Just In
Don't Miss!
- Sports
IPL 2021: స్టోక్స్‌ను మేం ఇవ్వం.. ముంబై అభిమానికి రాజస్థాన్ పంచ్!!
- News
రాలేకపోయా.. కానీ, వస్తా: భారత ప్రజలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పునర్నవి పేరెంట్స్‌ను కలిసిన రాహుల్.. ఆ పర్మిషన్ తీసుకోవడం కోసమే!
బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సీజన్‌లో అందరి కంటే ఎక్కువగా ఫేమస్ అయింది. పీవీవీఆర్ (వరుణ్, వితికా, పునర్నవి, రాహుల్)గ్యాంగ్. మళ్లీ ఈ నలుగురిలో ముఖ్యంగా క్రేజ్ సంపాదించుకున్నది మాత్రం పునర్నవి, రాహుల్. వరుణ్-వితికా భార్యభర్తలు కావడంతో వారిద్దరి కెమిస్ట్రీ మామూలు కావడంతో.. రాహుల్-పునర్నవి మధ్య రహస్య బంధం సీజన్ మొత్తం నడిచింది. ఈ క్రమంలో వారిద్దరిపై ఎన్నో కామెంట్లు, మీమ్స్ వచ్చాయి.

బయటకు వచ్చాక కూడా..
హౌస్‌లో ఉన్నంత వరకు అలాంటి కామెంట్లు రాగా.. బయటకు వచ్చాక కూడా వారిద్దరి లవ్ అఫైర్ సంగతులు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. రాహుల్ ఎక్కడికి వెళ్లినా పునర్నవి గురించి అడగడం, పునర్నవి ఎక్కడ కనిపించినా రాహుల్ గురించి అడగడం లాంటివి చేశారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి వారిద్దరికీ పెళ్లికూడా ఫిక్స్ అయిందని, వారి తల్లిదండ్రులు ఒప్పుకున్నారని వార్తలు రాసేశారు.

బిజీగా మారిన రాహుల్..
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక రాహుల్ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. సింగింగ్ చేస్తూ బిజీగా ఉండే రాహుల్.. యాక్టింగ్‌లోనూ రంగప్రవేశం చేశాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న 'రంగమార్తాండ' చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇవి కాకుండా పలు స్టేజ్ షోలు, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.
|
ఫ్యాన్స్ కోరిక మేరకు..
తనను విన్నర్‌గా గెలిచిపించిన చిచ్చాల కోసం తాను, పునర్నవి కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. తమ జోడి బాగుంటుందని, ఓ ఆల్బమ్ చేయమని చాలా మంది అడుగుతున్నారని అప్పట్లో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే వారి కోరిక మేరకు ఓ ఆల్బమ్ చేయబోతోన్నట్లు ప్రకటించాడు.
|
బేబీ అంటూ సాగే పాట..
బేబీ అంటూ సాగే ఓ ఆల్బమ్‌లో పునర్నవి నటించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పాటను కూడా కంపోజ్ చేసినట్టు టాక్. శాంపుల్‌గా రిథమ్‌ను కూడా ప్లే చేసి చూపించాడు. అంతేకాకుండా పునర్నవి పేరెంట్స్‌ను కలిసి ఈ ఆల్బమ్స్ కోసం పర్మిషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారిద్దరితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు.