అఖిల్‌పై రాహుల్ షాకింగ్ కామెంట్స్: నాగ్ సార్‌కు కూడా కాలిందంటూ సీక్రెట్ లీక్ చేశాడు

రాహుల్ సిప్లీగంజ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. దీనికి కారణం అతడు బిగ్ బాస్ షోలో విన్నర్ అవడమే. సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ పాటలు పాడాడు. ఫలితంగా టాలీవుడ్‌లో బిజీ ప్లేబ్యాక్ సింగర్‌గా మారిపోయాడు. రియాలిటీ షోలో గెలుపొందిన తర్వాత అతడు ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఓ న్యూస్ ఛానెల్‌కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో బిగ్ బాస్ ప్రస్తుత కంటెస్టెంట్ అఖిల్ సార్థక్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే సమయంలో ఓ టాప్ సీక్రెట్ కూడా లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ప్రేమాయణంతో ఫుల్ పాపులర్

ప్రేమాయణంతో ఫుల్ పాపులర్

ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోని బెస్ట్ సింగర్లలో ఒకడిగా పేరొందాడు రాహుల్ సిప్లీగంజ్. ప్రైవేటు ఆల్బమ్‌లు వదులుతూ యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక, బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పునర్నవితో ప్రేమాయణం సాగించడం ద్వారా హాట్ టాపిక్‌గా మారాడు. ఆ తర్వాత విన్నర్ అవడంతో ఫుల్ పాపులర్ అయ్యాడు.

కొత్తగా రెండు పాత్రలతో హైలైట్

కొత్తగా రెండు పాత్రలతో హైలైట్

బిగ్ బాస్ షోలో గెలుపొందిన తర్వాత రాహుల్ సిప్లీగంజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీని వల్ల అతడికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. సింగర్‌గానే కాదు.. కృష్ణ వంశీ సినిమాలో యాక్టర్‌గానూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక, బిగ్ బాస్ షోకు సంబంధించిన చిట్ చాట్ షో ‘బిగ్ బాస్ బజ్'కు హోస్ట్‌గా మారి తనలోని మరో యాంగిల్ చూపిస్తున్నాడు.

నాలుగో సీజన్‌పై అభిప్రాయాలు

నాలుగో సీజన్‌పై అభిప్రాయాలు

ప్రస్తుత సీజన్‌ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూలు చేస్తున్నాడు రాహుల్ సిప్లీగంజ్. అదే సమయంలో తన అభిప్రాయాలను సైతం వాళ్లతో చర్చిస్తున్నాడు. పర్సనల్‌గానూ నాలుగో సీజన్‌పై అంచనాలు వేస్తున్నాడు. అంతేకాదు, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల విషయంలోనూ నిర్భయంగా స్పందిస్తున్నాడు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడీ రాక్ స్టార్.

వాళ్లకే ఛాన్స్.. ఆ ఫ్యాన్స్ ట్రోల్స్

వాళ్లకే ఛాన్స్.. ఆ ఫ్యాన్స్ ట్రోల్స్

నాలుగో సీజన్‌లో నోయల్‌కే విజయావకాశాలు ఉన్నాయని రాహుల్ అప్పట్లో వెల్లడించాడు. అనూహ్యంగా అతడు బయటకు వెళ్లడంతో అభిజీత్‌కు ఓటేశాడు. అతడి తర్వాత సోహెల్, ఆరియానాకు సైతం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేశాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన కంటెస్టెంట్‌ను అవమానించాడని రాహుల్‌ను అఖిల్ ఫ్యాన్స్ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.

అఖిల్‌పై రాహుల్ షాకింగ్ కామెంట్స్

అఖిల్‌పై రాహుల్ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన కంటెస్టెంట్ల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాడు రాహుల్. అందుకోసం షోను కూడా ఫాలో అవుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రతి కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాలను చెబుతున్నాడు. ఇక, తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రస్తుత కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ వ్యవహార శైలిపై రాహుల్ సిప్లీగంజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Recommended Video

TFC President Narayan Das Narang Thanks To CM KCR ఇండియా ఫిలిం హబ్‌గా హైదరాబాద్..!!
నాగ్ సార్‌కు కూడా కాలిందంటూ

నాగ్ సార్‌కు కూడా కాలిందంటూ

అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చిన తర్వాత ‘నేను మేకలా లోపలికి వెళ్లి, వాళ్లు పెట్టిన ప్రొటీన్లతో పులిలా తిరిగొచ్చా' అంటూ ఓ సందర్భంలో మాట్లాడిన మాటలను రాహుల్ తప్పుబట్టాడు. అప్పటి నుంచి అతడి ఆట తీరు బాలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు, నాగార్జున కూడా ఈ వ్యాఖ్యల విషయంలో అఖిల్‌పై ఆగ్రహంగా ఉన్నారని ఓ సీక్రెట్ లీక్ చేశాడీ బిగ్ బాస్ విన్నర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X