ఇంట్రెస్టింగ్: బిగ్ బాస్ విన్నర్ రాహుల్ ఫ్రైజ్ మనీలో కోత.. రూ. 50 లక్షలు కాదట.!

By Manoj Kumar P

Recommended Video

Bigg Boss Telugu 3 : Rahul Sipligunj Rahul Sipligunj Wins The Trophy || Filmibeat Telugu

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. గత ఆదివారం ముగిసిన మూడో సీజన్‌లో ప్రముఖ యంగ్ సింగర్ రాహుల్ సింప్లీగంజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అతడికి యాంకర్ శ్రీముఖి నుంచి హోరాహోరీ పోరు ఎదురైంది. అయినప్పటికీ ప్రేక్షకుల మద్దతుతో రాహుల్ బిగ్ బాస్ ట్రోఫీని ముద్దాడాడు. బిగ్ బాస్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ విషయంలో తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటా వార్త..?

భారీ స్థాయిలో ఓటింగ్

భారీ స్థాయిలో ఓటింగ్

గత రెండు సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ ఫైనల్‌ కంటెస్టెంట్లకు భారీ స్థాయిలో ఓట్లు పడ్డాయి. ఫైనల్ ఎపిసోడ్ జరిగిన రోజు షో హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించాడు. పదిహేనో వారం మొత్తంగా ఐదుగురు కంటెస్టెంట్లకు కలిపి ఎనిమిది కోట్ల పైచిలుకు ఓట్లు లభించాయి. ఇది ఒక రికార్డు అని షో నిర్వహకులు పేర్కొంటున్నారు.

బిగ్ బాస్ విజేతకు రూ. 50 లక్షలు

బిగ్ బాస్ విజేతకు రూ. 50 లక్షలు

తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సీజన్లు ముగిశాయి. ఆ ఇంట్లో తుది కంటా పోరాడి విజయం సాధించిన కంటెస్టెంట్‌కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందిస్తున్నారు. ఇది మొదటి సీజన్ నుంచే కొనసాగుతూ వస్తోంది. దీనితో పాటు రోజు వారీ రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాహుల్ ఏం చేస్తాడంటే...

రాహుల్ ఏం చేస్తాడంటే...

బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌కు ముందు ‘మీకు వచ్చే రూ. 50 లక్షలతో ఏం చేస్తారు' అని నాగ్ ఇంట్లోని కంటెస్టెంట్లను ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనికి రాహుల్ తన తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తానని వెల్లడించాడు. ‘ఏడేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఒకవేళ నేను సీజన్ విన్నర్ అయితే, నాకు వచ్చే ప్రైజ్ మనీతో ఓ ఫ్లాట్ కొంటా' అని రాహుల్ తెలిపాడు.

 రాహుల్‌కు మొత్తం ఇవ్వలేదట

రాహుల్‌కు మొత్తం ఇవ్వలేదట

ఇక, ఈ సీజన్‌లో విజేతగా నిలిచిన రాహుల్ సింప్లిగంజ్‌కు అధికారికంగా ప్రకటించిన రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వలేదట షో నిర్వహకులు. దీనికి కారణం టాక్సులేనని సమాచారం. రాహుల్ గెలుచుకున్న రూ. 50 లక్షల ప్రైజ్ మనీలో దాదాపు రూ. 15 లక్షలు టాక్సుల రూపంలో కట్ అయ్యాయట. దీంతో అతడికి రూ. 35 లక్షలు మాత్రమే దక్కాయని అంటున్నారు.

 ప్రైజ్ మనీ మాత్రమే కాదు

ప్రైజ్ మనీ మాత్రమే కాదు

అయితే, రాహుల్ సంపాదించిన ఈ రూ. 35 లక్షలకు తోడు రోజు వారీ రెమ్యూనరేషన్ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. హౌస్‌లోకి ఎంటరయ్యే ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కు వాళ్ల డిమాండ్‌ను బట్టి రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తారట షో నిర్వహకులు. దీనికి తోడు ఫైనల్‌లో గెలుచుకున్న మొత్తం కూడా చెల్లిస్తారట. అంటే రాహుల్‌కు ప్రైజ్ మనీ మాత్రమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా దక్కుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X