రాహుల్ సంచలన వ్యాఖ్యలు: వాళ్లిద్దరే ఫైనలిస్టులు.. అభితో పాటు వాళ్లను బయటకు తోసేయండి అంటూ!

సింగర్‌గా సూపర్ సక్సెస్ అవడంతో పాటు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఆ పాపులారిటీతోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకున్నాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు.. ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుని పోయాడు. దీంతో అతడి క్రేజ్ రెట్టింపు అయింది. ఈ క్రమంలోనే ప్రస్తుత సీజన్‌ కోసం బిగ్ బాస్‌తో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఓ సంచలన పోస్టును పెట్టాడు. దీంతో అభిజీత్‌తో పాటు వాళ్లందరికీ భారీ షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

ఏ హీరోనూ వదిలిపెట్టని రాహుల్

ఏ హీరోనూ వదిలిపెట్టని రాహుల్

‘జోష్' అనే సినిమాతో సింగర్‌గా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ సిప్లీగంజ్. ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవడంతో అతడికి మంచి పేరుతో పాటు అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోలు అందరి సినిమాల్లో పాటలు పాడాడు. వీటి వల్ల ఎంతో గుర్తింపు వచ్చింది. ఇక, ప్రైవేటు ఆల్బమ్‌లతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి.

బిగ్ బాస్‌ షోతో మొత్తం మారింది

బిగ్ బాస్‌ షోతో మొత్తం మారింది

సింగర్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో రాహుల్ సిప్లీగంజ్‌.. బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్‌లో పునర్నవితో ప్రేమాయణం.. తరచూ ఏదో ఒక గొడవకు దిగడం వంటివి చేసి హైలైట్ అయ్యాడు. అలాగే, ఎక్కువ సార్లు నామినేషన్స్‌లో సైతం ఉన్నాడు. అయినప్పటికీ.. అనూహ్య రీతిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుని టైటిల్ గెలుచుకున్నాడు.

నాలుగో సీజన్‌లో కొత్త అవతారం

నాలుగో సీజన్‌లో కొత్త అవతారం

ఇప్పటి వరకు సింగర్‌గానే పరిచయం అయిన రాహుల్... ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో హోస్ట్‌గా కనిపిస్తున్నాడు. షో నిర్వహకులు ఏర్పాటు చేసిన చిట్ చాట్ షో ‘బిగ్ బాస్ బజ్'కు అతడు యాంకర్‌గా చేస్తున్నాడు. షో నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన కంటెస్టెంట్లతో నిర్వహించే దీనికి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్లు పూర్తి చేశాడతను.

మద్దతు అతడికే.. మారిపోయాడు

మద్దతు అతడికే.. మారిపోయాడు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్.. తన మద్దతు నోయల్ సీన్‌కే అని గతంలో చెప్పాడు. అయితే, అతడు అనూహ్యంగా షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో అభిజీత్‌ వైపు మొగ్గు చూపాడు. ఈ సీజన్‌లో అతడి గెలుపు తథ్యం అంటూ గతంలో కామెంట్లు చేశాడు. అలాగే, సయ్యద్ సోహెల్ రియాన్, ఆరియానా గ్లోరీ కూడా మంచిగా ఆడుతున్నారని కితాబిచ్చాడు.

రాహుల్ నుంచి సంచనల పోస్టు

రాహుల్ నుంచి సంచనల పోస్టు

ఈ సీజన్‌లో అభిజీత్ గెలుపు ఖాయం అన్న టాక్ వినిపిస్తోన్న నేపథ్యంలో రాహుల్ సిప్లీగంజ్‌ సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్టు పెట్టాడు. ఇందులో సయ్యద్ సోహెల్ రియాన్‌తో పాటు ఆరియానా గ్లోరికి మద్దతు తెలిపాడు. వీళ్లిద్దరే తన దృష్టిలో టాప్ -2 కంటెస్టెంట్లు అని వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అతడిని మిగిలిన కంటెస్టెంట్ల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
వాళ్లను బయటకు తోసేయండి

వాళ్లను బయటకు తోసేయండి

రాహుల్ పెట్టిన పోస్టులో వాళ్లిద్దరి మద్దతు తెలపడమే కాదు.. ‘పెర్ఫామెన్స్‌ని బట్టే మన సపోర్ట్ ఉంటుంది. ఎవరు చెప్పినా నమ్మకండి. బాగా ఆడేవాళ్లని, నిజాయితీగా ఆడేవాళ్లని సపోర్ట్ చేయండి. దమ్ము ఉంటే సపోర్ట్ చేయండి. పనికిరానోళ్లని బయటకు తోసేయండి' అని రాసుకొచ్చాడు. అంటే అభిజీత్, హారిక, అఖిల్, అవినాష్, మోనాల్‌లకు వ్యతిరేకంగా ఈ పోస్టు పెట్టినట్లు అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X