అందుకోసమేనా ఇదంతా?.. రాహుల్ సిప్లిగంజ్ వర్కౌట్లకు నెటిజన్లు ఫిదా
బిగ్‌బాస్ మూడు సీజన్లల విన్నర్స్‌లో ఎక్కువగా పాపులర్ అయింది.. ఎక్కువగా వార్తల్లో నిలిచింది రాహుల్ సిప్లిగంజ్. అది వివాదాలైనా, వ్యక్తిగత వ్యవహారాలైనా, సినీ ప్రాజెక్ట్‌లైనా సరే ప్రతీ విషయంలో రాహుల్ సిప్లిగంజ్ శైలే వేరు. బిగ్ బాస్ విన్నర్‌గా వచ్చిన క్రేజ్‌తో అమాంతం ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ను తెచ్చుకున్నాడు. ఆపై పబ్‌లో గొడవతో మరింతగా వైరల్ అయ్యాడు. అయితే ప్రస్తుతం రాహుల్ మాత్రం తెగ కష్టపడి పోతోన్నట్టు కనిపిస్తోంది.

బిగ్‌బాస్ హౌస్‌లో అలా..
బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్ ఎంత బద్దకంగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. అయితే మరీ బద్దకంగా ఉన్నాడా అంటే అదీ కాదు. మధ్యలో టాస్కులు కూడా బాగానే ఆడేవాడు. కొన్ని కొన్ని సార్లు మధ్యలోనే వదిలేసేవాడు. అయితే ఎప్పుడూ కూడా జిమ్ ఏరియాలోకి మాత్రం ఎంటరయ్యేవాడు. అలీ రెజా చేస్తూ ఉంటే చూసేవాడు కానీ ఎప్పుడూ వర్కౌట్లు చేయలేదు.

ప్రాజెక్ట్‌లతో బిజీగా..
రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆఫర్లు వెల్లువెత్తాయి. సింగర్‌గా అవకాశాలు మరింతగా రాగా.. నటుడిగానూ ఆఫర్లు పట్టేశాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతోన్న రంగ మార్తాండలో ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇదే గాక ప్రైవేట్ ఆల్బమ్స్‌లోనూ బిజీగా ఉన్నాడు.

కేటీఆర్‌పై స్పెషల్ సాంగ్..
కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు. యూత్‌లో కేటీఆర్ ఫాలోయింగ్‌ను బేస్ చేసుకుని పాటను కంపోజ్ చేశాడు. టెక్నికల్ సమస్యలతో అనుకున్న సమయానికి పాటను రిలీజ్ చేయలేకపోయినా.. జనాల్లోకి బాగానే వెళ్లింది. ఇవి గాక రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్స్‌పై మరింత శ్రద్ద పెట్టినట్టు తెలుస్తోంది.

వర్కౌట్లతో బిజీగా..
ప్రైవేట్ ఆల్బమ్స్‌తో రాహుల్ సిప్లిగంజ్ బాగా ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ కొన్ని మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టాడు. ఇక రొమాన్స్‌లోనూ రాహుల్ రెచ్చిపోయి నటించాడు. అయితే రాబోయే ప్రాజెక్ట్‌లకోసమో గానీ, ప్రైవేట్ ఆల్బమ్స్ కోసమో గానీ రాహుల్ కండలు పెంచేస్తున్నాడు. రాహుల్ తాజాగా షేర్ చేసిన ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Recommended Video

సిక్స్ ప్యాక్ దిశగా..
రాహుల్ ప్రస్తుతం సిక్స్ ప్యాక్ దిశగా ప్రయత్నాలు చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య బ్యాక్ సైడ్ పిక్ షేర్ చేయగా తెగ వైరల్ అయింది. ఇప్పుడు జిమ్‌లో డంబెల్‌తో వర్కౌట్లు చేస్తోన్న ఫోటోను షేర్ చేశాడు. మొత్తానికి రాహుల్ తన బాడీని బాగానే బిల్డ్ చేస్తున్నాడు. మనల్ని మనం నమ్ముకోవాలి, మన కష్టం, మన కన్నీళ్లు, మన కష్టనష్లాలు అన్ని ఉన్నతమైనవే అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











