twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పునర్నవితో గొడవలు.. అదంతా ముగిసింది.. ఆమె గురించి అడిగి చంపకండని రాహుల్ ఫైర్

    |

    రాహుల్ సిప్లిగంజ్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు నివసిస్తున్న దేశాల్లోనూ మార్మోగింంది. బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అంతకుముందు ప్రైవేట్ ఆల్బమ్స్, ప్లే బ్యాక్ సింగర్‌గా మాస్ ఫాలోయింగ్ సంపాదించిన రాహుల్‌కు బిగ్‌బాస్ పదింతల ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. చివరకు విజేతగా నిలబెట్టేలా చేసింది. రాహుల్ సిప్లిగంజ్ ఇంతగా ఫేమస్ అవ్వడానికి పునర్నవి కూడా ఓ కారణమే. అయితే అలాంటి పునర్నవి పేరు ఎత్తగానే రాహుల్‌కు చిర్రెత్తుకొచ్చింది.

    పునర్నవితో హల్చల్..

    పునర్నవితో హల్చల్..

    బిగ్‌బాస్ మూడో సీజన్ అంతగా హైలెట్ కావడానికి పునర్నవి, రాహుల్ కెమిస్ట్రీ ఓ కారణమే. హౌస్‌లో వీరు రహస్య బంధం, ప్రేమ, కోపం, ద్వేషం, తిట్లు అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరి జంటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఎన్నిరూమర్స్ వచ్చినా ప్రతీసారి ఖండిస్తూనే వచ్చారు.

     మీడియాలో పెళ్లి వార్తలు..

    మీడియాలో పెళ్లి వార్తలు..

    బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక వీరిద్దరి పెళ్లి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇంటర్వ్యూలకు వెళ్లిన ప్రతీసారి వీరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించడం పరిపాటి అయింది. అయితే ప్రతీసారి తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకు మించి ఏమీ లేదని చెప్పుకొచ్చేవారు.

    ఈ మధ్య కాస్త దూరం..

    ఈ మధ్య కాస్త దూరం..

    అయితే రాహుల్, వరుణ్-వితికాలతో పునర్నవి గ్యాప్ మెయింటేన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వీరంతా తరుచుగా కలుస్తున్నా గానీ పునర్నవి రావడం లేదు. వారంతా కలిసి పార్టీలు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అందులో ఎక్కడా కూడా పునర్నవి పార్టిసిపేట్ చేయలేదు.

    తాజాగా రాహుల్ ఫైర్..

    తాజాగా రాహుల్ ఫైర్..

    తాజాగా రాహుల్ తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశాడు. ప్రశ్నలు అడగండి.. సమాధానాలు ఇస్తానని తెలిపాడు. ఈ క్రమంలో పునర్నవికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీంతో రాహుల్ అసహనానికి గురైనట్టు కనిపించింది. ఆమె గురించి అడిగి చంపకండని వేడుకున్నాడు.

    అదంతా ముగిసింది..

    అదంతా ముగిసింది..

    అందరూ పునర్నవి గురించి అడుగుతున్నారు కాబట్టి మరోసారి అందరికీ క్లియర్ చేస్తున్నానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ‘స్క్రీన్ మీద కనిపించేవి నిజాలు కాదు. ప్రతీ ఒక్కరికీ తమదైన జీవితం ఉంటుంది. బిగ్‌బాస్ ముగిసింది. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ముందుకుపోతున్నారు. కాబట్టి మీ అందరికీ చెబుతున్నా.. చిల్ అవ్వండి. మళ్లీ అలాంటి ప్రశ్నలతో నన్ను చంపకండి'అని పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగినట్టే తెలుస్తోంది.

    English summary
    Rahul Sipligunj Fires On Netizen That Don't Ask About punarnavi Bhupalam. Screen Life Is Different Everybody Has Their Own Life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X