Bigg Boss Telugu 7: మరోసారి పుష్పలా మారిన ప్రశాంత్... ఆ లీక్ వల్లే రెచ్చిపోయిన రైతుబిడ్డ
బిగ్ బాస్ తెలుగు సెవెన్ రోజు రోజుకు రంజుగా మారుతోంది. ముఖ్యంగా హౌజ్ లో వైల్డ్ కార్డు ఎంట్రీస్ తర్వాత మరింత ఆసక్తిగా మారింది బిగ్ బాస్ షో. అయితే హౌజ్ లో మరోసారి పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయాడు. పుష్ప మేనరిజం చూపిస్తూ... మరోసారి రెచ్చిపోయి మాట్లాడాడు. ఇక ప్రశాంత్ అలా మారడానికి కారణం... వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఓ కంటెస్టెంట్ లీక్ చేసిన విషయమే అని తెలుస్తోంది. అసలు ప్రశాంత్ గురించి ఆ కంటెస్టెంట్ ఏం లీక్ చేశాడు.. ఎందుకు ప్రశాంత్ మళ్లీ రెచ్చిపోయాడు... పుష్పలా మారి మేనరిజం ఎందుకు చూపించాడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఓ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు. ఇక అతి తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ రైతు బిడ్డగా హౌస్ లో అయితే ఎంటర్ అయ్యాడు. ఇక ఎప్పుడైతే ప్రశాంత్ హౌజ్ లో అడుగుపెట్టాడో... ఇక రైతు బిడ్డ ట్యాగ్ తో బయట సింపతీ మొదలు అయింది.దానికి తోడు రతిక కూడా పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపి.. ఏంతో కొంత ఓట్లను క్యాష్ చేసుకోవాలనుకుంది. ఇక వారి లవ్ ట్రాక్ మొదటి వారం బాగానే నడిచినా.. తర్వాత దెబ్బకొట్టింది.

ఇక రెండో వారంలో ప్రశాంత్ పై ఇంటి సభ్యులు టార్గెట్ చేశారు. నామినేషన్స్ లో అమర్ దీప్... రైతు బిడ్డ ట్యాగ్ వాడకు అంటూ రెచ్చిపోయాడు. రతికా రోజ్ కూడా రివర్స్ అయింది. అప్పుడు ప్రశాంత్ లోంచి పుష్ప మేనరిజం వచ్చింది. పుష్ప టైప్ లో భూజాన్ని ఎత్తి... ప్రశాంత్ మేనరిజం చూపించాడు. ఇక అప్పుడు అమర్ దీప్ భుజం దించు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయినా తగ్గేదేలే అంటూ.. ప్రశాంత్... నా మేనరిజం ఇంతే... అంటూ సమాధానం చెప్పాడు.
ఇక నాలుగోవారంలో పవర్ అస్త్ర గురించి పోటీలు జరుగుతున్నప్పుడు రతికారోజ్... కాస్త జోరు జారింది. అంతే కాదు.. రైతు బిడ్డకు క్రైయింగ్ స్టార్ అంటూ మరో ట్యాగ్ ఇచ్చింది. అమర్ దీప్ తో కలిసి వెకిలి చేష్టలు చేసుకుంటూ.. ప్రశాంత్ పై రెచ్చిపోయి మాట్లాడింది. ఇంట్లో వాళ్లు ఎలా పెంచారు.. ఇదేనా పెంచడం.. బ్రెయిన్ లో మన్ను మశానం ఉందంటూ రెచ్చిపోయి మాట్లాడింది. ఇలా మాట్లాడటం రతికకు మైనస్ అయింది అనుకోండి. ఇక అప్పుడు సైతం పుష్ప మేనరిజం చూపిస్తూ.. ప్రశాంత్ మరోసారి రెచ్చిపోయాడు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఆటగాళ్లకు పోటుగాళ్లుకు పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ గేమ్స్ లో ఆటగాళ్లుపై చేయి సాధించారు. అందులో కెప్టెన్సీ కోసం.. బెలూన్ పగులకొట్టాలని మరో గేమ్ పెట్టారు. ఇక సందీప్ వచ్చి.. ప్రశాంత్ బెలూన్ పగులగొట్టాడు. అప్పుడు మరోసారి పుష్ప మేనరిజం చూపిస్తూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. గౌతమ్ ఏదో చెప్పబోతుంటే కూడా ప్రశాంత్ మళ్లీ రెచ్చిపోయి మాట్లాడాడు.
అయితే దీని అంతంటికీ కారణం... వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన బోలే షావలి అని అర్థం అవుతుంది. బోలే షావలి.. బయట రైతు బిడ్డకు ఉన్న క్రేజ్ లీక్ చేయడమే అని తెలుస్తోంది. ప్రశాంత్ క్రేజ్ ను బోలే షవాలి లీక్ చేశాడు. ఇక లీక్ వల్లే మరోసారి ప్రశాంత్ రెచ్చిపోయి అలా బిహేవ్ చేశాడు అని తెలుస్తోంది. ఇక మున్ముందు ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











