అభిజీత్‌పై రాహుల్ మరో షాకింగ్ పోస్ట్: ఆ కంటెస్టెంట్లు పోతున్నారు అంటూ వీడియో రిలీజ్

రాహుల్ సిప్లీగంజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దీనికి కారణం కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అతడు దక్కించుకుంటున్న ఫాలోయింగే. సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. అద్భుతమైన పాటలతో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. ఇక, బిగ్ బాస్ షోలో విన్నర్‌గా నిలవడంతో హాట్ టాపిక్ అయ్యాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇటీవలి కాలంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ షాకింగ్ వీడియోను వదిలాడాతను. అందులో కొందరిపై ఫైర్ అయ్యాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

నాలుగో సీజన్‌లో సరికొత్తగా రాహుల్

నాలుగో సీజన్‌లో సరికొత్తగా రాహుల్

బిగ్ బాస్ మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచాడు రాహుల్ సిప్లీగంజ్. ఇక, కొన్ని రోజుల క్రితం మొదలైన నాలుగో సీజన్‌లో ‘బిగ్ బాస్ బజ్' అనే చిట్ చాట్ షోకు హోస్టుగా చేస్తున్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ హైలైట్ అవుతున్నాడు. ఇది మాత్రమే కాదు.. యాక్టర్‌గానూ ‘రంగమార్తాండ' అనే సినిమాలో చేస్తున్నాడు.

సపోర్ట్ విషయంలో మారాల్సి వచ్చింది

సపోర్ట్ విషయంలో మారాల్సి వచ్చింది

నాలుగో సీజన్‌లో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన నోయల్ పాల్గొనడంతో అతడికే తన మద్దతు అని ప్రకటించాడు రాహుల్ సిప్లీగంజ్. అందుకు అనుగుణంగానే ప్రచారం చేస్తూ వచ్చాడు. అయితే, ఊహించని విధంగా నోయల్ హౌస్‌ నుంచి బయటకు వచ్చేశాడు. దీంతో అభిజీత్‌కు సపోర్ట్ చేస్తానని చెప్పాడాతను. అప్పటి నుంచి ప్రతి వారం అతడికే ఓట్లు వేయడంతో పాటు గెలిపిస్తానని చెప్పాడు.

వారం వారం.. ఒక్కొక్కరికి మద్దతుగా

వారం వారం.. ఒక్కొక్కరికి మద్దతుగా

ప్రతి వారం తనకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఈ క్రమంలోనే అభిజీత్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఓట్ చేస్తున్నాడు. ఒకవేళ అతడు నామినేషన్‌లో లేకపోతే మరో కంటెస్టెంట్‌కు ఓట్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నాడు. అంతేకాదు, ఓట్ చేసిన దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేస్తున్నాడు.

అభిజీత్‌ను కాదని వాళ్లిద్దరికీ సపోర్ట్

అభిజీత్‌ను కాదని వాళ్లిద్దరికీ సపోర్ట్

ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఉద్దేశించి రాహుల్ చేసిన పోస్ట్ సంచలనం అయింది. అందులో అభిజీత్‌ను కాదని సోహెల్, ఆరియానాకు ఓట్లు వేయాలని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ‘పెర్ఫామెన్స్‌ని బట్టే మన సపోర్ట్ ఉంటుంది. ఎవరు చెప్పినా నమ్మకండి. బాగా ఆడేవాళ్లని, నిజాయితీగా ఆడేవాళ్లని సపోర్ట్ చేయండి. పనికిరానోళ్లని బయటకు తోసేయండి' అని రాశాడు.

అభిజీత్‌పై రాహుల్ మరో షాకింగ్ పోస్ట్

నిన్న మొన్నటి వరకూ అభిజీత్‌ను సపోర్ట్ చేసి.. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంపై అతడి ఫ్యాన్స్ రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ తాజాగా ఓ వీడియోను వదిలాడాతను. ‘అరే హౌలాగాళ్లారా.. నేను అభిజీత్‌కు గంపగుత్తగా సపోర్ట్ చేస్తానని అగ్రిమెంట్ రాసిచ్చానారా. వీక్ వీక్ వాళ్ల పర్పామెన్స్ బట్టి గ్రాప్ ఛేంజ్ అవుతుంటుంది' అని ఘాటుగా స్పందించాడు.

అందుకే వాళ్లను సపోర్ట్ చేస్తున్నాను

అందుకే వాళ్లను సపోర్ట్ చేస్తున్నాను

ఈ వీడియోలో ‘నా మీద మీమ్స్ క్రియేట్ చేసే హౌలాగాళ్లారా.. మీరు నన్నేమీ చేయలేరు. ఒకడు ఎలాగో సేవ్ అవుతాడని నాకు తెలుసు. అందుకే వేరే వాళ్లకు సపోర్ట్ చేశా. కొంత మంది గుంతలో పడిపోతారని, వాళ్లలో మంచోళ్లను సపోర్ట్ చేయమన్నా. ఇప్పుడు ఉన్నవాళ్లలో నాకు బెస్ట్ కొంతమందున్నారు. అందులోనే ఎవరైనా కప్పు కొట్టాలే. అర్థమైందా అది నా పాయింట్' అని చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X