Brahmamudi September 30th: స్వప్నను తీసుకువచ్చిన రాజ్, కావ్య... రుద్రాణి, రాహుల్ షాక్
బ్రహ్మముడి సీరియల్‍లో కనకం పంతులు కనకేశ్వరి గెటప్ వేసి... మైఖేల్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ తన కూతురిని మైఖేల్ పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఇక ఆ పెళ్లిని కనకం ఎలా ఆపుతుంది. రాజ్, కావ్య వచ్చి ఏం చేయనున్నారు. రాహుల్, రుద్రాణిలా బండారం బయట పడిందా.. అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
మైఖేల్ స్వప్నను పెళ్లిచేసుకునేందుకు పంతులు కోసం చూస్తుంటే.. కనకం పంతులు గెటప్ వేసుకుని వస్తుంది. ఇక మైఖేల్ తో కలిసి పెళ్లి చేసేందుకు వెళ్తుంది. ఇక కనకం తెలివిగా... మైఖేల్ ఫోన్ నుంచే రాజ్, కావ్యలకు లొకేషన్ పెడుతుంది. అది చూసి రాజ్, కావ్య బయలు దేరుతారు. ఇక మరోవైపు రాహుల్ ను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెబుతాడు. ఇందాకే కళ్లు తిరిగిపోయాడు కదా. అప్పుడే డిశ్చార్జ్ అంటున్నారు అని రుద్రాణి అంటుంది. ఇందాక అంటే ఎమోషనల్ అయి అలా అయింది... ఇప్పుడు బానే ఉన్నాడని డాక్టర్ చెబుతాడు. ఇంతలో నర్స్ వచ్చి సార్ రాహుల్ ఇంజక్షన్ తీసుకోవట్లేదు అని చెబుతుంది. దీంతో కంగారుగా రాహుల్ దగ్గరికి వెళ్తారు.

నాకు ఇంజెక్షన్ వద్దు. నాకు ఎలాంటి మెడిసిన్ వద్దు. స్వప్న లేని జీవితం వద్దు అంటూ డ్రామా మొదలు పెడతాడు రాహుల్. నీకోసమే కదా ఇంజక్షన్ వేసుకోమ్మని చెబుతుంది అని సుభాష్ సీరియస్ అవుతాడు. మరోవైపు కనకం... మైఖేల్ పెళ్లి ఆపేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. నీకు అమ్మాయికి వయసు తేడా ఉంది. దోషం ఉంటుంది. కాబట్టి బెండకాయతో పెళ్లి చేయాలని చెబుతుంది. నీకు 37 ఏళ్లు అంటున్నావ్, ఆ అమ్మాయికి పాతిక కూడా నిండవు. సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావ్. కానీ, వయసు తేడాతో దోషం నీ నెత్తిన డ్యాన్స్ చేస్తుంది అని కనకం అంటుంది.
అందుకే బెండకాయతో పెళ్లి చేయాలని, వెళ్లి బెండకాయ తీసుకురమ్మని చెబుతుంది. రౌడీలు వెళ్లి బెండకాయ తీసుకొస్తారు. బెండకాయకు తాళి కట్టమంటుంది. మైఖేల్ అలాగే చేస్తాడు. అంతా అక్షింతలు వేస్తాడు. ఇప్పుడు స్వప్నకు తాళి కట్టనా అని మైఖేల్ అంటాడు. ఇంతలో అక్కడికి రాజ్, కావ్య వస్తారు. వాళ్లను చూసి కనకం, స్వప్న సంతోషిస్తారు. స్వప్నకు మైఖేల్ తాళి కట్టడానికి వెళ్తుంటే ఆపుతుంది కనకం. నా అల్లుడు కూతురు వస్తున్నారు అని కనకం చెబుతుంది. దీంతో రాజ్, కావ్యను చూసి షాక్ అవుతాడు మైఖేల్. నిన్ను ఏం చేయాల్రా అని రాజ్ అంటాడు. ఏం వద్దు సార్. నాకు కీళ్ల నొప్పులు, వాతం లాఠీ దెబ్బలు పడవు అని మైఖేల్ అంటాడు.
