Just In
- 1 hr ago
ట్రెండింగ్ : నాకు నలుగురు లవర్స్.. అప్పుడే కమిటయ్యా.. అనుమానాలకు తావిస్తోన్న నయనతార తీరు..
- 1 hr ago
చావు కబురు చల్లగా చెప్పిన కార్తికేయ.. బస్తీ బాలరాజుగా మాస్ లుక్‌లో
- 2 hrs ago
రామ్ చరణ్, సానియా మీర్జా స్టెప్పులు.. ఉపాసన చేసిన పనికి టెన్నిస్ స్టార్ షాక్
- 2 hrs ago
టాలీవుడ్ 2019 : బూతు చిత్రాల దాడి.. హీట్ పెంచే సీన్లు, బోల్డ్ డైలాగ్‌లతో రచ్చ
Don't Miss!
- News
మోడీ ఆరేళ్లలో ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఏమీ చేయలేదు: మన్మోహన్ సింగ్
- Finance
ఏమేం చేస్తారోగానీ.. ఏడాదికి రూ.7 కోట్లు పుచ్చుకుంటారు!
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Technology
ఎంఆధార్ రివ్యూ, ఇప్పుడు మూడు ప్రొఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Lifestyle
జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020లో ఈ రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందట...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
పునర్నవి - రాహుల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. క్లారిటీ ఇచ్చిన పేరెంట్స్..
బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. గత ఆదివారం ముగిసిన మూడో సీజన్‌లో ప్రముఖ యంగ్ సింగర్ రాహుల్ సింప్లీగంజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అతడికి యాంకర్ శ్రీముఖి నుంచి హోరాహోరీ పోరు ఎదురైంది. అయినప్పటికీ ప్రేక్షకుల మద్దతుతో రాహుల్ బిగ్ బాస్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ సీజన్ ముగిసిన తర్వాతి నుంచి రాహుల్ - పునర్నవి లవ్ ట్రాక్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీళ్లిద్దరి పెళ్లి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

లవ్ ట్రాక్ కూడా వర్కౌట్ అయింది
బిగ్ బాస్ హౌస్‌లో అత్యంత హాట్ టాపిక్ అయిన వ్యవహారాల్లో పునర్నవి - రాహుల్ లవ్ ట్రాక్ ప్రధమ స్థానంలో ఉంటుంది. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, రొమాన్స్‌ను ప్రేక్షకులు బాగా చూసేవాళ్లు. ముఖ్యంగా యువత వీరి లవ్ ట్రాక్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు. ఇది కూడా రాహుల్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

హౌస్‌లో హల్‌చల్ చేసేశారు
బిగ్ బాస్ ప్రారంభం సమయంలో జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. దానికి సమాధానంగా నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా అని పునర్నవి అన్నది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వీళ్లిద్దరూ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.

హ్యాపీ రక్షాబంధన్.. రాహుల్‌కు తప్ప
ఆ తర్వాత ఓ ఎపిసోడ్‌లో పునర్నవి.. లవ్ ట్రాక్‌కు బలం చేకూర్చే విధంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘హౌస్ ఉన్న వాళ్లందరికీ రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప' అని అనగానే అందరూ గట్టిగా కేకలు వేశారు. దీంతో రాహుల్ ముఖంలో గర్వం కనిపించగా.. అందరూ నవ్వుకున్నారు. ఇప్పటికే డేటింగ్.. లవ్ సంభాషణలతో ఈ జంట చర్చనీయాంశం అవ్వగా.. ఇప్పుడు మాత్రం వీళ్ల గురించి బయటకు రావడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.

బయట కూడా కలిసే ఉంటున్నారు
ఇక, బిగ్ బాస్ సీజన్ -3 ముగిసిన తర్వాత కూడా పునర్నవి - రాహుల్ కలిసే ఉండడం కనిపిస్తోంది. వీళ్లిద్దరూ తరచూ ఏదో ఒక చోట కలవడం.. జంటగా టీవీ షోలకు వెళ్లడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా నిరంతరం వార్తల్లో ఉంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి ఎన్నో ప్రచారాలు సాగుతున్నాయి. అలాగే, వీళ్ల మధ్య ఏదో ఉందన్న వార్తలకు బలం చేకూరినట్లు అవుతోంది. అయినా.. వీళ్లు ఆగకపోవడం విశేషం.

పునర్నవి - రాహుల్ పెళ్లి చేసుకుంటారు
బిగ్ బాస్ హౌస్‌లో చాలా రోజులు వీళ్ల మధ్య జరిగిన దానిని చూసిన వారు పునర్నవి, రాహుల్ నిజంగానే ప్రేమించుకుంటున్నారని అనుకున్నారు. దీనికి తోడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరూ అదే తరహా ప్రవర్తనతో కనిపించడంతో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అయితే, వీళ్లిద్దరి మాత్రం మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతున్నారు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పేరెంట్స్
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ రాహుల్ తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా పునర్నవితో రాహుల్ పెళ్లి గురించి యాంకర్ ప్రశ్నించింది. దీనికి రాహుల్ తండ్రి ‘వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారో లేదో మాకు తెలీదు. వాళ్ల మనసులో ఏముందో మాకేం తెలుసు. అయితే, షోలో మాత్రం ఏదో ఉన్నట్లే చూపించారు. నిజంగా వాళ్లు లవ్ చేసుకుంటే పెళ్లి చేయడానికి మాకు అభ్యంతరం లేదు' అని చెప్పారు.