లేదంటూనే రొమాన్స్‌తో పిచ్చెక్కిస్తారు.. మోకాళ్లపై నిలబడి ప్రపోజ్.. అదరగొట్టిన రాహుల్-పునర్నవి

రాహుల్ పునర్నవి జంటపై వచ్చినన్నీ వార్తలు మరేతర సెలెబ్రిటీలపై వచ్చి ఉండవు. బిగ్ బాస్ షోలోని వీరిద్దరి కెమిస్ట్రీ, స్నేహ బంధం, ప్రేమ, గొడవలు అన్నీ కలిసి వీరిని మరింత దగ్గరకి చేశాయి. వీరిద్దరి కెమిస్ట్రీనే ప్రేక్షకులకు దగ్గర చేసింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న రహస్య బంధంపై లెక్కలేనన్ని పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారని వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. ఒకానొక సందర్భంలో వీరిద్దరు ఆ వార్తలను ఖండించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ వీరిద్దరి మధ్య జరిగే వాటిని చూసి వారి ఫాలోవర్స్ మాత్రం రకరకాలుగా అనుకుంటున్నారు.

కేవలం స్నేహితులు..

కేవలం స్నేహితులు..

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన పునర్నవి, రాహుల్‌పై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. రాహుల్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోన్నారని వార్తలు వచ్చాయి. పెళ్లి వార్తలపై రాహుల్, పునర్నవి స్పందిస్తూ.. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు.

అడిగి చంపకండి..

అడిగి చంపకండి..

ఆ మధ్య రాహుల్ తన ఫాలోవర్స్‌తో ముచ్చట్లు పెడుతున్న క్రమంలో.. పునర్నవికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండటంతో అసహనం వ్యక్తం చేశాడు. అది షో అని, షోలో జరిగినట్టే బయట ఉండదని, ఎవరి జీవితాలు వారికే ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇకపై పునర్నవి గురించి అడిగి చంపకండని ఫైర్ అయ్యాడు.

తాజాగా ఈవెంట్‌లో..

తాజాగా ఈవెంట్‌లో..

తాజాగా 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఈవెంట్‌లో రాహుల్ పునర్నవి దుమ్ములేపారు. ఈ ఈవెంట్ మొత్తం వీరిద్దరిపైనే రెడీ చేసినట్టు తెలుస్తోంది. పునర్నవిని లేపుకొచ్చానని, పెళ్లి చేయమని రాహుల్ చెప్పడం, హైపర్ ఆది పెళ్లి చేస్తానని మాటివ్వడం ఇది వరకు మనమంతా చూశాం.

పాటలతో రొమాన్స్..

పాటలతో రొమాన్స్..

రాహుల్ సిప్లిగంజ్ తన పాటలతో పునర్నవిని ఫ్లాట్ చేసేందుకు ట్రై చేసినట్టు కనిపిస్తోంది. బిగ్ బాస్ షోలోనూ పునర్నవి కోసం ఎంతో ఎమోషనల్ అవుతూ పాటలు పాడేవాడు. ఇక తాజా ఈవెంట్లోనూ రాహుల్ తన ఫీలింగ్ అంతా బయటపెట్టేశాడు. మోకాళ్లపై నిలబడి పాట పాడి మెప్పించాడు. వెన్నెలవే వెన్నెలవే అంటూ పునర్నవిని టచ్ చేసినట్టు కనిపిస్తోంది.

Recommended Video

Rahul Sipligunj New Look Shocks His Fans
రాహువు కాదు రాహుల్ ఉన్నాడట..

రాహువు కాదు రాహుల్ ఉన్నాడట..

తన జీవితంలో రాహువు ఉన్నాడో లేదో చూసి చెప్పండని పునర్నవి రాకేట్ రాఘవను అడగ్గా.. రాహువు లేడు కానీ రాహుల్ ఉన్నాడని పంచ్ వేశాడు. ఇలా మొత్తానికి రాహుల్ పునర్నవి ఈ సారి పండగకి అందరికీ పిచ్చెక్కించేందుకు రెడీ అయ్యారు. వీరి రొమాన్స్‌కు టీఆర్పీ దద్దరిల్లిపోవాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X