ధృవ సంగీత దర్శకుడితో రాహుల్ సిప్లిగంజ్.. అతనే తనకు స్ఫూర్తి.. పోస్ట్ వైరల్
బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్ ఎంత సరదాగా నడిచిందో అందరికీ తెలిసిందే. మధ్యలో కారాలు మిరియాలు నూరినట్టు గొడవలు అయినా కూడా చివరకు అందరూ కలిసిపోయేవారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో చాలా మంది పార్టిసిపెంట్స్ వెలుగులోకి వచ్చారు. అయితే ఈ చివరి వరకు ఉత్కంఠ సాగిన టైటిల్ పోరు రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌తో పాటు, ప్రైజ్ మనీని ఎత్తుకెళ్లిపోయాడు.

పెరిగిన క్రేజ్..
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నంత కాలం పునర్నవి, వరుణ్ సందేశ్, వితికాలతో స్నేహం చేస్తూ అందరితో కలిసిపోయాడు. శ్రీముఖితో వైరం కూడా రాహుల్‌కు కలిసి వచ్చింది. అతని నిజాయితీ, పునర్నవితో కెమిస్ట్రీ, శ్రీముఖితో గొడవలు ఇలా అన్నీ కలిసి రాహుల్‌ను విజేతగా నిలబెట్టాయి. బిగ్‌బాస్ వల్ల రాహుల్ క్రేజ్ వేయింతలు పెరిగింది.

ఫుల్ పార్టీలు..
విజేతగా నిలిచిన రాహుల్.. బయటకు వచ్చాక హౌస్‌మేట్స్‌తో కలిసి ఫుల్ పార్టీలు చేసుకున్నాడు. అలీ రెజా, వరుణ్ సందేశ్, వితికా, పునర్నవి, గ్యాంగ్‌తో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు. అంతేకాకుండా తనకు ఓట్లు వేసి గెలిపించిన చ్చిచ్చా(అభిమానులు)ల కోసం ఓ ఈవెంట్ ఏర్పాటు చేశాడు.

బిజగా మారిన విన్నర్..
మూడో సీజన్ టైటిల్ విజేతగా బయటకు వచ్చిన రాహుల్‌కు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగాయి. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ చక్కటి అవకాశం లభించింది. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండలో ఓ పాత్రను పోషించే చాన్స్ దక్కింది. ఇలా పాటలతో, నటనతో బిజీగా మారిపోయాడు.
Recommended Video

ధృవ సంగీత దర్శకుడితో..
తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ధృవ సంగీత దర్శకుడైన హిప్ అప్ తమిళను కలిసిన ఫోటోను షేర్ చేశాడు. తమిళంలో ఇండిపెండెంట్ మ్యుజిషియన్ అయిన హిప్ అప్ తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











