Pallavi Prashanth: బిగ్ బాస్ షోలో పెను ప్రమాదం.. తలకు గాయమై కుప్పకూలిన రైతుబిడ్డ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం అయి నాలుగు వారాలు కావొస్తుంది. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఇక నాలుగో పవర్ అస్త్ర కోసం హౌజ్ మేట్స్ పోటా పోటీగా తలపడుతున్నారు. ఇదిలా ఉంటే... నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ నిర్వహిస్తున్న క్రమంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఏం జరిగిందనే విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇక బిగ్ బాస్ సీజన్ ఈ సారి మొదటి నుంచి ఉల్టా పుల్టాగా ఉంటుందని చెప్తున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే ఈ షో సాగుతోంది. ఇక హౌజ్ లో కంటెస్టెంట్స్ 14మంది ఎంటర్ అయ్యారు. ఇక అందులో నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యారు.

Raithu Bidda Pallavi Prashanth got head injury in Bigg Boss Telugu 7 house

ఇక మిగిలింది 11మంది. అందులో పవర్ అస్త్ర గెలుచుకుని ఆట సందీప్ మొదటి హౌజ్ మేట్ అయ్యాడు. ఇక రెండో వారంలో శివాజీ, మూడో వారంలో శోభా శెట్టి హౌజ్ మేట్స్ గా ఎంపిక అయ్యారు. ఇక నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకు టాస్క్ పెట్టాడు. హౌస్ బ్యాంకుగా మారిందన్న బిగ్ బాస్... బ్యాంకర్స్ గా శివాజీ, సందీప్, శోభా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో కాయిన్స్ ను సేకరించాలి... ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్లే విన్నర్స్ అని బిగ్ బాస్ వెల్లడించారు. ఇక గెలిచిన వారికి పవర్ అస్త్ర వస్తుందన్నమాట. ఇక గార్డెన్ ఏరియాలో ఏటీఎం ఏర్పాటు చేయగా... బజర్ మోగిన వెంటనే పరుగెత్తుకెళ్లి ఏటీఎం కి ఉన్న బటన్ ని ప్రెస్ చేయాలని సూచించాడు. ఈ టాస్క్ లో అందరూ బటన్ నొక్కే ప్రయత్నం చేస్తన్న క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో పల్లవి ప్రశాంత్ తలకు దెబ్బ తగిలి పక్కకు వచ్చేశాడు.

Raithu Bidda Pallavi Prashanth got head injury in Bigg Boss Telugu 7 house

ఆ తర్వాత వెంటనే పల్లవి ప్రశాంత్ కుప్పకూలిపోయాడు. కంటెస్టెంట్స్ అందరు అతనికి ఏమైందో అని టెన్షన్ పడుతుండగా... అమర్ దీప్ మాత్రం బజర్ ను నొక్కింది తానే అని గట్టిగా అరుస్తుంటాడు. ఇక పల్లవి ప్రశాంత్ కు ఏ మేర గాయాలు అయ్యాయి... ఎలా తగిలింది అనేది ఈ ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఇదంతా ప్రోమోలో చూపించారు.

ఇక ఈ వారంలో ఆరుగురు నామినేట్ అయ్యారు. టేస్టీ తేజా, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక, ప్రిన్స్ యావర్, రతికా రోజ్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అందులో టేస్టీ తేజ అనే పేరు వినిపిస్తుంది. టేస్టీ తేజ ఎలిమినేట్ అయితే.. ఇక హౌజ్ లో మిగిలేది 10 మంది కంటెస్టెంట్స్. మరి ఈసారి వైల్డ్ కార్టు ఎంట్రీ ఉంటుందో లేదా బిగ్ బాస్ 2.ఓ లాంచ్ ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X