నా ఫేవరెట్ కంటెస్టెంటే బిగ్ బాస్ 4 విన్నర్.. వాళ్లంతా వేస్ట్‌గాళ్లు: మరోసారి రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్

తన పాటలతో భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్ సెలెబ్రిటీగా వెలుగొందుతున్నాడు రాహుల్ సిప్లీగంజ్. సింగర్‌గా ఎంతో గుర్తింపును అందుకున్న అతడు.. బిగ్ బాస్ మూడో సీజన్‌కు విన్నర్ అయిన తర్వాత మరింత ఫేమస్ అయ్యాడు. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లోని కంటెస్టెంట్లపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఈ మధ్య తరచూ హాట్ టాపిక్ అవుతోన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్‌కు విన్నర్ ఎవరు అవుతారన్న దానిపై రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, కొందరిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ గెలిచిన తర్వాత మారిందిగా

బిగ్ బాస్ గెలిచిన తర్వాత మారిందిగా

ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఈ ఫేమ్‌తోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా షోలోకి వెళ్లిన అతడు.. అనూహ్య విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి అతడి కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అలాగే, పునర్నవితో ప్రేమాయణంతో మరింత హాట్ టాపిక్ అయ్యాడు.

కొత్త యాంగిల్స్ చూపిస్తున్న రాహుల్

కొత్త యాంగిల్స్ చూపిస్తున్న రాహుల్

బిగ్ బాస్ గెలిచిన తర్వాత రాహుల్ సిప్లీగంజ్.. యాక్టర్‌గానూ మారిపోయాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'లో కీలక పాత్ర పోషిస్తున్నాడతను. ఇదే కాకుండా బిగ్ బాస్ నిర్వహించే చిట్ చాట్ షో ‘బిగ్ బాస్ బజ్'తో హోస్టుగానూ కొత్త అవతారం ఎత్తాడు. అదే సమయంలో ప్రైవేటు ఆల్బమ్స్‌, సినిమా పాటలతో ఫుల్ బిజీగా సాగుతున్నాడీ యంగ్ సెన్సేషన్.

నోయల్‌కు మద్దతు.. అభి వైపు డైవర్ట్

నోయల్‌కు మద్దతు.. అభి వైపు డైవర్ట్

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌‌ విషయంలో తన అభిప్రాయాలు చెబుతున్నాడు. ఈ క్రమంలోనే దీన్ని నోయల్ సీన్ గెలుస్తాడని, అతడికే తన మద్దతు అని ప్రకటించాడు. అయితే, ఆ కంటెస్టెంట్ అనూహ్య పరిణామాల నడుమ హౌస్ నుంచి బయటకు వచ్చేయడంతో, అభిజీత్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు వెల్లడించాడు రాహుల్.

వాళ్లిద్దరికి మద్దతిచ్చి.. వాళ్లకు షాకిచ్చి

వాళ్లిద్దరికి మద్దతిచ్చి.. వాళ్లకు షాకిచ్చి

అభిజీత్ నామినేషన్‌లో ఉన్న ప్రతి వారం అతడికే ఓట్లు వేయమంటూ ప్రేక్షకులను కోరుతూ వచ్చాడు. అయితే, ఊహించని విధంగా రెండు వారాల క్రితం సయ్యద్ సోహెల్ రియాన్, ఆరియానా గ్లోరీలకు సపోర్ట్ చేయమని కోరాడు. అంతేకాదు, ‘ధైర్యంగా ఓట్లు వేయండి.. ఆట సరిగా ఆడని వాళ్లను హౌస్ నుంచి బయటకు గెంటేయండి' అంటూ షాకింగ్ పోస్ట్ చేశాడీ మాజీ విన్నర్.

అరే హౌలాగాళ్లారా అంటూ క్లారిటీ ఇచ్చి

అరే హౌలాగాళ్లారా అంటూ క్లారిటీ ఇచ్చి

రాహుల్ సిప్లీగంజ్ చేసిన పోస్ట్ పెద్ద వివాదానికి కారణం అయింది. అభిజీత్ అభిమానులు అతడిపై విమర్శల వర్షం కురిపించడం మొదలు పెట్టారు. దీంతో సీరియస్ అయిన అతడు.. ఓ వీడియోను రిలీజ్ చేసి.. ‘అరే హౌలాగాళ్లార.. అభిజీత్‌కు ఓట్లు వేస్తానని అగ్రిమెంట్ రాసిచ్చానారా? నేను చెప్పిన ఉద్దేశం ఒకటి.. మీరు అనుకునేది ఒకటి. నేనెవడికీ భయపడను' అంటూ చెప్పుకొచ్చాడు.

Recommended Video

Tollywood Stars At A MB Cinemas | Filmibeat Telugu
విన్నర్ ఆ కంటెస్టెంటే.. వాళ్లంతా వేస్ట్‌గాళ్లు

విన్నర్ ఆ కంటెస్టెంటే.. వాళ్లంతా వేస్ట్‌గాళ్లు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ సిప్లీగంజ్.. బిగ్ బాస్‌ నాలుగో సీజన్‌కు కాబోయే విన్నర్ అభిజీతే అని చెప్పాడు. అప్పటికీ ఇప్పటికీ తన ఫేవరెట్ కంటెస్టెంట్ అతడనేనని స్పష్టం చేశాడు. అదే సమయంలో తనపై మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేసిన వాళ్లపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు రాహుల్. పనీ పాట లేని వేస్ట్ గాల్లే అలాంటి పనులు చేస్తారని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X