Just In
- 21 min ago
హృతిక్, ఆమిర్ తర్వాత ప్రభాసే: బాలీవుడ్‌లోకి యంగ్ రెబెల్ స్టార్.. రూ. 1000 కోట్లతో సినిమా
- 57 min ago
అది నోరా, చూస్తే వాంతులు.. అన్ని మూసుకోని కూర్చొ.. మంచు లక్ష్మీపై శ్రీరెడ్డి ఫైర్.. మనోజ్ విడాకులపై
- 1 hr ago
సూర్యుడివో చంద్రుడివో.. ఫ్యామిలీ టచ్ ఇచ్చిన ‘సరిలేరు’
- 2 hrs ago
అలవైకుంఠపురములో టీజర్ గ్లింప్స్.. కేక పుట్టిస్తోన్న బన్నీ
Don't Miss!
- News
‘జగనన్న ఉల్లిపాయల పథకం’ అని పెట్టుకోండి: ప్రాణాలు పోతున్నా అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్
- Automobiles
యమహా ఆర్15 వి3.0 బిఎస్ -VI వర్షన్ యొక్క స్థాపన
- Sports
85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్
- Lifestyle
కామోద్దీపనలు రగిలించే విటమిన్లు మరియు ఖనిజాలున్న ఆహారాలు! మిస్ చేసుకోకండి..
- Technology
అనిమోజీ మరియు మెమోజీ సపోర్టుతో ఆపిల్ క్లిప్స్ యాప్
- Finance
మరో రూ.1 లక్ష కోట్లు టార్గెట్, వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్: నేరుగా కాకుండా...
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పునర్నవి కోసం రక్తం ధారపోశా.. మహేశ్ నన్ను ఓదార్చాడు: సీక్రెట్ రివీల్ చేసిన రాహుల్
బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. గత ఆదివారం ముగిసిన మూడో సీజన్లో ప్రముఖ యంగ్ సింగర్ రాహుల్ సింప్లీగంజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అతడికి యాంకర్ శ్రీముఖి నుంచి హోరాహోరీ పోరు ఎదురైంది. అయినప్పటికీ ప్రేక్షకుల మద్దతుతో రాహుల్ బిగ్ బాస్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ సీజన్ ముగిసినప్పటి నుంచి రాహుల్ ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా జరిగిన ఓ ఇంటరాక్షన్‌లో రాహుల్.. బిగ్ బాస్‌లో జరిగిన ఓ అన్‌సీన్ ఘటన గురించి వెల్లడించాడు.

ఓటింగ్ రాహుల్‌కు కలిసొచ్చింది
మూడో సీజన్లో విజేతగా నిలిచిన రాహుల్ సింప్లింగంజ్కు ఎన్నో అంశాలు కలిసొచ్చాయి. ముఖ్యంగా అతడు పదిహేను వారాల్లో పదకొండు సార్లు నామినేట్ అవడం కూడా ఒక రకంగా ప్లస్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతడికి హాట్‌స్టార్‌లో ఓటు వేయడం, మిస్డ్ కాల్ చేయడం కూడా ప్రేక్షుకులకు అలవాటు అయిపోయింది. దీంతో రాహుల్ ఎప్పుడు నామినేట్ అయినా ఓట్లు భారీగా పడిపోయాయట.

లవ్ ట్రాక్ కూడా వర్కౌట్ అయింది
బిగ్ బాస్ హౌస్‌లో అత్యంత హాట్ టాపిక్ అయిన వ్యవహారాల్లో పునర్నవి - రాహుల్ లవ్ ట్రాక్ ప్రధమ స్థానంలో ఉంటుంది. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణలు, రొమాన్స్‌ను ప్రేక్షకులు బాగా చూసేవాళ్లు. ముఖ్యంగా యువత వీరి లవ్ ట్రాక్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండేవారు. ఇది కూడా రాహుల్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

హౌస్‌లో హల్చల్ చేసేశారు
బిగ్ బాస్ ప్రారంభం సమయంలో జరిగిన ఓ ఎపిసోడ్లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. దానికి సమాధానంగా నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా అని పునర్నవి అన్నది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వీళ్లిద్దరూ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.

హ్యాపీ రక్షాబంధన్.. రాహుల్‌కు తప్ప
ఆ తర్వాత ఓ ఎపిసోడ్లో పునర్నవి.. లవ్ ట్రాక్‌కు బలం చేకూర్చే విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ‘హౌస్ ఉన్న వాళ్లందరికీ రాఖీ శుభాకాంక్షలు ఒక్క రాహుల్‌కి తప్ప' అని అనగానే అందరూ గట్టిగా కేకలు వేశారు. దీంతో రాహుల్ ముఖంలో గర్వం కనిపించగా.. అందరూ నవ్వుకున్నారు. ఇప్పటికే డేటింగ్.. లవ్ సంభాషణలతో ఈ జంట చర్చనీయాంశం అవ్వగా.. ఇప్పుడు మాత్రం వీళ్ల గురించి బయటకు రావడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.

పునర్నవి కోసం లైఫ్ రిస్క్
షోలో భాగంగా ఓ వారం నామినేషన్ టాస్క్‌లో త్యాగం చేయాల్సిన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్‌లో ఒకరు సేవ్ అవ్వాలంటే మరొకరు ఏదైనా ఒక త్యాగం చేయాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టాడు. ఈ క్రమంలోనే పునర్నవి కోసం రాహుల్ 20 గ్లాసుల కాకర కాయ జ్యూస్ తాగాలని చెప్పాడు. ఆమెను కాపాడేందుకు రాహుల్ ఈ పనిని పూర్తి చేశాడు. దీంతో పునర్నవి సేవ్ అయిపోయింది.

సీక్రెట్ రివీల్ చేసిన రాహుల్
ఈ టాస్క్ తర్వాత జరిగిన, ప్రేక్షకులకు చూపించని ఓ విషయాన్ని రాహుల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘కాకర కాయ జ్యూస్ తాగినప్పుడు చాలా వికారంగా అనిపించింది. మొదటి నాలుగు గ్లాసులు మాత్రం చేదుగా అనిపించాయి. ఆ తర్వాత బాగానే ఉంది. అయితే, పది గ్లాసులు పూర్తయ్యాక మాత్రం వాంతు అయింది. కానీ, టాస్క్ పూర్తి చేయగలిగాను. ఇది ముగిసిన తర్వాత వాష్ రూమ్‌లో వాంతులు చేసుకున్నా.. ఆ సమయంలో నోట్లో నుంచి రక్తం కూడా వచ్చింది' అని వెల్లడించాడు.

మహేశ్ ఓదార్చాక భయం పోయింది
దీని తర్వాత జరిగిన విషయం గురించి చెబుతూ.. ‘నోట్లో నుంచి రక్తం వస్తుండడంతో నాకెంతో భయం అనిపించింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే, ఆ సమయంలో మహేశ్ వచ్చి అలా అయినా ప్రాబ్లం లేదు అని చెప్పాడు. ఎక్కువగా వాంతులు అయినప్పడు రక్తం రావడం సహజమే అని చెప్పాక భయం పోయింది' అని రాహుల్ చెప్పుకొచ్చాడు.