అన్ సీన్ వీడియో: నేను నీకు రింగ్ ఇచ్చి ప్రపోస్ చేస్తే ఏం చేస్తావ్: పునర్నవిని ప్రశ్నించిన రాహుల్

Recommended Video

rahul_sipligunj_to_punarnavi_what_happens_if_i_suddenly_propose_you

తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో హౌస్‌లో గొడవలు.. కామెడీ సీన్స్.. రొమాన్స్ కనిపిస్తోంది. మిగిలిన అన్ని హౌస్‌మేట్స్ అందరి మధ్య జరుగుతుండగా.. రొమాన్స్ మాత్రం దంపతులైన వరుణ్ సందేశ్, వితికల మధ్యనే జరిగేవి. కానీ, కొద్దిరోజులుగా ఇంట్లో మరో జంట మధ్య సరికొత్త చర్చ జరుగుతోంది. వాళ్లెవరో కాదు.. పునర్నవి భూపాలం - రాహుల్ సింప్లీగంజ్. వీరి మధ్య జరిగిన సంభాషణ దీనికి బలం చేకూర్చుతోంది.

డేటింగ్ సంభాషణతో మొదలు

డేటింగ్ సంభాషణతో మొదలు

గత వారం జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. దానికి సమాధానంగా నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా అని పునర్నవి అన్నది. అప్పుడు రాహుల్ నువ్వు డేట్‌లో ఉన్నావా అనగానే ఆమె అవును అని చెప్పింది.

నాగార్జున నోటి నుంచి రావడంతో..

నాగార్జున నోటి నుంచి రావడంతో..

పోయిన శనివారం నాగార్జున దీనిపై మాట్లాడాడు. ఆయన చేతిలో ఉండే కోతి.. ఈ మధ్య అతడు డేటింగ్ గురించి మాట్లాడుతున్నాడు బాస్ అంటూ అనగానే అందరూ రాహుల్ వైపు చూశాడు. అప్పుడు రాహుల్ ఏదో సమాధానం చెబుతుండగా.. నాగ్ కలుగజేసుకుని నువ్వు సేఫ్ అయ్యావ్ అని చెప్పడంతో దానికి పుల్‌స్టాప్ పడిపోయింది.

బిగ్ బాస్ బజ్‌లో వీడియోలు

బిగ్ బాస్ బజ్ అంటూ స్టార్ మా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఈ కార్యక్రమంలో గత సీజన్‌లో పాల్గొన్న తనీష్ ఇంటర్వ్యూ చేయడం.. రాత్రి జరిగే ఎపిసోడ్‌లో మిస్ అయిన కంటెంట్‌ను చూపించడం కోసం దీన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో ఉంచుతున్నారు.

నీకు ప్రపోజ్ చేయాలంటే ఎలా..?

నీకు ప్రపోజ్ చేయాలంటే ఎలా..?

తాజాగా బిగ్ బాస్ బజ్ నుంచి మరో వీడియో వచ్చింది. ఇందులో రాహుల్ - పునర్నవి మధ్య జరిగిన చర్చను చూపించారు. ‘బిగ్ బాస్‌లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత సడెన్‌గా కలిసి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసినంటే ఏం చేస్తావ్' అని రాహుల్ ప్రశ్నించాడు. దానికి పునర్నవి ‘ఫస్ట్ నేనేంటో తెలుసుకో' అని సమాధానం ఇచ్చింది. అప్పుడు రాహుల్ ‘నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పు. మజాక్ ఆడుతున్నా.. సీరియస్‌గా తీసుకోకు' అన్నాడు. దీనికి పునర్నవి ‘పో.. పోయి పని చూసుకో అంటా' అంది.

గతంలో డేటింగ్ గురించి..

డేటింగ్ విషయమై పునర్నవి - రాహుల్ మధ్య ఇటీవల ఓ సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా స్టార్ మా విడుదల చేసింది. ఇందులో ‘అందరూ డేటింగ్ డేటింగ్ అంటుంటే నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు. నాగార్జున గారికి కూడా సమాధానం ఎందుకు చెప్పలేదు. అందరూ అంటున్నా సైలెంట్‌గా ఎందుకుంటున్నావ్' అని రాహుల్‌ను ప్రశ్నించింది పునర్నవి.

రాహుల్ కూడా సమాధానం చెప్పాడు

రాహుల్ కూడా సమాధానం చెప్పాడు

పునర్నవి ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెప్పాడు. ‘నేను నీ పక్కనే ఎప్పుడూ కూర్చోలేదు. నాగ్ సార్‌కు కూడా చెప్పా మాది ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అని చెబుతుంటే ఆయన ఆపు ఆపు అన్నారు. ఇప్పుడేమైంది..? ఏమైనా ప్రాబ్లమా..?' అని అనగానే పునర్నవి కొంటె నవ్వు నవ్వింది. అంతలో అక్కడకు వితిక షేరు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X