నాకు అషురెడ్డితో రిలేషన్‌షిప్.. రాహుల్ సిప్లిగంజ్ వెల్లడి.. బిగ్‌బాస్ బ్యూటి రియాక్షన్ ఏంటంటే!
యువ తారలకు, కళకారులు ఎదిగేందుకు బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతగానో ఉపయోగపడుతున్నదంటే అతిశయోక్తి కాదేమో. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3 తో వెలుగులోకి వచ్చిన కొందరిలో రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డి, పునర్నవి భూపాళం, రోహిణి, సావిత్రి తదితరులు ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా సినీ తారలను కూడా వెనకకు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా మారడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన అఫైర్ల విషయంలో అభిమానులకు అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

పునర్నవితో రాహుల్ కెమిస్ట్రీ
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి మధ్య జరిగిన రొమాంటిక్ ఎపిసోడ్స్ మూడో సీజన్‌కు హైలెట్‌గా మారాయి. వారి మధ్య శృతిమించని సరదా, చిలిపి సంభాషణలు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. వారి మధ్య కెమిస్ట్రీ అనేక రూమర్లకు దారి తీసింది. అయితే అందరూ ఊహించినట్టు తమ మధ్య అలాంటి రిలేషన్ లేదనే విషయం చెప్పడంతో అంతటితో వారి అఫైర్ వార్తలకు తెరపడింది.

అషురెడ్డితో అఫైర్ వార్తలు
బిగ్‌బాస్ విజేతగా మారిన తర్వాత రాహుల్ సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్న క్రమంలో అఫైర్ వార్తలు మాత్రం ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అషురెడ్డితో అఫైర్ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై రాహుల్ గానీ, అషురెడ్డి గానీ పెదవి విప్పలేదు. తాజాగా ఆమెతో ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

అషురెడ్డితో నాకు రిలేషన్‌షిప్
లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో రాహుల్ సింప్లిగంజ్ తాజాగా ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లోకి అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు అషురెడ్డితో ఉన్న అఫైర్ గురించి చెప్పమని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా రాహుల్ మాట్లాడుతూ.. యస్.. అషురెడ్డికి నాకు రిలేషన్‌షిప్ ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు.
Recommended Video

రాహుల్ రియాక్షన్‌పై అషురెడ్డి
అయితే అషురెడ్డితో ఉన్న రిలేషన్‌పై రాహుల్ సిప్లిగంజ్ మరింత క్లారిటీ ఇస్తూ.. మీరు అనుకొన్నట్టు మా మధ్య ఆ రిలేషన్ లేదు. కానీ మా మధ్య ఉన్న రిలేషన్ జిగిరి దోస్త్ అంటే ఎవరూ విడదీయలేనటు వంటి స్నేహ బంధం ఉంది అంటూ @ashu_uuu అంటూ ఓ కామెంట్ పెట్టారు. రాహుల్ పెట్టిన కామెంట్‌కు అషురెడ్డి లవ్ ఎమోజీని పెట్టి రియాక్షన్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











