పునర్నవితో ఆ అవకాశం వస్తే వదలను.. అసలు విషయం బయటపెట్టిన రాహుల్

బిగ్ బాస్ మూడో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. పార్టిసిపెంట్స్ మధ్య గొడవలు, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లు బుల్లితెర ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేశాయి. చివరకు సీజన్ 3 విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, శ్రీ ముఖి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌లో ముఖ్యంగా రాహుల్, పునర్నవి మధ్య ట్రాక్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరినీ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు చేస్తున్నాయి మీడియా సంస్థలు. ఈ ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికర సంగతులు బయటకొస్తున్నాయి.

పునర్నవి, రాహుల్‌తో కలిసి వరుణ్ జంట

పునర్నవి, రాహుల్‌తో కలిసి వరుణ్ జంట

వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్ ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. హౌస్‌లోకి వచ్చిన మొదటి రోజు నుంచే వీరిమధ్య స్నేహం కుదిరింది. అది అలా అలా కొనసాగుతూ సీజన్ మొత్తం నిలిచిపోయింది. ఈ నలుగురిని మిగతా వారు పదే పదే టార్గెట్ చేయడంతో వీరిపై అందరికీ సింపతి కూడా పెరిగి పోయింది.

బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి, రాహుల్ తీరు

బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి, రాహుల్ తీరు

ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి, రాహుల్ ప్రవర్తించిన తీరు అందరిలో అనుమానాలు రేకెత్తించింది. ఈ జంట కెమిస్ట్రీ చూసి బుల్లితెర ఆడియన్స్ అట్రాక్ట్ కావడంతో వీరికి మరింత క్రేజ్ పెరిగింది. ఇక చివరగా రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 ట్రోఫీ గెలుచుకోవడంతో మరోసారి ఈ ఇద్దరి అంశం తెరపైకి వచ్చింది.

బిగ్ బాస్ జోడీ పెళ్లి

బిగ్ బాస్ జోడీ పెళ్లి

పునర్నవి, రాహుల్ ప్రేమలో మునిగి తేలుతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. దేనిని ఖండిస్తూ రాహుల్ ఓ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ వార్తలు ప్రవాహానికి ఫుల్‌స్టాప్ పడటం లేదు.

రాహుల్‌తో పార్టీలు.. లవ్ ఎఫైర్

రాహుల్‌తో పార్టీలు.. లవ్ ఎఫైర్

తమ పెళ్లి విషయమై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన రాహుల్.. తామిద్దరం ప్రాణ స్నేహితులమని, తమ మధ్య లవ్ ఎఫైర్ లేదని స్పష్టం చేశాడు. ఇక బిగ్ బాస్ సీజన్ ముగిశాక పునర్నవి, వితిక, వరుణ్, రాహుల్ అంతా కలిసి తెగ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

అవకాశం వస్తే వేదిలేదే లేదు

అవకాశం వస్తే వేదిలేదే లేదు

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్.. పునర్నవితో కలిసి సినిమా అవకాశం వస్తే అస్సలు వదలమని తెలిపాడు. పునర్నవితో సినిమా అవకాశం వస్తే..110 పర్సెంట్ సినిమా చేస్తానని తన ఇష్టాన్ని బయటపెట్టేశాడు రాహుల్. దీంతో ఈ ఇద్దరి లవ్ స్టోరీకి వెండితెర బాటలు పడినట్లయింది.

Recommended Video

Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
ఒకవేళ సెట్ అయ్యినదంటే మాత్రం

ఒకవేళ సెట్ అయ్యినదంటే మాత్రం

ఎలాగూ రాహుల్ స్వయంగా పునర్నవితో సినిమా చేస్తా అంటున్నాడు కాబట్టి.. ఈ ఇద్దరితో ఓ లవ్ స్టోరీ తెరకెక్కిస్తే దానికి తిరుగే ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 3 షోలోనే ఈ జంటకు మంచి పాపులారిటీతో పాటు స్పెషల్ క్రేజ్ వచ్చేసింది కాబట్టి. సో.. చూడాలి మరి రాహుల్ ఇంట్రెస్ట్‌పై ఏ నిర్మాత ఫోకస్ పెడతాడో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X