Bigg Boss Telugu 7: అప్పుడు రైతు బిడ్డ... ఇప్పుడు ఊరోడు.. బిగ్ బాస్ ఇంట్లో ప్రశాంత్ కొత్త ప్లాన్

బిగ్ బాస్ హౌస్ లోకి ఓ కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ అడుగుపెట్టాడు. ఇక ఆయన రైతు బిడ్డ ట్యాగ్ యూజ్ చేస్తూ సింపతీ గెయిన్ చేసుకుంటున్నాడు అంటూ హౌస్ మెంబర్స్ అంతా మొదటి వారం నామినేషన్స్ లో టార్గెట్ చేసి మరీ నామినేట్ చేశాడు. ఇక అలా టార్గెట్ చేయడం ఆయనకు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. ఇప్పుడు మరో సింపతీ గెయిన్ చేసుకునేందుకు ప్రశాంత్ మళ్లీ సూపర్ ప్లాన్ వేశాడు. ఇప్పుడు ఊరోడు అంటూ కొత్త ప్లాన్ ప్రారంభించాడు. కానీ అది రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పల్లవి ప్రశాంత్... రైతు బిడ్డ.. ఈ పేరు ఊర్లోని జనాల్లోకి కూడా వెళ్లిపోయింది. ఓ రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు... మనోడిని గెలిపించాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఓ కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టాడు. షోలోకి ఎంటర్ అయ్యే ముందే రైతు బిడ్డ అంటూ ఓ ట్యాగ్ తగిలించుకుని వచ్చాడు. ఇక హౌస్ లోకి ఎంటర్ అయ్యాక... నేను కూడా రైతు బిడ్డే అంటూ రతిక రోజ్... పల్లవి ప్రశాంత్ కు కనెక్ట్ అయింది.

Raithu Bidda Pallavi Prashanth Now Get Started Sympathy Plan in Bigg Boss Telugu 7

ఇక హౌస్ లో మొదటి వారం పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ లవ్ ట్రాక్ నడించింది. ఇక హౌస్ మెంబర్స్ కు... పల్లవిప్రశాంత్ రైతు బిడ్డ అంటూ ట్యాగ్ తగిలించుకోవడం నచ్చలేదు. ముఖ్యంగా అమర్ దీప్.. నామినేషన్స్ లో... రైతు బిడ్డ అయితే ఏంటి... మీకు రైతులు ఒక్కరే కనిపిస్తున్నారా అంటూ రెచ్చిపోయాడు. రతిక కూడా ప్రశాంత్ కు వెన్ను పోటు పొడిచి.. రివర్స్ అయింది. పల్లవి ప్రశాంత్ ఇదే ఛాన్స్ అనుకుని అవును నేను రైతు బిడ్డే అంటూ రెచ్చిపోయాడు.

ఇక రైతు బిడ్డ ట్యాగ్ వాడి.. బాగానే ఓట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ విషయం చల్లారింది... ప్రశాంత్ మరో కొత్త ప్లాన్ వేశాడు. అది ఊరోడు అనే ట్యాగ్ తగిలించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్ చూస్తే... ప్రశాంత్.. సందీప్ ను నామినేట్ చేశాడు.. సందీప్ లైట్ గానే తీసుకున్నప్పటికీ... ప్రశాంత్ మాత్రం రెచ్చిపోయి మాట్లాడాడు. ఇక సందీప్... ప్రశాంత్ నామినేషన్స్ కు వచ్చేసరికి మాత్రం... ప్రశాంత్ ఇక పిచ్చిగా బిహేవ్ చేశాడు.

ఊరోడు అనే మాట సందీప్ అనకపోయినా... అన్నావ్ అంటూ గొడవ పెట్టుకున్నాడు. ఊరోడని నన్ను తక్కువ చూశావ్ అంటూ కొత్త ప్లాన్ షూరు చేశాడు. అప్పుడు రైతు బిడ్డ... ఇప్పుడు ఊరోడు అనే ట్యాగ్ తగిలించుకుని సింపతీ గెయిన్ చేయాలని ప్లాన్ చేశాడు అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ మళ్లీ రెచ్చిపోవడానికి కారణం బోలే చేసిన లీక్ అని తెలుస్తోంది. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన బోలే.. ప్రశాంత్ ను రెచ్చగొట్టేలా చేశాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Raithu Bidda Pallavi Prashanth Now Get Started Sympathy Plan in Bigg Boss Telugu 7

బోలే షవాలి.. ప్రశాంత్ కు బయట ఉన్న ఇమేజ్ లీక్ చేశాడు. అంతే కాదు.. రైతు బిడ్డ గురించి ప్రశాంత్ కు చెప్పుకువచ్చాడు. ఇక ప్రశాంత్ బయటకు రాగానే తనకు ఓ సినిమా ఆఫర్ వస్తుందని లీక్ చేశాడు. ఆ లీక్ వల్లే ప్రశాంత్ మళ్లీ రెచ్చిపోయి హౌస్ లో వీరంగం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ ఇప్పుడు ఊరోడు అనే ట్యాగ్ యూజ్ చేసి సింపతీ గెయిన్ చేయాలని చూస్తున్నట్లు అర్థం అవుతుంది. చూడాలి మరి మున్ముందు ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X