బిగ్ బాస్ విన్నర్ రాహుల్ బిగ్ పార్టీ.. వితిక, పునర్నవి భూపాలంతో ఫుల్లుగా ఎంజాయ్
బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగిసింది. నిన్న (నవంబర్ 3) జరిగిన చివరి ఎపిసోడ్ ద్వారా బిగ్ బాస్‌కి బై బై చెప్పారు చిన్నితెర ప్రేక్షకులు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్ అందుకున్నాడు రాహుల్ సింప్లిగంజ్. దీంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

మిన్నంటిన ఆనందం.. గ్రాండ్ పార్టీ
'బిగ్‌బాస్' తెలుగు సీజన్ 3 విజేతగా నిలిచినందుకు ఎంతో ఆనంద పడుతున్న రాహుల్.. తన తోటి కంటిస్టెంట్లకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. అంతా కలిసి ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

ఆనందం తట్టుకోలేక రాహుల్.. వితిక, పునర్నవి భూపాలంలతో
'బిగ్‌బాస్' టైటిల్ గెలుచుకున్న రాహుల్ ఆనందం తట్టుకోలేక పోయాడట. అందుకే తన సంతోషాన్ని సహ కంటెస్టెంట్స్, కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటూ పండగ చేసుకున్నాడు. వరుణ్ సందేశ్, వితిక, పునర్నవి భూపాలం లతో కలిసి సరదాగా ఎంజాయ్ చేశాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను వీరు సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.

50 లక్షల నగదు, బిగ్ బాస్ ట్రోఫీ.. కుటుంబ సభ్యుల స్వాగతం
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్.. 50 లక్షల నగదు, బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకుని వచ్చిన రాహుల్‌కు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. ఓ వీడియోలో రాహుల్ భుజాలపై వరుణ్ సేదతీరుతూ కనిపించారు. చివరిదాకా ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ షోలో రాహుల్ గెలవడంతో అంతా కలిసి బాగా ఎంజాయ్ చేశారు.

చిరంజీవి ముందు అబీబీ అబీబీ అంటూ రాహుల్
ఫైనల్ ఎపిసోడ్‌లో టాప్2లో నిలిచిన రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖిలు స్టేజ్ మీదకు వచ్చారు. చిరంజీవి ముందు అబీబీ అబీబీ అనే పాట పాడి రాహుల్ అలరించాడు. ఇక రాహుల్, శ్రీముఖి ఇద్దరిలో రాహుల్‌ను విన్నర్‌గా నాగ్ ప్రకటించేశాడు. అనంతరం చిరంజీవి ట్రోఫీని అందజేశాడు. విన్నర్ అని తెలిశాక బిగ్ బాస్ వేదికకు పాదాభివందనం చేశాడు రాహుల్.

యూట్యూబ్ గాయకుడి నుంచి బిగ్ బాస్ ట్రోఫీ వరకు
యూట్యూబ్ ద్వారా ఓ గాయకుడిగా కెరీర్ ఆరంభించిన రాహుల్.. 2009లో వచ్చిన 'జోష్' సినిమాతో గాయకుడిగా పరిచయం అయ్యారు. ఇదే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించాడు కూడా. ఆ తర్వాత ''ఈగ, లై, నా పేరు సూర్య, రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్'' సినిమాల్లో కూడా సాంగ్స్ పాడి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకొని మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు.


Click it and Unblock the Notifications











