twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ టైటిల్ సీక్రెట్.. రాహుల్ గెలుపు వెనుక 'వైఎస్ జగన్' పాత్ర.. విన్నర్ ఓపెన్ స్టేట్‌మెంట్

    |

    తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. 15 మంది కంటెస్టెంట్లు, 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలకడం జరిగింది. టైటిల్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా, రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది. ఈ నేపథ్యంలో ఊహించని విధంగా టైటిల్ సీక్రెట్ చెప్పాడు రాహుల్ సిప్లిగంజ్. వివరాల్లోకి పోతే..

    చివరిదాకా ఉత్కంఠ పోరు.. రాహుల్ సిప్లిగంజ్ చేతిలో ట్రోఫీ

    చివరిదాకా ఉత్కంఠ పోరు.. రాహుల్ సిప్లిగంజ్ చేతిలో ట్రోఫీ

    నిజానికి బిగ్ బాస్ సీజన్ 3 పోరు ఫైనల్ దాకా ఉత్కంఠ భరితంగా సాగింది. శ్రీముఖి రూపంలో రాహుల్ సిప్లిగంజ్ గట్టి పోటీ ఎదుర్కొన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు విన్ అవుతారనేది ఊహించడమే కష్టంగా మారింది. అలాంటి తరుణంలో రాహుల్ సిప్లిగంజ్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ పడింది. దీంతో ఈయన గెలుపుకు కారణాలేమిటి? అనే కోణంలో చర్చలు మొదలయ్యాయి.

    అప్పటిదాకా తెలియలేదు.. బయటకొచ్చాక

    అప్పటిదాకా తెలియలేదు.. బయటకొచ్చాక

    తనకు బిగ్ బాస్ ట్రోఫీ దక్కడం, ఊహించని రీతిలో ఆడియన్స్ నుంచి ఓట్లు పోల్ కావడం వెనుక సీక్రెట్ ఇదే అయి ఉండొచ్చు అంటూ ఓపెన్ అయ్యాడు రాహుల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన విజయం వెనుక వైఎస్ జగన్ అభిమానుల పాత్ర ఉందని అనేశాడు. తనకు బయటికి వచ్చిన తర్వాతే ఈ నిజం తెలిసిందని ఈ సందర్బంగా ఆయన పేర్కొంటూ షాకిచ్చాడు.

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Rahul Sipligunj Rahul Sipligunj Wins The Trophy || Filmibeat Telugu
    వైఎస్ జగన్ కారణంగా.. యువతలో మంచి ఫాలోయింగ్

    వైఎస్ జగన్ కారణంగా.. యువతలో మంచి ఫాలోయింగ్

    బయట ఎలా ఉన్నానో బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉన్నానని, బహుశా అదే తనకు బాగా ప్లస్ అయి ఉండొచ్చని రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. కాగా తన గెలుపుకు ప్రధానంగా వైఎస్ జగన్ కారణమై ఉంటాడని తనకు సన్నిహితులు చెప్పినట్లు పేర్కొన్నాడు రాహుల్. మొదట్లో మ్యూజిక్ వీడియోలు చేసి యువతలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నానని, అది కూడా తనకు బాగా కలిసొచ్చిందని ఆయన అన్నాడు.

    స్వయంగా స్పందించిన రాహుల్.. అదే కీలకం అనడంతో!

    స్వయంగా స్పందించిన రాహుల్.. అదే కీలకం అనడంతో!

    ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిపై స్వయంగా ఓ పాట కంపోజ్ చేసి పాడాడు రాహుల్ సిప్లిగంజ్. దీంతో అది వైఎస్ అభిమాన వర్గాలను రాహుల్‌కి బాగా దగ్గర చేసింది. సో.. ఆ కారణంగానే జగన్ ఫ్యాన్స్ అంతా గుంపగుత్తగా రాహుల్‌కు ఓటేసి ఉంటారని కూడా చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో జగన్ పాట తన గెలుపులో కీ రోల్ ప్లే చేసిందని రాహులే స్వయంగా చెప్పడం హాట్ టాపిక్ అయింది.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna. This season title won by Rahul Sipligunj. Now he open his voice on his victory.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X