లవర్‌తో రాహుల్ రొమాన్స్.. లవ్‌ స్టోరీని గుర్తు చేసి ఏడిపించిన బిగ్ బాస్ విన్నర్

By Manoj Kumar P

ప్లేబ్యాక్ సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. తక్కువ కాలంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లిన తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో మూడో సీజన్‌కు విజేతగా నిలిచాడు. అప్పటి నుంచి ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా అతడి పేరు మారుమ్రోగిపోతోంది. దీంతో అతడు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో తన లవర్‌తో రొమాన్స్ చేసిన ఓ వీడియోను తాజాగా షేర్ చేశాడు రాహుల్. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

 ఫుల్ జోష్‌తో మొదలెట్టిన రాహుల్ సిప్లీగంజ్

ఫుల్ జోష్‌తో మొదలెట్టిన రాహుల్ సిప్లీగంజ్

పలు ఛానెళ్లలో ప్రసారం అయిన పాటల పోటీల్లో పాల్గొన్న రాహుల్ సిప్లీగంజ్... చాలా వాటిలో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన మొదటి చిత్రం ‘జోష్'లో ‘కాలేజ్ బుల్లోడా' అనే పాటతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ‘దమ్ము', ‘ఈగ', ‘రచ్చ', ‘కెమెరామెన్ గంగతో రాంబాబు', ‘కృష్ణవందే జగద్గురం', ‘RX100' సహా ఎన్నో చిత్రాల్లో హిట్ సాంగ్స్ పాడాడు.

రాహుల్‌కు క్రేజ్ తెచ్చింది మాత్రం ఆ పాటలే

రాహుల్‌కు క్రేజ్ తెచ్చింది మాత్రం ఆ పాటలే

ఒకవైపు సినిమాల్లో పాటలు పాడుతూనే.. మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్నాడు రాహుల్ సిప్లీగంజ్. 2013లో ‘మగజాతి' పాట సూపర్ హిట్ అవడంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో పని చేశాడు. ఈ క్రమంలోనే ‘ఎందుకే', ‘మంగమ్మ', ‘మైసమ్మ', ‘పూర్ బాయ్', ‘మాక్కికిరికిరి', ‘దూరమే', ‘గల్లీ కా గణేష్' సహా ఎన్నో పాటలు రాహుల్‌కు క్రేజ్‌ను తెచ్చి పెట్టాయి.

అంచనాల్లేకుండా వెళ్లి.. అందరినీ ఓడించాడు

అంచనాల్లేకుండా వెళ్లి.. అందరినీ ఓడించాడు

సినిమా పాటలు.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలోనే రాహుల్ సిప్లీగంజ్... ‘బిగ్ బాస్' షోలో ఆఫర్ దక్కించుకున్నాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా హౌస్‌లోకి అడుగు పెట్టిన అతడు.. లేజీగా ఉంటూ కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, చివర్లో ఆకట్టుకుని అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ విజేతగా నిలిచాడు.

పునర్నవితో ప్రేమాయణం.. ఆమెతోనే పెళ్లి

పునర్నవితో ప్రేమాయణం.. ఆమెతోనే పెళ్లి

బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ సిప్లీగంజ్.. పునర్నవి భూపాలం మధ్య కెమిస్ట్రీ ఎంతలా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హౌస్‌లో మొదలైన బంధం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఇద్దరూ కలిసి ఓ మూవీ కూడా చేస్తున్నారనే టాక్ వినిపించింది.

ఊహించని అవకాశం దక్కించుకున్న రాహుల్

బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ సిప్లీగంజ్ ప్రవర్తన, వ్యవహార శైలితో పాటు యూత్‌లో క్రేజ్ ఉండడాన్ని గ్రహించిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ... అతడికి తన సినిమాలో అవకాశం కల్పించారు. ‘రంగమార్తాండ' పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రాహుల్ మంచి పాత్రను పోషిస్తున్నాడని అంటున్నారు. అతడికి జోడీగా జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిస్తోంది.

లవర్‌తో రాహుల్ రొమాన్స్.. అదరగొట్టేశాడుగా

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే రాహుల్ సిప్లీగంజ్.. తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో తన లవర్‌తో రొమాన్స్ చేస్తున్నాడతడు. అయితే, ఇది రాహుల్ రియల్ లైఫ్‌లోది కాదు.. గతంలో అతడు తెరకెక్కించిన ‘దూరమే' అనే అల్బమ్‌లోనిది. ఆ పాట వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాహుల్ ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

Recommended Video

Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!
ఫుల్ రొమాన్స్.. చివర్లో ఊహించని మలుపు

ఫుల్ రొమాన్స్.. చివర్లో ఊహించని మలుపు

‘దూరమే' అంటూ సాగే ఈ పాట ఎంతో పాపులర్ అయింది. 2017 వచ్చిన ఈ శాడ్ సాంగ్‌కు దాదాపు 50 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. ఇందులో తన లవర్‌తో గడిపిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రాహుల్ పాట పాడుతుంటాడు. మొదట్లో ఎంతో ముచ్చటగా అనిపించే ఈ పాట.. చివర్లో మాత్రం కన్నీరు తెప్పించింది. అందుకే యూత్‌కు బాగా కనెక్ట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X