పోలీసులు ఎంట్రీ ఇస్తారు. దీంతో మరింత షాక్ అవుతాడు మైఖేల్. అసలు ఎలా దొరికాను అని మైఖేల్ అంటే.. కనకం గెటప్ తీసేసరికి పూల దండలు కొన్న విషయం గుర్తుకు వస్తుంది. స్వప్న నా కూతురు అని చెబుతుంది కనకం. వీడి వెనుక ఎవరో ఉన్నారు సార్ అని కావ్య అనుమానిస్తుంది. డౌట్ ఉంటే వాళ్లు ఊరుకుంటారా అని మైఖేల్ అంటాడు. మేము కనుక్కుంటాం మేడమ్ అని పోలీసులు మైఖేల్‌ను తీసుకెళ్తారు.
ఇంట్లో స్వప్న పోవడంతో చాలా బాధగా ఉందని రాహుల్ డ్రామా మొదలుపెడతాడు. దానికి రుద్రాణి కూాడా మరింత ఓవర్ యాక్టింగ్ చేస్తుంటుంది.. నీకు బాధ్యత లేదు అని ఇంట్లో వాళ్లందరు రాహుల్‌ను తిడతారు. కాసేపు రాహుల్, రుద్రాణి ఇంట్లో వాళ్లతో వాదిస్తుంది. మళ్లీ రాహుల్ బాధపడినట్లు మాట్లాడితే.. ఇన్నాళ్లు స్వప్నపై కోపం చూపించాడు. ఇప్పుడేమో ప్రాణం పోతుందని అంటున్నాడు, ఏంటో అని ధాన్యలక్ష్మి అనుమానంగా అంటుంది. అవును, అత్తయ్య.. దూరం అయినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది అని రాహుల్ అంటాడు. నువ్ ఇలాగే ఉంటావని స్వప్న మాట తీసుకుంది అత్తయ్య. కానీ, ఇప్పుడు మాట తీసుకున్న మనిషే దూరం అయింది అని రాహుల్ అంటాడు.
దూరం అవ్వలేదు అని స్వప్నతో ఎంట్రీ ఇస్తాడు రాజ్. దీంతో అంతా ఆనందిస్తుంటే.. రాహుల్, రుద్రాణికి షాక్ కొట్టినట్లు ఉంటుంది. రాహుల్‍ను గమనించిన రుద్రాణి.. ఇప్పటిదాకా ఏడ్చావ్.. ఇప్పుడు అలా కొయ్యబారిపోయావ్ అని ధాన్యలక్షి అంటుంది. స్వప్న అంటూ రాహుల్ దగ్గరికి వెళ్తాడు. స్వప్ను ఎవరు, ఎందుకు తీసుకెళ్లారో తెలిసిందా అని సీతారామయ్య అడుగుతాడు. తెలిసింది తాతయ్య. ఇంతకుముందు కిడ్నాప్ చేసిన మైఖేలే పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్లాడు అని రాజ్ చెబుతాడు. దీంతో రాహుల్ ఆవేశంతో ఊగిపోతాడు. వాన్ని ఊరికే వదిలేయొద్దు. ఎక్కడున్నాడో చెప్పు రాజ్ అని రాహుల్ అంటాడు. అవసరం లేదు. వాడిని పోలీసులకు అప్పజెప్పాం అని కావ్య అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తోంది.
ఇక తర్వాతి ఎపిసోడ్‍లో వినాయక చవితి పండుగ సందర్భంగా గణేషుడిని ప్రతిష్టిస్తారు. మనసులో ఉన్న కోరికలను చీటిపై రాయండి. అది జరుగుతుందని ఇందిరా దేవి చెబుతుంది. తాతయ్య కోసం మూడు నెలలు కావ్యతో ప్రేమగా ఉంటానని టైమ్ అడిగాను. ఈ ఆటకు ముగింపు పలుకు స్వామి అంటూ రాజ్ రాస్తే.. ఆయన కోరుకున్నది నెరవేర్చుమని కావ్య రాస్తుంది.


Click it and Unblock the Notifications











