రతికా నిజస్వరూపం బయటపెట్టిన రాహుల్: ఆ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయి? తొలిసారి పెదవి విప్పిన మాజీ లవర్

తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న షోలలో బిగ్ బాస్ ఒకటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఇది.. ఇప్పుడు ఏడో దానితో ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఇందులో ఆరంభంలోనే కొందరు హైలైట్ అయ్యారు. అందులో రతికా రోజ్ ఒకరు. ఈ అమ్మడు మాజీ విన్నర్, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లీగంజ్ మాజీ ప్రియురాలు అని షోలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అందుకే తరచూ అతడి ప్రస్థావన తెస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ స్పందించాడు. ఇంతకీ అతడేం అన్నాడో మీరే చూసేయండి మరి!

బయటకు వచ్చిన లవ్ స్టోరీ:రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె లవ్ స్టోరీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆమె ప్రేమించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ అని ఓ న్యూస్ లీకైంది. ఆ తర్వాత వీళ్ల ఫొటోలు, కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ, చాలా రోజుల క్రితమే వీళ్లిద్దరూ బ్రేకప్ కూడా చెప్పుకున్నట్లు తెలిపింది.

Rahul Sipligunj Sensational Comments On Bigg Boss Contestant Rathika Rose

పరోక్షంగా రాహుల్ స్పందన:బిగ్ బాస్ హౌస్‌లో రతికా రోజ్ తరచూ తన మాజీ ప్రియుడు అంటే రాహుల్ సిప్లీగంజ్ గురించి మాట్లాడుతుంది. దీంతో షోలో ఆమెపై సింపతీతో పాటు బయట అతడిపై నెగిటివిటీ కూడా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాహుల్ దీనిపై స్పందించాడు. అదే సమయంలో రతికా రోజ్ నిజస్వరూపం బయట పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పరోక్షంగా స్టోరీలు పెట్టాడు.

Rahul Sipligunj Sensational Comments On Bigg Boss Contestant Rathika Rose

అలాంటి గేమ్స్ ఎంత వరకు:రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్‌లో సింపతీ గేమ్స్ ఆడుతున్న విషయాన్ని ప్రస్థావిస్తూ రాహుల్ సిప్లీగంజ్ ఓ స్టోరీ పెట్టాడు. అందులో 'ఫేక్ సింపతి గేమ్స్ ఎప్పటివరకు? జనాలు ఎప్పుడూ తమ సొంత టాలెంట్‍ను నిరూపించుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ, కొంతమంది మాత్రం నిత్యం ఇతరుల టాలెంట్, పేరుపై ఆధారపడుతుంటారు. అదే విషయాన్ని కొంతమంది నిరూపిస్తారు' అన్నాడు.

Rahul Sipligunj Sensational Comments On Bigg Boss Contestant Rathika Rose

డబ్బులు తీసుకునే టీమ్‌కు:అదే స్టోరీలో రాహుల్ సిప్లీగంజ్ 'ఫేమ్ కోసం వేరే వాళ్ల కష్టాన్ని అవసరానికి కన్నా ఎక్కువ వాడుకుంటున్నారు. నీ లోపల ఉన్న మనిషికి ఆల్ ది బెస్ట్. అలాగే పైసలు తీసుకున్న టీమ్‍ (పీఆర్) కు కూడా కంగ్రాట్స్' అని చెప్పుకొచ్చాడు. తద్వారా రతికా రోజ్ షోలోకి వెళ్లే ముందే పీఆర్ టీమ్‌ను పెట్టుకుని అంతా ప్లాన్ ప్రకారమే సింపతీ గేమ్ ఆడుతుందని రాహుల్ వివరించాడు.

Rahul Sipligunj Sensational Comments On Bigg Boss Contestant Rathika Rose

పిక్స్ ఎలా లీక్ అయ్యాయి?:మరో స్టోరీలో రాహుల్‌ సిప్లీగంజ్ 'నాకు ఒక క్వశ్చన్ ఉంది.. ఆరేళ్ల తర్వాత ఒకరి ఫోన్‌లో ఉన్న పర్సనల్ ఫొటోలు ఒక్కసారిగా ఎలా బయటకు వచ్చి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి? ఇది వాళ్లు (రతికా రోజ్) లోపలికి వెళ్లే ముందే ప్రీ ప్లాన్‌గా చేసిన పనేనా? గాయ్స్ దీనికి మీరంతా సమాధానం కనుక్కుని అసలు నిజాలు ఏంటో తెలుసుకోవాలి' అంటూ డౌట్లు పెంచేశాడు.

Rahul Sipligunj Sensational Comments On Bigg Boss Contestant Rathika Rose

ఒక్కసారి ఆలోచించండి:ఇదే స్టోరీలో రాహుల్ సిప్లీగంజ్ 'నాకూ, మరొకరి జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. అది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా. ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ, ఫ్రెండ్ ఉంటారు. వాళ్లపై ఇలాంటి తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని వాళ్లు ఇది చేసే ముందు గ్రహించాలి' అంటూ చెప్పాడు.

Rahul Sipligunj Sensational Comments On Bigg Boss Contestant Rathika Rose

ప్రతి ఒక్కరికీ గతం ఉంది:చివర్లో రాహుల్ 'ప్రతి ఒక్కరి జీవితంలో గతం ఉంటుంది. అలాగే, ప్రజెంట్ కూడా ఉంటుంది. కాబట్టి అవగాహన లేకుండా ప్రతి దాన్ని జడ్జ్ చేయకండి. నా బాధను ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్లకు థ్యాంక్స్. ఎవరైతే నెగిటివిటీని ప్రచారం చేయాలని చూస్తున్నారో వాళ్లకు ఆల్ ది బెస్ట్' అని ముగించాడు. మొత్తానికి రతికా పేరు వాడకుండానే ఆమె బండారాన్ని బటయ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X