రాహుల్ క్రేజ్‌ను వాడుకున్న మెగా హీరో.. లైవ్ కాన్సర్ట్ సక్సెస్.. హాజరుకాని శ్రీముఖి

బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీముఖితో వైరం, పునర్నవితో స్నేహం, ముక్కుసూటిగా వ్యవహరించడం ఇలా ప్రతీ ఒక్క అంశం కలిసిరావడంతో రాహుల్‌ను విజేతగా నిలబెట్టాయి. సింగర్‌గా అంతకు ముందున్న క్రేజ్ కంటే.. బిగ్‌బాస్ విన్నర్‌గా వచ్చిన క్రేజ్ వంద రెట్లు ఎక్కువ. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన అనంతరం బయటకు వచ్చిన రాహుల్.. పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు.

 హౌస్‌లో ఉండడంతో లక్కీ చాన్స్ మిస్..

హౌస్‌లో ఉండడంతో లక్కీ చాన్స్ మిస్..

బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటం చేత రాహుల్ ఓ మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అలవైకుంఠపురములో చిత్రంలోని రాములో రాముల సాంగ్ రాహుల్ పాడాల్సిన పాట అని, దాని కోసం సంగీత దర్శకుడు తమన్.. చాలానే ప్రయత్నించాడని అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు అందుకు ఒప్పుకోకపోవడంతో అనురాగ్ కులకర్ణికి ఆ అవకాశం వచ్చింది.

వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ..

వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ..

బయటకు వచ్చిన రాహుల్‌ ఫుల్ బిజీ అయిపోయాడు. పాటలు పాడుకుంటూ రికార్డింగ్ థియేటర్ల చుట్టు తిరిగాడు.మరోవైపు ఇంటర్వ్యూలు అంటూ టీవీ చానెళ్ల చుట్టు తిరిగాడు. క్షణం తిరిక లేకుండా ఉన్న రాహుల్.. సింగర్‌గా మరిన్ని క్రేజీ ఆఫర్‌లను కొట్టేస్తున్నాడు. బయటకు వచ్చాక అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్‌లో ఓ రెండు సాంగ్‌లు పాడాడు. మరో రెండుమూడు చిన్న సినిమాల్లోని పాటలు కూడా పాడాడు.

రాహుల్ క్రేజ్..మెగా హీరోకు ప్లస్..

రాహుల్ క్రేజ్..మెగా హీరోకు ప్లస్..

ప్రస్తుతం రాహుల్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగింది. రాహుల్ పేరు తెలియన తెలుగు ప్రేక్షకులుండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా రాహుల్ క్రేజ్‌ను మెగా హీరో వాడేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రమైన ప్రతి రోజు పండగే నుంచి ఓ పాటను అతని చేత పాడించారు.అంతేకాకుండా లిరికల్ వీడియోలో కూడా స్టెప్పులు వేయించాడు.మొత్తానికి ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recommended Video

#CineBox : Prabhas To Have Dual Role In His Next Period Drama 'Jaan' ?
లైవ్ కాన్సర్ట్‌తో హల్ చల్..

లైవ్ కాన్సర్ట్‌తో హల్ చల్..

తనకు ఓట్లు వేసిన గెలిపించిన చిచ్చా (ఫ్యాన్స్)కు అంకితమిచ్చేందుకు ఓ లైవ్ కాన్సర్ట్‌ను నిర్వహించాడు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగిందని తెలుస్తోంది. ఈ వేడుకలో సింగర్ నోయెల్‌తో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు. వరుణ్ సందేశ్, అలీ రెజా స్టేజ్ పైకి ఎక్కి హల్ చల్ చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాజరుకాని శ్రీముఖి..

హాజరుకాని శ్రీముఖి..

విన్నర్‌ కావాల్సిన శ్రీముఖి.. రాహుల్‌ను టార్గెట్ చేయడంతో రన్నరప్‌గానే మిగిలిపోయింది. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చాక అక్కడివి గుర్తు పెట్టుకోనని చెప్పిన శ్రీముఖి.. చేతల్లో మాత్రం చూపించడం లేదు. ఈవెంట్‌కు రావాలని ఫోన్ చేసినా అంతగా పట్టించుకోలేదని, మళ్లీ తిరిగి ఫోన్ చేయలేదని రాహుల్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయినా మళ్లీ కాల్ చేసి చెబుతానని, అందర్నీ పిలుస్తానని, ఇక వచ్చేది రానిది వారిష్టమని అన్నాడు. అయితే ఈ ఈవెంట్‌కు శ్రీముఖి హాజరుకాలేదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X