నాకు పిల్లను ఎవ్వడు ఇవ్వడం లేదు.. కుక్కపిల్ల ముఖం చూడటం లేదు.. అలీరెజాతో రాహుల్

కరోనావైరస్ లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన బిగ్‌బాస్ కంటెస్టెంట్లు రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజాలు లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్బంగా ప్రజలకు, అభిమానులు ఇంట్లోనే ఉండాలని సలహా, సూచనలు ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. మీ కుటుంబాలకు ఇబ్బందిగా మారుతుంది అని హెచ్చరించారు. అలీ, రాహుల్ మధ్య జరిగిన సరదా సంభాషణ మీ కోసం..

లాక్‌డౌన్ తర్వాత ఈ జోష్ ఉంటుందా?

లాక్‌డౌన్ తర్వాత ఈ జోష్ ఉంటుందా?

లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాం. ఒకరకమైన జీవితానికి అలవాటు పడ్డాం. లాక్‌డౌన్ తర్వాత మళ్లీ మనంలో మునపటి జోష్ ఉంటుందా? అని అలీ రెజా సందేహం వ్యక్తం చేస్తే.. అలాంటిదేమి ఉండదు. ఎప్పుడు ఎత్తేస్తారా.. బయటకు పరుగులు పెడుదామని చిన్న పిల్లల్లా ఎదురు చూస్తున్నారు అని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.

 ఆల్కాహాల్ దొరకకపోవడం మంచిదే

ఆల్కాహాల్ దొరకకపోవడం మంచిదే

లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్‌లో పొల్యూషన్ తగ్గిపోయింది. మందు దొరకక లివర్ క్లీన్ అయిపోయింది. హైదరాబాద్ ఆల్కాహాల్ లభించక చాలా మంది సనత్ నగర్‌ మెంటల్ హాస్పిటల్‌లో చేరుతున్నారట. దాదాపు 200 మంది హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఆల్కహాల్ లేక చాలా మంది బాధపడుతున్నారు. కరోనావైరస్ వల్ల మంచే జరుగుతున్నది అని అలీ రెజా తెలిపారు.

బయట తిరిగితే మీ కుటుంబానికి ముప్పు

బయట తిరిగితే మీ కుటుంబానికి ముప్పు

లాక్‌డౌన్ లెక్క చేయకుండా ఎవరైనా రోడ్ల మీదకు వెళ్తే చాలా ప్రమాదం. వెళ్లిన వాళ్లకంటే ఇంట్లో ఉన్న వాళ్లకే ముప్పు ఎక్కువ. ఇంట్లోని పెద్దలు, పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను తోపు, నాకు ఏమి కాదు అని బయటకు వెళ్తే నీ చుట్టు ఉన్న వాళ్లకు ముప్పు ఉంటుంది అని అలీ రెజా పేర్కొన్నారు.

కరోనాతో జీవితం భయం పెరిగింది

కరోనాతో జీవితం భయం పెరిగింది

కరోనావైరస్ కారణంగా జీవితంపై భయం పెరిగింది. ఇంకా జీవితాన్ని చాలా అనుభవించాల్సి ఉంది. చాలా కోరికలు తీర్చుకోవాల్సనవి ఇంకా ఉన్నాయి. నాకైతే పెళ్లి అయిపోయింది. నీకైతే ఇంకా పెళ్లి కావాలి. నా సంగతి వదిలేస్తే.. రాహుల్ నీకే కష్టం అని అలీ పేర్కొన్నారు. నీవు అట్లా అంటే నాకు భయంగా ఉందని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.

నాకు ఎవ్వడు పిల్లను ఇవ్వడం లేదు

నాకు ఎవ్వడు పిల్లను ఇవ్వడం లేదు

మన గురించి లైవ్‌లో చెప్పకు. ఇప్పటికే నాకు ఎవరు పిల్లను ఎవ్వడం లేదు. కనీసం కుక్క పిల్ల కూడా నా ముఖం చూడటం లేదు అని రాహుల్ అంటే.. అదేమీ లేదు.. నీవు పెళ్లి చేసుకోవాలనుకొంటే లాక్‌డౌన్ ముగిసే సమయానికి నీ ఇంటి ముందు క్యూ ఉంటుంది అని అలీ రాజా అన్నారు.

Recommended Video

Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!
రాహుల్.. నీకు పిల్లను నేను సెలెక్ట్ చేస్తా

రాహుల్.. నీకు పిల్లను నేను సెలెక్ట్ చేస్తా

రాహుల్ నీవు పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. నీ గురించి ఓ పోస్టర్ తయారు చేయించి పోస్ట్ చేస్తాను అని అలీ రెజా అంటే.. నాకు ఫ్రిజ్ నీవే సెలెక్ట్ చేశాడు.. వాషింగ్ మిషన్ ‌కూడా నువ్వే ఇప్పించావు అని రాహుల్ సమాధానం ఇచ్చారు. అయితే వెంటనే నీకు పిల్లను కూడా సెలెక్ట్ చేస్తాను అని అలీ రెజా భరోసా ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X