కలుసుకున్న పునర్నవి, రాహుల్.. కొత్త లుక్‌లో కేక పుట్టిస్తోన్న జంట.. సోషల్ మీడియాలో వైరల్ పిక్

బిగ్‌బాస్ మూడో సీజన్‌ అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ సరదగానే గడిచిపోయింది. ప్రేమలు, గొడవలు, అరుపులు, అలకలు, బుజ్జగింపులతో సీజన్ మొత్తం బాగానే నడిచింది. కాకపోతే ఈ సారి మాత్రం కొన్ని ఎక్కువయ్యాయి. ప్రేమలు, బుజ్జగింపుల పర్వం చాలా రోజులపాటు కొనసాగుతూ వచ్చింది. దీనికీ ఓ కారణం లేకపోలేదు. మొట్టమొదటి సారిగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓ జంటను పంపించడంతో ఆ ఎమోషన్స్ కాస్త ఎక్కువయ్యాయి.

నలుగురు కలిసి ఓ గ్రూప్..

నలుగురు కలిసి ఓ గ్రూప్..

వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్ ఓ గ్రూప్‌గా ఏర్పడ్డారు. హౌస్‌లోకి వచ్చిన మొదటి రోజు నుంచే వీరిమధ్య స్నేహం కుదిరింది. అది అలా అలా కొనసాగుతూ సీజన్ మొత్తం నిలిచిపోయింది. ఈ నలుగురిని మిగతా వారు పదే పదే టార్గెట్ చేయడంతో వీరిపై అందరికీ సింపతి పెరిగింది.

నామినేషన్‌లోకి ఎక్కువగా వెళ్లింది వీరే..

నామినేషన్‌లోకి ఎక్కువగా వెళ్లింది వీరే..

నామినేషన్ విషయం వచ్చేసరికి మిగతా హౌస్‌మేట్స్ అంతా ఈ నలుగురిని టార్గెట్ చేశారు. ఇదే విషయమై ఓసారి పునర్నవి ఫైర్ అయింది. అందరూ కలిసి మనల్నే నామినేట్ చేస్తున్నారంటూ వరుణ్‌తో చెప్పుకొచ్చింది. అలా ఈ గ్రూప్‌ను టార్గెట్ చేయడం వారికి కలిసి వచ్చింది. ఈ నలుగురు కలిసి ఉన్నంతవరకు వారినేమీ చేయలేమని మిగతా కంటెస్టెంట్లు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్రేమలు, బుజ్జగింపులు..

ప్రేమలు, బుజ్జగింపులు..

వరుణ్, వితికా మధ్య బుజ్జగింపుల పర్వం ఎక్కువగా కొనసాగింది. ఆ తరువాత రాహుల్, పునర్నవి మధ్య జరిగింది. చిన్న చిన్న మాటలకే అలగడం, ఆపై ఒకరినొకరు బుజ్జగించుకోవడం జరుగుతూ వచ్చింది. టాస్క్‌లో భాగంగా వితికాపై వరుణ్ ఫైర్ అవ్వడం.. ఆమె ఏడ్చుకుంటూ ఉండటం.. ఆమె వెంటే వరుణ్ వెళ్లి బుజ్జగించడం చూశాం. ఇలా ఈ సీజన్‌లో వీరి నలుగురి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచింది.

టాప్5లో ఇద్దరు..

ఈ గ్రూప్‌లో ఉన్న నలుగురిలో ఇద్దరు టాప్5లో నిలవడమే కాకుండా.. బిగ్‌బాస టైటిల్ గెలిచాడు. పునర్నవి ఆశించినట్టుగానే.. రాహుల్, వరుణ్‌లో ఎవరైనా సరే విన్నర్, రన్నర్‌లు కావాలని, ఈ ఇద్దరే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. చివరకు రాహుల్ విన్నర్‌గా నిలిచాడు. కానీ వరుణ్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

రీసెంట్‌గా కలుసుకున్న ఆ నలుగురు

బిగ్‌బాస్ హౌస్‌లోంచి బయటకు వచ్చిన వెంటనే.. ఆ రాత్రే నలుగురు కలిసి పార్టీ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండిపోయారు. రాహుల్ పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉండగా.. మధ్యలో ఫోన్ కాల్‌లో మాట్లాడే వారు. అయితే రీసెంట్‌గా నిన్న రాత్రి వీరంతా కలిసి బాగానే ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.

Recommended Video

Cine Box : Suriya’s Aakasam Nee Haddura First Look Is Out || 'రూలర్’లో ఆ సీన్‌కు పునకాలు ఖాయమట.!
కొత్త లుక్‌లో కేకపుట్టిస్తోన్న జంట..

కొత్త లుక్‌లో కేకపుట్టిస్తోన్న జంట..

వరుణ్ సందేశ్, వితికా షెరు కొత్త లుక్‌లోకి మారిపోయారు. అల్ట్రా మోడ్రన్ లుక్‌లో ఉన్న ఈ జంట న్యూలుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్ కోడ్‌లో స్టయిలీష్‌గా ఉన్న వరుణ్, వితికాలను చూసి నెటిజన్లు లైక్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X