రోజుకు రెండు గంటలు అదే పని.. బీరు, బిర్యానీ తర్వాతే ఏదైనా.. రాహుల్ సిప్లిగంజ్

రాహుల్ సిప్లిగంజ్ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై రొమాంటిక్ బాయ్‌గా, సోషల్ మీడియాలో ప్లే బాయ్‌గా తన ఆల్బమ్స్‌తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో పునర్నవితో నడిపిన రహస్య బంధం, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, కోపం, తిట్లు ఇలా ప్రతీ ఒక్కటి అందర్నీ ఆకట్టుకున్నాయి. వీటన్నంటితో పాటు నిజాయితీ, ముక్కుసూటి తనంతో బిగ్‌బాస్ మూడో సీజన్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. తాజాగా నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ అనేక విషయాలను చెప్పుకొచ్చాడు.

పునర్నవిపై..

పునర్నవిపై..

పునర్నవి గురించి చెప్పండని అడగడంతో రాహుల్ కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ మేరకు స్పందిస్తూ.. అందరూ ఆమె గురించి అడుగుతున్నారు కాబట్టి మరోసారి క్లియర్ చేస్తున్నానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ‘స్క్రీన్ మీద కనిపించేవి నిజాలు కాదు. ప్రతీ ఒక్కరికీ తమదైన జీవితం ఉంటుంది. బిగ్‌బాస్ ముగిసింది. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ముందుకుపోతున్నారు. కాబట్టి మీ అందరికీ చెబుతున్నా.. చిల్ అవ్వండి. మళ్లీ అలాంటి ప్రశ్నలతో నన్ను చంపకండి'అని నెటిజన్లకు సెలవిచ్చాడు.

వృత్తి గురించి..

వృత్తి గురించి..

తన బార్బర్ వృత్తిపై ఎదురైన ప్రశ్నకు సమాధానంగా.. ‘బార్బర్ ఫ్యామిలీ పుట్టినందుకు నేను అదృష్టవంతుడినని ఫీలవుతా. ఎందుకుంటే దాని వల్ల నాలో రెండు కళలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి ఏంటంటే.. చెడ్డగా కనిపించేవారిని మంచిగా చూపించగలగడం.. మరొకటి నా పాటతో అందర్నీ హ్యాపీగా ఉంచగలగడం' అని ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.

మ్యూజిక్ డైరెక్టర్ గురించి..

మ్యూజిక్ డైరెక్టర్ గురించి..

మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హప్ తమిళ గురించి మాట్లాడుతూ.. ‘నేను మ్యూజిక్ వీడియోలు చేసేందుకు నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి.. అతని మొదటి ఆల్బమ్‌తోనే నన్ను ఇన్స్పైర్ చేశాడ'ని తెలిపాడు. అంతేకాకుండా ప్రపంచంలో ఇష్టమైన వ్యక్తి ఎవరంటే.. అమ్మ నాన్న అని సమాధానం ఇచ్చాడు.

Recommended Video

Rahul Sipligunj New Look Shocks His Fans
రోజుకు రెండు గంటలు అదే పని..

రోజుకు రెండు గంటలు అదే పని..

తాను రోజులో కనీసం రెండు గంటలు పబ్ జీ ఆడతానని తెలిపాడు. బీర్ ఇష్టమా? బిర్యానీ ఇష్టమా అని అడిగితే.. బీర్ తాగాక బిర్యానీ తినడం ఇష్టమని పంచ్ వేశాడు. బిగ్‌బాస్‌లో చిరు, నాగ్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడమే స్పెషల్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. ఆల్ టైమ్ ఫేవరేట్ టిక్ టాక్ స్టార్ ఎవరని ప్రశ్నించగా.. ఖతర్ పాప అని సమాధానమిచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X