మంచి అవకాశం చేజారిపోయింది.. ఫీలవుతున్న రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్స్
బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ గెలిచేశాడు. సంబరాలు కూడా చేసేసుకుంటున్నాడు. పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేస్తున్నాడు. రాహుల్ ఓ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఈ వార్త తెలుసుకున్న చిచ్చా ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఇంతకీ ఆ విషయం ఏంటన్నది ఓ సారి చూద్దాం.

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో రాహుల్ ఫేమస్..
మంగమ్మా, మాక్కిరికిరి, పూర్ బాయ్, పెద్దపులి లాంటి మాస్ బీట్స్‌తో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.
గల్లీలో మాట్టాడే మాటలతో అందరీకి చేరువయ్యేలా ఉండేట్టు ఆల్బమ్ చేయడం తనకు ఇష్టమని చెప్పుకొస్తాడు. ఈ క్రమంలో గల్లీ సాంగ్స్‌ను తనదైన శైలిలో అందరూ మెచ్చేలా క్రియేట్ చేసి.. ఫుల్ ఫేమస్ అయ్యాడు.

రంగస్థలం పాటతో..
రామ్ చరణ్ రంగస్థలంలోని రంగ రంగ స్థలాన అనే పాటతో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ పాటతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అదే సినిమా పాటకు ఉండే పవర్. ఒక్కసారి పెద్ద సినిమాలో ఒక్కపాడితే.. అది హిట్ అయితే.. వచ్చే క్రేజ్ వేరు. ఎన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేసినా.. రాని పేరు అలా ఒక్కపాటతో ఓవర్ నైట్ స్టార్‌ను చేసేస్తుంది. అలాంటి ఓ మంచి అవకాశం రాహుల్‌కు దక్కకుండా పోయింది.

ట్రెండింగ్‌గా మారిన పాటలు..
అలవైకుంఠపురములో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. సామజవరగమన, రాములో రాముల పాటలు ఎంతటి సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతూనే ఉన్నాయి. యూట్యూబ్‌లో అత్యధిక లైకులు సాధించిన పాటలుగా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.

రాములో రాముల పాటను మిస్ అయిన రాహుల్..
రాములో రాముల పాటను కాస్తా.. రాహులో రాహుల అంటూ గత వారం ట్రెండ్ చేసిన సంగతి తెలసిందే. అయితే అది రాహుల్ పాడాల్సిన పాట అయితే.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో ఆ గోల్డెన్ చాన్స్ మిస్ అయ్యాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా వెల్లడించాడు.

ఫలించని తమన్ ప్రయత్నాలు..
అయితే ఆ పాటను రాహుల్ చేతనే పాడించాని తమన్ అనుకున్నాడట. బిగ్‌బాస్ బృందంతో చర్చలు కూడా జరిపాడట.. హౌస్‌లోనే రికార్డు చేసేందుకు అనుమతి అడిగాడట కానీ అందుకు ఆ టీమ్ ఒప్పుకోలేదని..దీంతో ఆ చాన్స్ మిస్ అయ్యానని రాహుల్ చెప్పుకొచ్చాడు. తాను బయటకు వచ్చాక ఈ విషయాలన్నీ తన స్నేహితుడు నోయెల్ వివరించాడని తెలిపాడు.

ఫీలవుతున్న చిచ్చా ఫ్యాన్స్..
రాములో రాముల పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ పాట పాడటంతో అనురాగ్ కులకర్ణి పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇంతటి గోల్డెన్ చాన్స్ చేజారిపోవడంతో రాహుల్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.


Click it and Unblock the Notifications











