For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Rahul Sipligunj: మొదటివాడివి నువ్వే, నా కోసం అషూ మూడు రోజులు అలానే.. ఇది కదా అసలు పని!

  |

  తెలుగు ప్రేక్షకులకు బిగ్బాస్ మీద ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి కాక 5 శాతం కూడా మొదలు కావడానికి సిద్ధంగా ఉంది.. అసలు విషయం ఏంటంటే మూడవ సీజన్ లో పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా బయటకు వచ్చాడు. హౌస్ లో ఉన్నన్నాళ్ళు పునర్నవి భూపాలం తో ఏదో అఫైర్ ఉన్నట్లు ప్రేక్షకులందరికీ బ్రహ్మ కల్పించారు బిగ్ బాస్ నిర్వాహకులు.. బయటకు వచ్చాక వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ అయిన దాఖలాలు లేవు. కానీ హౌస్ లోనే ఉన్న అషురెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ ఫోటోలు మాత్రం వారిద్దరికీ ఏదో ఎఫైర్ ఉందన్నట్టు ప్రచారం జరుగుతూ ఉండగా ఈ విషయం మీద రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

   గతం కంటే భిన్నంగా

  గతం కంటే భిన్నంగా

  ఒక రకంగా బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన విన్నర్స్ గాని అందులో కంటెస్టెంట్స్ గాని ఈ షో వలన పెద్దగా ఫ్యూచర్ ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే బిగ్ బాస్ 4 తర్వాత ఆ కంటెస్టెంట్ లకు కొన్ని ఆఫర్లు వచ్చాయి గానీ మొదటి మూడు సీజన్లలో పాల్గొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ వల్ల ఆఫర్లు వచ్చిన దాఖలాలు లేవు. రాహుల్ సిప్లిగంజ్ మాత్రం మంచి అవకాశాలు అందుకుని మంచి సినిమాలలో పాటలు పాడే అవకాశం దక్కించుకున్నాడు. అయినా సరే ఎప్పటిలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు.

  పునర్నవితో మిస్సింగ్

  పునర్నవితో మిస్సింగ్

  అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఆయన పునర్నవితో ఎక్కువగా కనిపించలేదు. పునర్నవి స్థానంలో అదే బిగ్ బాస్ హౌస్ లో కొన్నాళ్ళపాటు ఉండి బయటకు వచ్చేసిన అషురెడ్డితో ఫోటోలు పెట్టడం మొదలుపెట్టారు.. దీంతో అషు రెడ్డి అలాగే రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఏదో ఉంది అనే ప్రచారం మాత్రం జరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ స్నేహితులమె అని చెప్పుకుంటూనే మళ్లీ అనుమానాలు రేకెత్తించే విధంగా ఫోటోలు పెట్టే వాళ్ళు.. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అనే విషయం మీద చాలా చర్చోపచర్చలు జరుగుతూ వచ్చేవి.

  ప్రేమ పుకార్లు

  ప్రేమ పుకార్లు

  అయితే అషు రెడ్డి ప్రస్తుతం కొన్ని టీవీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ కొన్ని షోలలో కూడా పాల్గొంటోంది. అందులో కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో ఆమెకు ఎక్స్ ప్రెస్ హరి కి మధ్య ఏదో లవ్ ట్రాక్ నడుస్తున్నట్లుగా చూపిస్తున్నారు. అది కూడా ఆన్ స్క్రీన్ లవ్ అని ప్రచారం జరుగుతున్నా వాళ్లు మాత్రం తమ మధ్య ఏదో ఉంది అన్నట్లుగానే సోషల్ మీడియాలో కూడా ప్రవర్తిస్తూ ఉంటారు.. అయితే రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి ఎప్పుడు కనిపించినా మళ్ళీ ప్రేమ పుకార్లు వస్తూనే ఉంటాయి. తాజాగా ఈ విషయం మీద రాహుల్ సిప్లిగంజ్ ఆసక్తికరంగా స్పందించాడు.

   అలా చెప్పిన మొదటోడివి నువ్వే

  అలా చెప్పిన మొదటోడివి నువ్వే

  విషయం ఏమిటంటే వీరిద్దరూ కలిసి నువ్వెవరో అనే ఒక ప్రైవేట్ సాంగ్ చేశారు. ఈ పాటకు మంచి వ్యూస్ రావడంతో రాహుల్ సిప్లిగంజ్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. ఆ శుభాకాంక్షలకు రాహుల్ కూడా స్పందిస్తూ రిప్లై ఇస్తూ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం వీరిద్దరూ మంచి స్నేహితులు అని పేర్కొనగా ఆ విషయాన్ని షేర్ చేసిన రాహుల్ మాది ఫ్రెండ్షిప్ ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే, అని చెబుతూనే అషూరెడ్డి తన స్నేహం కోసం ఎంత హెల్ప్ చేసిందో రాహుల్ చెప్పుకొచ్చాడు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
  మూడు రోజులు ఉండి రూపాయి తీసుకోలా

  మూడు రోజులు ఉండి రూపాయి తీసుకోలా

  మేము మా పని మేము చేస్తున్నామని పేర్కొన్న రాహుల్, ఈ నువ్వెవరు అనే సాంగ్ కోసం ఆషూరెడ్డి మూడు రోజుల కష్టపడింది కానీ మూడు రోజులకు గాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చాడు.. స్నేహం కోసం ఆమె అంతలా తనకు సపోర్ట్ చేసిందని ఇదే నిజమైన ఫ్రెండ్ షిప్ అని రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చాడు. మరి రాహుల్ సిప్లిగంజ్ తన గురించి ఇంత ఎమోషనల్ అవుతుంటే ఆమె ఊరుకుంటుందా ఆమె కూడా వెంటనే లవ్ యు రాహుల్ అని చెప్పుకొచ్చింది. అషురెడ్డి కూడా గత కొద్దిరోజులుగా వార్తలు నిలుస్తోంది. దానికి కారణం రాంగోపాల్ వర్మ తో ఆమె మీటింగ్.

  English summary
  Rahul Sipligunj shares emotional words on Ashu Reddy about nuvvevare private song.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X