మా పెయిర్ బాగుందంటున్నారు.. పునర్నవిని పార్ట్‌నర్‌ చేసుకోబోతున్నా: రాహుల్ ప్రకటన

By Manoj

ప్రముఖ సింగర్, బిగ్ బాస్ సీజన్ -3 విన్నర్ రాహుల్ సింప్లీగంజ్.. యంగ్ హీరోయిన్ పునర్నవి భూపాలం ప్రేమలో మునిగి తేలుతున్నారు. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇలా.. కొద్ది రోజులుగా వీళ్లిద్దరి మధ్య ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరించిన తీరే. ఈ సీజన్ ముగిసిన తర్వాతి నుంచి రాహుల్ - పునర్నవి ప్రేమాయణం గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా వీళ్లిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అది చెప్పింది ఎవరో కాదు.. రాహులే. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

రాహుల్ గెలుపు వెనుక పున్నూ

రాహుల్ గెలుపు వెనుక పున్నూ

రాహుల్.. బిగ్ బాస్ సీజన్ విన్నర్‌గా గెలుపొందడం వెనుక పునర్నవి పాత్ర కూడా ఉందనేది అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, రొమాన్స్‌ను ప్రేక్షకులు బాగా చూసేవాళ్లు. ముఖ్యంగా యువత వీరి లవ్ ట్రాక్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు. ఇది కూడా రాహుల్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. దీనికితోడు, బయటకు వచ్చిన తర్వాత ఆమె రాహుల్ తరపున ప్రచారం కూడా చేసింది.

అనుమానాలకు అదే కారణం

అనుమానాలకు అదే కారణం

ఈ రియాలిటీ షో ప్రారంభంలో జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వీళ్లిద్దరూ సీజన్ ముగిసే వరకు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.

 ఇక్కడ కూడా తగ్గడం లేదు

ఇక్కడ కూడా తగ్గడం లేదు

బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి - రాహుల్ ఎంతగా హాట్ టాపిక్ అయ్యారో.. షో పూర్తయ్యాక కూడా అంతే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి కారణం వీళ్లిద్దరూ తరచూ ఏదో ఒక చోట కలవడం.. జంటగా టీవీ షోలకు వెళ్లడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు. దీంతో ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు సాగుతున్నాయి.

ప్రేమ కాస్తా పెళ్లి వరకూ వెళ్లింది

ప్రేమ కాస్తా పెళ్లి వరకూ వెళ్లింది

అటు బిగ్ బాస్ హౌస్‌లో.. ఇటు సోషల్ మీడియాలో రాహుల్ - పునర్నవి గురించి చూసిన వారంతా వీళ్ల మధ్య ఏదో ఉందని అనుకున్నారు. దీనికి బలం చేకూర్చే విధంగా సెలెబ్రిటీలు సైతం మాట్లాడడంతో ఇది నిజమేనేమో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వచ్చాయి.

పార్ట్‌నర్‌ను చేసుకోబోతున్నా

పార్ట్‌నర్‌ను చేసుకోబోతున్నా

తాజాగా రాహుల్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశాడు. ‘నేను ఇండిపెండెంట్ సింగర్‌గా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నా. ఇందులో భాగంగానే త్వరలో ఓ సాంగ్ చేస్తున్నా. ఇందులో పునర్నవిని పార్ట్‌నర్‌ను చేసుకుంటున్నా. బయట అందరూ మా పెయిర్ బాగుందని అంటున్నారు. అందుకే ఆమెను తీసుకుంటున్నా' అని అతడు వెల్లడించాడు.

Recommended Video

CineBox: Chiranjeevi Imitates Pawan Kalyan | Ali Reza To Act In a Crazy Movie
సినిమాపై ప్రచారం మొదలైంది

సినిమాపై ప్రచారం మొదలైంది

టాలీవుడ్‌లోని ఓ యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్, పునర్నవితో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని కొద్ది రోజుల క్రిందట ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన ఓ యంగ్ సెన్సేషన్‌తో కథ రాయించే పనిలో ఉన్నాడట సదరు ప్రొడ్యూసర్. దీంతో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. అయితే, ఆ ప్రొడ్యూసర్ ఎవరనేది మాత్రం బయటకు రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X