బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : పాట పాడరా అంటూ పునర్నవి ఆర్డర్
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

అదిరిపోయిన రాహుల్ పాట
ఈ వందరోజుల జర్నీని ఓ పాటగా మలిచి పాడాలని నాగార్జున తెలిపాడు. ఈ విషయాన్ని పునర్నవి చేత రాహుల్‌కు చెప్పించాడు. పాడరా రాహుల్ అంటూ పునర్నవి ఆర్డర్ వేసింది. దీంతో అందరూ నవ్వేశారు. ఇక ఆ టాప్ 5 మెంబర్స్‌కు సంబంధించి, హౌస్‌లో వారు చేసిన టాస్కులు, గొడవలు ఇలా ప్రతీ విషయాన్ని టచ్ చేస్తూ ఓ పాటను అల్లారు. దానికి రాహుల్ ట్యూన్ కట్టేసి అద్భుతంగా పాడుతూ ఉండగా.. మిగతా నలుగురు స్టెప్పులేసారు.


Click it and Unblock the Notifications











