యాన్స్)లే కారణమని వారి కోసం ఓ గ్రాండ్ పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. లైవ్ పర్ఫామెన్స్ పెట్టి మ్యూజికల్ నైట్ పార్టీ ఇచ్చి హంగామా చేశాడు.

సినిమాల్లోనూ ఎంట్రీ..
రాహుల్ సిప్లిగంజ్.. సింగర్‌గా బిజీ అవ్వడమే కాకుండా నటుడిగానూ ఎంట్రీ ఇస్తున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. బిగ్ బాస్ తెచ్చిన పాపులారిటీ.. నటుడిగా మార్చింది. ఈ మూవీలో శివాత్మిక-రాహుల్ జంటగా కనిపించనున్నారు.
దేవుడైనా వారి తరువాతే..
రాహుల్ ఎంత ఫేమస్ అయ్యారో.. ఆయన తల్లిదండ్రులు కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఎన్నో చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ రాహుల్ పెళ్లి విషయమై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేడు రాహుల్ పేరెంట్స్ పెళ్లి రోజు కావడంతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. తల్లిదండ్రుల తరువాతే ఆ దేవుడైనా.. అంటూ నిజమైన ప్రేమ ఇంకా ఉందని మీ ఇద్దరిని చూశాకే నమ్ముతున్నానని కాస్త ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











