షాకింగ్: కెమెరాల ముందే ‘ఐ లవ్ యూ’ చెప్పిన రాహుల్.. ఊహించని ఆన్సర్ ఇచ్చిన పునర్నవి
బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లో గొడవలు.. కామెడీ సీన్స్.. రొమాన్స్ కనిపిస్తోంది. మిగిలిన అన్ని హౌస్‌మేట్స్ అందరి మధ్య జరుగుతుండగా.. రొమాన్స్ మాత్రం దంపతులైన వరుణ్ సందేశ్, వితికల మధ్యనే జరిగేవి. కానీ, కొద్దిరోజులుగా ఇంట్లో మరో జంట మధ్య సరికొత్త చర్చ జరుగుతోంది. వాళ్లెవరో కాదు.. పునర్నవి - రాహుల్. వీరి మధ్య తాజాగా జరిగిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.

డేటింగ్ సంభాషణతో మొదలు
బిగ్ బాస్ ప్రారంభం సమయంలో జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. దానికి సమాధానంగా నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా అని పునర్నవి అన్నది. అప్పుడు రాహుల్ నువ్వు డేట్‌లో ఉన్నావా అనగానే ఆమె అవును అని చెప్పింది. అప్పటి నుంచి వీళ్ల పులిహోర కహానీ మొదలైంది.

నాగార్జున ప్రస్తావించడంతో హైలైట్
ఓ శనివారం నాగార్జున దీనిపై మాట్లాడాడు. ఆయన చేతిలో ఉండే కోతి.. ఈ మధ్య అతడు డేటింగ్ గురించి మాట్లాడుతున్నాడు బాస్ అంటూ అనగానే అందరూ రాహుల్ వైపు చూశాడు. అప్పుడు రాహుల్ ఏదో సమాధానం చెబుతుండగా.. నాగ్ కలుగజేసుకుని నువ్వు సేఫ్ అయ్యావ్ అని చెప్పడంతో దానికి పుల్‌స్టాప్ పడిపోయింది.

నీకు ప్రపోజ్ చేయాలంటే ఎలా..?
కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ బజ్ నుంచి మరో వీడియో వచ్చింది. ఇందులో రాహుల్ - పునర్నవి మధ్య జరిగిన చర్చను చూపించారు. ‘బిగ్ బాస్‌లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత సడెన్‌గా కలిసి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసినంటే ఏం చేస్తావ్' అని రాహుల్ ప్రశ్నించాడు. దానికి పునర్నవి ‘ఫస్ట్ నేనేంటో తెలుసుకో' అని సమాధానం ఇచ్చింది. అప్పుడు రాహుల్ ‘నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పు. మజాక్ ఆడుతున్నా.. సీరియస్‌గా తీసుకోకు' అన్నాడు. దీనికి పునర్నవి ‘పో.. పోయి పని చూసుకో అంటా' అంది.

హ్యాపీ రక్షాబంధన్.. రాహుల్‌కు తప్ప
ఆ తర్వాత పునర్నవి లవ్ ట్రాక్‌కు బలం చేకూర్చే విధంగా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘హౌస్ ఉన్న వాళ్లందరికీ రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప' అని అనగానే అందరూ గట్టిగా కేకలు వేశారు. దీంతో రాహుల్ ముఖంలో గర్వం కనిపించగా.. అందరూ నవ్వుకున్నారు. ఇప్పటికే డేటింగ్.. లవ్ సంభాషణలతో ఈ జంట చర్చనీయాంశం అవ్వగా.. ఇప్పుడు మాత్రం వీళ్ల గురించి బయటకు రావడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇద్దరికీ ఇష్టమే కానీ అలా కాదు
ఇక, శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో రాహుల్.. పునర్నవికి ప్రపోస్ చేశాడు. వరుణ్, వితికతో కలిసి వీళ్లిద్దరూ మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా వితిక.. నీకు నిజంగా పునర్నవి మీద ఫిలింగ్స్ లేవా అని రాహుల్‌ను ప్రశ్నించింది. దీనికి తనకు పున్ను అంటే ఇష్టం అని సమాధానం ఇచ్చాడు. కానీ, దీని వెనుక వేరే ఉద్దేశం లేదన్నాడు. అదే సమాధానం పునర్నవి కూడా చెప్పింది.

ప్రపోస్ చేసేశాడు
ఈ సమయంలోనే రాహుల్.. పునర్నవి వైపు తిరిగి ‘ఐ లవ్ యూ' అని చెప్పాడు. దీనికి పునర్నవి ఏమీ సమాధానం ఇవ్వలేదు. కానీ, వరుణ్ సందేశ్ మాత్రం ఆమెను గుచ్చి గుచ్చి అడిగాడు. దీంతో ‘నాకు ఇప్పటికే లవర్ ఉన్నాడు. మేమిద్దరం ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నాము' అని చెప్పింది. దీంతో ఈ సంభాషణ ముగిసిపోయింది.


Click it and Unblock the Notifications











