Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 6 లోనే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ఇది గమనించారా?

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన ఈ పల్లవి ప్రశాంత్... బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనే ఉన్నారనే విషయం మీకు తెలుసా... నమ్మలేకపోతున్నారా... అవునండి.. ఆయన బిగ్ బాస్ సీజన్ 6లో ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియో ఏంటి... అసలు బిగ్ బాస్ సీజన్ 6లో పల్లవి ప్రశాంత్ ఎలా ఉన్నాడు.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రైతు బిడ్డ ట్యాగ్ తో... :బిగ్ బాస్ సీజన్ 7 ఉత్కంఠగా సాగుతోంది. ఇక ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగా.. అందులో కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ వాసి అయిన పల్లవి ప్రశాంత్ కుటుంబం రైతు కుటుంబం. ఇక రైతు బిడ్డ అనే ట్యాగ్ తో షోలోకి ఎంటర్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఇక రైతు బిడ్డ ట్యాగ్ ఉపయోగించి.. ఓట్లు సంపాదిస్తున్నాడని... అమర్ దీప్ అయితే.. ఎన్నో సార్లు ప్రశాంత్ తో గొడవలు పెట్టుకున్నాడు.

Raithu Bidda Pallavi Prashanth in Bigg Boss Telugu Season 6 Video Viral in Social Media

ప్రశాంత్ వర్సెస్ రతికా రోజ్:ఇక పల్లవి ప్రశాంత్ ఓట్లను కాస్త యూజ్ చేసుకుందాని రతికారోజ్ సైతం... ఆయనతో లవ్ ట్రాక్ నడిపిందని అన్నారు. ఇక వారి మధ్య విభేదాలు రావడం... మళ్లీ గొడప పడటం.. ఇక పల్లవి ప్రశాంత్ పై కూడా ఎన్నో ట్రోలింగ్స్ రావడం జరిగింది. ఇక నాలుగోవారానికి వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర గెలుచుకునే సమయంలో రతికారోజ్ చేసిన ప్రవర్తనకు ప్రేక్షకులకు సైతం చిర్రెత్తుకువచ్చేలా బిహేవ్ చేసింది. ఇక ఆ విషయం పక్కన బెడితే.. మొత్తానికి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7లో బాగానే ఆడుతున్నాడు.

Raithu Bidda Pallavi Prashanth in Bigg Boss Telugu Season 6 Video Viral in Social Media

బిగ్ బాస్ సీజన్ 6లో ప్రశాంత్ :అయితే ఇప్పుడు నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతుంది. అది బిగ్ బాస్ సీజన్ 6కు సంబంధించిన వీడియో. అందులో బిగ్ బాస్ సీజన్ 6వో ఉన్న రేవంత్, ఆది రెడ్డి, శ్రీహన్ డ్యాన్స్ లు చేస్తూ ఉంటారు. అయితే అక్కడ మన బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ పల్లవిప్రశాంత్ కనిపిస్తాడు. అదేంటి ఆయన బిగ్ బాస్ సీజన్ 6లో కూడా ఉన్నాడా అనుకంటే పొరపాటు పడినట్లే.

అసలు విషయం ఇది... :అసలు విషయం ఏమిటంటే... వీకెండ్ ఎపిసోడ్ వస్తే... నాగార్జునతో పాటు ఆడియెన్స్ కూడా ఉంటారు. ఇక ఆ ఆడియెన్స్ లో పల్లవి ప్రశాంత్ కనిపిస్తాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వీడియో బట్టి చూస్తే.. పల్లవి ప్రశాంత్ ఎప్పటి నుంచో బిగ్ బాస్ హౌజ్ కు వచ్చేందుకు తెగ ప్రయత్నం చేసినట్లు అర్ధం అవుతుంది. అయితే ఈ సారి ఆయనకు అవకాశం దక్కగా... బిగ్ బాస్ సీజన్ 7లో తన దైన మార్క్ తో ఆడుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X