పునర్నవితో అందుకే దూరం.. అన్ని మింగాల్సి వచ్చింది: అసలు మ్యాటర్ రివీల్ చేసిన రాహుల్
సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఫేమస్ పర్సనాలిటీగా గుర్తింపును సంపాదించుకున్నాడు లోకల్ బాయ్ రాహుల్ సిప్లీగంజ్. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో పాల్గొనడం.. ప్రేక్షకుల మద్దతుతో విజేతగా నిలవడం జరిగాయి. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. అమ్మాయిల విషయంలో అతడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో పునర్నవి భూపాలంతో దూరంగా ఉండడంపై రాహుల్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. వీళ్లిద్దరి మధ్య అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

సినిమా పాటలే కాదు.. అవి కూడా టాప్
నాగ చైతన్య డెబ్యూ మూవీ 'జోష్'లోని 'కాలేజ్ బుల్లోడా' అనే పాటతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత 'దమ్ము', 'ఈగ', 'రచ్చ', 'కెమెరామెన్ గంగతో రాంబాబు' వంటి సినిమాల్లోని పాటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే, 'ఎందుకే', 'మంగమ్మ', 'మైసమ్మ', 'పూర్ బాయ్', 'మాక్కికిరికిరి', 'దూరమే', 'గల్లీ కా గణేష్' సహా ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌లతో పాపులర్ అయ్యాడు.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. విజేతగా నిలిచాడు
ప్లే బ్యాక్ సింగర్‌గా, ఇండిపెండెంట్ కంపోజర్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఎంతో మంది టైటిల్ ఫేవరెట్లు ఉన్న ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లాడతను. అయితే, ఊహించని విధంగా అద్భుతమైన ఆటతీరుతో బిగ్ బాస్ విజేతగా నిలిచి హాట్ టాపిక్ అయ్యాడు.

పునర్నవితో ప్రేమాయణం.... పెళ్లి కూడా
బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో మరో కంటెస్టెంట్ పునర్నవి భూపాలంతో రాహుల్ లవ్ ట్రాక్ నడిపించాడు. బిగ్ బాస్ హౌస్‌లో వీళ్లిద్దరూ తరచూ హగ్ చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకోవడం వంటివి చేసి మసాలను దట్టించారు. బయట కూడా కొన్ని రోజుల పాటు రచ్చ రచ్చ చేశారు. దీంతో వీళ్ల పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

బిజినెస్ ప్రారంభించిన రాహుల్.. ఆమెతో
బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత రాహుల్ సిప్లీగంజ్ వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయి. ఆ మధ్య బెంజ్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన అతడు.. భారీ బడ్జెట్‌తో ప్రైవేట్ సాంగ్స్ రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'ఊకో కాకా' పేరిట ఓ బట్టల దుకానాన్ని ప్రారంభించాడు. దీనికి తన క్లోజ్ ఫ్రెండ్ అషు రెడ్డి సహా సినీ సెలెబ్రిటీలంతా హాజరై సందడి చేశారు.

పునర్నవితో దూరం.. అందరిలోనూ డౌట్లు
కొద్ది రోజులుగా రాహుల్ సిప్లీగంజ్.. బిగ్ బాస్ ఫేం అషు రెడ్డితో చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు. అంతేకాదు, ఆమెతో రియల్ రిలేషన్‌లో ఉన్నానంటూ ఆ మధ్య పోస్టు కూడా పెట్టాడు. ఈమెతో సన్నిహితంగా ఉంటూ పునర్నవితో దూరంగా ఉంటున్నాడీ బిగ్ బాస్ విన్నర్. దీంతో వీళ్లిద్దరి రిలేషన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాహుల్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
Recommended Video

అసలు మ్యాటర్ రివీల్ చేసేసిన రాహుల్
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో 'మీరు షాప్ ఓపెనింగ్‌కు పునర్నవిని ఎందుకు పిలవలేదు' అని యాంకర్.. రాహుల్‌ను ప్రశ్నించారు. దీనికి 'ఓపెనింగ్‌కు ముందు ఎంతో ప్రెజర్ ఫీలయ్యా. తలనొప్పి తట్టుకోలేక ఎన్నో టాబ్లెట్లు మింగేశా. అంతలా టెన్షన్ పడ్డా. ఆ టైమ్‌లో పునర్నవిని పిలవడం మర్చిపోయానంతే. అంతేకానీ, మా మధ్య గొడవలేం కాలేదు' అంటూ చెప్పుకొచ్చాడతను.


Click it and Unblock the Notifications











