తడిసి ముద్దయ్యారు: బిగ్‌బాస్ ఇంట్లో ఆనంద హేల, కారణం...
Recommended Video

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. బిగ్ బాస్ ఇంటి సభ్యులు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. నిన్న వర్షం పడిన సమయంలో ఇంటి సభ్యులంతా లాన్‌లోకి వచ్చి ఎంజాయ్ చేశారు. అదే సమయానికి బిగ్‌బాస్ మంచి సాంగ్ ప్లే చేయడంతో వారిలో మరింత ఉత్సాహం నిండినట్లయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో శుక్రవారం విడుదల చేశారు. బిగ్‌బాస్ షో మొదలై 50 రోజులు దాంటింది. గతంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఇంటి సభ్యుల్లో కనిపించడం విశేషం.
ఆనంద హేల
బిగ్‌బాస్ ఇంటి సభ్యుల్లో ఆనందం నింపడానికే అన్నట్లు వర్షం రావడం, అదే సమయంలో అందరూ మంచి మూడ్లో ఉండటంతో తెగ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

విబేధాలు అన్నీ పక్కన పెట్టి
బిగ్‌బాస్ ఇంటి సభ్యుల్లో తరచూ ఏదో ఒక విషయంలో చిన్న చిన్న వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టేసి స్నేహితుల్లా ఆడి పాడారు.

స్టెప్స్ అదుర్స్
పూజా, సునైన, తనీష్, దీప్తి , శ్యామల తదితరులు లయబద్దంగా వేసిన స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్లో ఈ రెయిన్ డాన్స్ ప్రసారం కానుంది.
హీరో ప్రభాస్, ఎన్టీఆర్, దిల్ రాజుకు ఛాలెంజ్!

ఈ రోజు షోలో హైలెట్స్
శుక్రవారం ప్రసారం అయ్యే షోలో రెయిన్ డాన్స్ హైలెట్‌గా చూపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో పాటు వచ్చే వారం కెప్టెన్ ఎవరు? అనేది నేడు తెలనుంది. కెప్టెన్సీ టాస్క్ కోసం దీప్తి నల్లమోతు, తనీష్ పోటీపడ్డ సంగతి తెలిసిందే.
సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!


Click it and Unblock the Notifications











