పునర్నవితో రాహుల్ పెళ్లి: జబర్ధస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్ల సహాయంతోనే ఇదంతా!

By Manoj Kumar P

తెలుగు సినీ ఇండస్ట్రీకి సింగర్‌గా పరిచమయమై... తక్కువ కాలంలోనే అద్భుతమైన పాటలతో పాపులర్ అయ్యాడు రాహుల్ సిప్లీగంజ్. ఇక, బిగ్ బాస్ సీజన్ - 3 టైటిల్ నెగ్గిన తర్వాత ఈ కుర్రాడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, మరెన్నో అవకాశాలను అందుకున్నాడు. ఇక, అదే షో ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంది పునర్నవి భూపాలం. ఈ ఇద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో చేసిన రచ్చ వల్ల జంటగా హైలైట్ అయ్యారు. అప్పటి నుంచి వీళ్ల గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్.. పునర్నవిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. అది కూడా జబర్ధస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్ల సమక్షంలో. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ.. వీళ్లే హాట్ టాపిక్

బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ.. వీళ్లే హాట్ టాపిక్

బిగ్ బాస్ సీజన్ - 3 మొత్తానికి రాహుల్ సిప్లీగంజ్, పునర్నవి భూపాలం నడిపిన వ్యవహారమే హైలైట్ అని చెప్పాలి. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చూపించిన తీరుతో ఈ సీజన్‌కు భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంతేకాదు, వీళ్లు హౌస్‌లోనూ బయట కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతూ హాట్ టాపిక్ అయిపోయారు.

లవ్ ట్రాక్ మొదలైంది రాఖీ పండుగ రోజే

లవ్ ట్రాక్ మొదలైంది రాఖీ పండుగ రోజే

గత బిగ్ బాస్‌లో రాఖీ పండుగ రోజు షో నిర్వహకులు కంటెస్టెంట్ల కోసం వాళ్ల వాళ్ల ఇంటి నుంచి వచ్చిన రాఖీలను అందించారు. వాటిని లేడీ కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్న మగవాళ్లకు కట్టారు. అలాగే, మగవాళ్లు సోదరిగా భావించిన అమ్మాయితో కట్టించుకున్నారు. ఆ సమయంలో పునర్నవి ‘హౌస్ ఉన్న వాళ్లందరికీ రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప' అనడంతో వీళ్ల ట్రాక్ మొదలైంది.

కెమెరాల ముందే రొమాన్స్... ఆ డైలాగ్స్

కెమెరాల ముందే రొమాన్స్... ఆ డైలాగ్స్

రాఖీ తర్వాత పునర్నవి - రాహుల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకు అనుగుణంగానే ఈ ఇద్దరూ తరచూ రొమాంటిక్‌గా కనిపించేవారు. కెమెరాలు ఉన్నప్పటికీ... డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవారు. అంతేకాదు.. షోలో జరిగే టాస్క్‌ల్లో ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ వచ్చారు. దీంతో వీళ్లిద్దరిపై మిగిలిన వారు ఆగ్రహం వ్యక్తం చేసేవారు.

అక్కడ మాత్రమే కాదు.. బయట కూడా

అక్కడ మాత్రమే కాదు.. బయట కూడా

బిగ్ బాస్ హౌస్‌లో మాత్రమే కాదు... బయటకు వచ్చిన తర్వాత కూడా రాహుల్.. పునర్నవి కలిసే తిరుగుతూ కనిపించేవారు. తరచూ పార్టీలు చేసుకోవడంతో పాటు మిగిలిన కంటెస్టెంట్లతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసేవారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్తలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో వీళ్ల క్రేజ్‌ను వాడుకుని కొందరు షోలు కూడా చేసేశారు.

రాహుల్ అలా... పునర్నవి మాత్రం ఇలా

రాహుల్ అలా... పునర్నవి మాత్రం ఇలా

బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత రాహుల్ సిప్లీగంజ్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. సింగర్‌గా ఫుల్ బిజీగా ఉన్న అతడు... క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ'తో యాక్టర్‌గానూ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే, మరికొన్ని చిత్రాలకు సంబంధించిన కథలను వింటున్నాడు. పునర్నవి మాత్రం ఆఫర్లు అందుకోవడంలో విఫలం అవుతుందనే చెప్పాలి.

పునర్నవితో రాహుల్ పెళ్లి.. లేచిపోయి

పునర్నవితో రాహుల్ పెళ్లి.. లేచిపోయి

ఒక్కొక్కరిగా కంటే జంటగా ఎక్కువ ఆఫర్లు వస్తుండడంతో రాహుల్ - పునర్నవి కలిసి పని చేయాలని డిసైడ్ అయినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు అందుకు అనుగుణంగానే ఈటీవీలో వినాయక చవితి సందర్భంగా ‘2020 అనుకున్నది ఒకటి అయింది ఒకటి' అనే ఈవెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రోమో విడుదలైంది. ఇందులో వీళ్లిద్దరికీ ప్రేమ వివాహం చేస్తున్నట్లు చూపించారు.

Recommended Video

Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
జబర్ధస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్ల సమక్షంలో

జబర్ధస్త్, బిగ్ బాస్ కంటెస్టెంట్ల సమక్షంలో

ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ ఈవెంట్‌లో రాహుల్ - పునర్నవి పెళ్లినే హైలైట్ చేసినట్లు కనిపిస్తోంది. దీనికి కరోనా కష్టాలను జోడించి కామెడీగా చేస్తున్నారు. దీనికి స్పెషల్ గెస్టుగా కమెడియన్ సునీల్ విచ్చేశాడు. అలాగే, జబర్ధస్త్ టీమ్ మెంబర్లు ఆది, సుధీర్, గెటప్ శ్రీను, ఇమ్మాన్యూయేల్, రాంప్రసాద్‌తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్లు శ్రీముఖి, రోహిణి, హిమజ కూడా పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X