twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్ పిక్.. వామ్మో రాహుల్ ఇలా తయారయ్యాడేంటి.. రాత్రిపూట ఆ పనులు!!

    |

    బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా రాహుల్ సిప్లిగంజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. కేవలం రియాల్టీ షోలో విజేత అయినంత మాత్రానే ఇంతటి పాపులారిటీ రావడం అతి కొద్ది మంది విషయంలోనే జరుగుతుంది. అందులో రాహుల్ సిప్లిగంజ్ ఒకడు. ప్రైవేట్ ఆల్బమ్స్, ప్లే బ్యాక్ సింగర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న రాహుల్.. బిగ్‌బాస్ తరువాత స్టార్‌గా ఎదిగాడు.

     బిగ్‌బాస్‌లో హల్చల్..

    బిగ్‌బాస్‌లో హల్చల్..

    బిగ్‌బాస్ మూడో సీజన్‌లో రాహుల్‌దే హల్చల్. పునర్నవితో రహస్య స్నేహబంధం, వరుణ్-వితికాలతో స్నేహం, అలీ రెజాతో వైరం, స్నేహం అన్నీ వైరల్ అయ్యాయి. అయితే శ్రీముఖితో నడిచిన ఓ విద్వేష పూరిత వాతావరణమే రాహుల్‌కు బాగా కలిసి వచ్చింది. చివరకు విజేతగా నిలబెట్టింది.

    బయటకు వచ్చాక..

    బయటకు వచ్చాక..

    బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చిన రాహుల్ క్రేజ్ ఆకాశన్నంటింది. ఇక పునర్నవితో లింకులు పెట్టి వచ్చిన వార్తలు కోకొల్లలు. అయితే ప్రస్తుతం వ్యవహారం మారినట్టు కనిపిస్తోంది. పునర్నవితో ఎక్కువగా కనిపించడం లేదు. ఈ ఇద్దరి మధ్యా దూరం పెరినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రాహుల్ తాజాగా ఓ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

     అదంతా ముగిసింది..

    అదంతా ముగిసింది..

    నెటిజన్లతో ముచ్చటించిన రాహుల్‌కు పునర్నవికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ మేరకు అందరికీ సమాధానంగా.. ‘స్క్రీన్ మీద కనిపించేవి నిజాలు కాదు. ప్రతీ ఒక్కరికీ తమదైన జీవితం ఉంటుంది. బిగ్‌బాస్ ముగిసింది. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ముందుకుపోతున్నారు. కాబట్టి మీ అందరికీ చెబుతున్నా.. చిల్ అవ్వండి. మళ్లీ అలాంటి ప్రశ్నలతో నన్ను చంపకండి'అని చెప్పుకొచ్చాడు.

    అషూతో క్లోజ్..

    అషూతో క్లోజ్..

    అయితే ఈ మధ్య అషూ రెడ్డితో రాహుల్ చాలా క్లోజ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో మీ మధ్య ఏం ఉందని నెటిజన్లు ప్రశ్నించారు. దానికి సమాధానంగా తమ మధ్య రిలేషన్ షిప్ ఉందని, అయితే అది జిగ్రీ దోస్తులమని చెప్పుకొచ్చాడు. ఆ సమాధానాన్ని అషూ కూడా లైక్ కొట్టింది.

     రాత్రి పూట వర్కౌట్లు..

    రాత్రి పూట వర్కౌట్లు..

    అసలే రాహుల్‌కు కాస్త బద్దకం ఎక్కువ. వర్కౌట్లు చేయడం, ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేయడం కష్టమైన పని. అయితే రాహుల్ ప్రస్తుతం మారిపోయినట్టు కనిపిస్తోంది. రాత్రి పూట వర్కౌట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ షాకింగ్ పిక్‌ను షేర్ చేశాడు. ఈ మేరకు రాహుల్ పోస్ట్ చేస్తూ.. రాత్రి పూట వర్కౌట్లు చేసేవారెవరు? అని ఓ ఫోటోను షేర్ చేశాడు. దీనికి అలీ రెజా రిప్లై ఇస్తూ.. కమాన్ చిచ్చా అంటూ ఎంకరేజ్ చేశాడు. ప్రస్తుతం రాహుల్ పిక్ తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Rahul Sipligunj workout pic goes viral, He shared A shocking pic with the caption Night workout pehchaan Kaun!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X