బిగ్ బాస్ 4లోకి రాహుల్, పునర్నవి: వాళ్ల నిజస్వరూపం బయటపెట్టేందుకు జంటగా ఎంట్రీ.!

By Manoj

తెలుగులోకి బిగ్గెస్ట్ రియాలిటీ షోగా వచ్చి.. తక్కువ సమయంలో ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది బిగ్ బాస్. సరికొత్త థీమ్ అయినప్పటికీ... ఇక్కడి ప్రేక్షకులకు త్వరగానే చేరువైన ఈ షో... విజయవంతంగా ప్రదర్శితమైంది. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో... నాలుగో దానికి సైతం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫోర్త్ సీజన్ గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్.. పునర్నవి భూపాలం గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

Recommended Video

Bigg Boss Telugu Season 4 Dates Are Fixed,Here Is The Top List Contestents
వివాదాలమయం.... ఐనా విజయవంతం

వివాదాలమయం.... ఐనా విజయవంతం

బిగ్ బాస్ షో ప్రసారం అయిన అన్ని భాషల్లోనూ వివాదాస్పదం అయింది. అదే విధంగా తెలుగులోనూ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. హౌస్‌లో కంటెస్టెంట్లు వ్యవహరించిన తీరుతో కొన్ని విమర్శలు రాగా... షో నిర్వహకుల టాస్కుల వల్ల మరిన్ని తెరపైకి వచ్చాయి. అలాగే, గత సీజన్‌లో కాస్టింగ్ కౌచ్ వివాదంతో ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

ఆ మూడు సీజన్లు.. పూర్తి వివరాలు ఇవే

ఆ మూడు సీజన్లు.. పూర్తి వివరాలు ఇవే

బిగ్ బాస్ తెలుగులో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ మూడింటికీ ముగ్గురు స్టార్ హీరోలు హోస్టులుగా వ్యవహరించారు. ఈ అన్నింటిలోనూ మగవారే విజేతలుగా నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్‌లో శివ బాలాజీ... నాని నడిపించిన రెండో దానిలో కౌశల్ మండా... అక్కినేని నాగార్జున సారథ్యంలో వచ్చిన మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ గెలుపొందారు.

 భార్యభర్తల కంటే వీళ్లిద్దరే బాగా పాపులర్

భార్యభర్తల కంటే వీళ్లిద్దరే బాగా పాపులర్

ఎన్నో వివాదాల నడుమ ప్రారంభమైన మూడో సీజన్.. ఎంతో ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే. దీనికి కంటెస్టెంట్లుగా భార్యభర్తలైన వరుణ్ సందేశ్, వితిక షేరు వచ్చారు. వీళ్లిద్దరూ రొమాన్స్‌తో రచ్చ రచ్చ చేశారు. అయితే, వీళ్లకంటే ఎక్కువగా రాహుల్ సిప్లీగంజ్, పునర్నవి భూపాలం హైలైట్ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రేమ వ్యవహారంతో మరింత పాపులారిటీ సంపాదించారు.

 ఒక్కొక్కరిగా కంటే జంటగా యమ ఫేమస్

ఒక్కొక్కరిగా కంటే జంటగా యమ ఫేమస్

బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ సిప్లీగంజ్.. పునర్నవి భూపాలం ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రొమాంటిక్‌గా సందడి చేయడంతో పాటు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ వార్తల్లో నిలిచారు. ఇక, తమ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు బిహేవ్ చేశారు. దీంతో ఈ ఇద్దరూ జంటగా ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి బయట కూడా బాగా క్రేజ్ తెచ్చుకున్నారు.

బిగ్ బాస్ 4లోకి రాహుల్, పునర్నవి ఎంట్రీ

బిగ్ బాస్ 4లోకి రాహుల్, పునర్నవి ఎంట్రీ

రాహుల్, పునర్నవి క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది ఫిల్మ్ మేకర్లు, టీవీ షోల నిర్వహకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి విధితమే. ఇప్పటికే వీళ్లిద్దరితో కలిసి ఎన్నో కార్యక్రమాలను సైతం రూపొందించారు. ఇప్పుడీ తరహాలోనే బిగ్ బాస్ యూనిట్ ఈ జంటతో సీజన్‌ 4లో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది.

వాళ్ల నిజస్వరూపం బయటపెట్టేందుకేనట

వాళ్ల నిజస్వరూపం బయటపెట్టేందుకేనట

గత సీజన్‌ ప్రసారం అయిన సమయంలో ‘బిగ్ బాస్ బజ్' పేరిట ఓ కార్యక్రమం వచ్చింది. దీనికి రెండో సీజన్ కంటెస్టెంట్ తనీష్ వ్యాఖ్యతగా వ్యవహరించాడు. ఇప్పుడదే కార్యక్రమంలో రాహుల్, పునర్నవి కనిపించబోతున్నారట. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌తో వీళ్లిద్దరూ కలిసి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారని సమాచారం. ఇప్పటికే రాహుల్ దీనికి సంబంధించిన హింట్ కూడా ఇచ్చాడు.

నాలుగో సీజన్ అప్పుడే... కంటెస్టెంట్లుగా..

నాలుగో సీజన్ అప్పుడే... కంటెస్టెంట్లుగా..

సెప్టెంబర్ 6వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. దీన్ని కూడా నాగార్జునే హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్లు కూడా విడుదలయ్యాయి. ఇందులో పూనమ్ భజ్వా, అరియానా గ్లోరీ, మంగ్లీ, హేమచంద్ర, ప్రణవి, గంగవ్వ సహా పలువురు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చాయి. ఇక, బిగ్ బాస్ బజ్ సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X