Pallavi Prashanth: అపరిచితుడిలా రైతు బిడ్డా... మొన్నటివరకు సరసాలు.. ఇప్పుడేమో రతిక అక్కా అంటూ..
బిగ్ బాస్ సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇక నాలుగోవారంలోకి అడుగుపెట్టిన ఈ షో... నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ప్రశాంత్, రతికల మధ్య మరోసారి గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో రతిక.. పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయింది. అయితే పల్లవి ప్రశాంత్... రతికను అక్కా అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్ మాత్రం మొన్నటి వరకు సరసాలు నడిపి... ఇప్పుడెట్లా అక్కా అవుతుందంటూ ఫైర్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ హౌజ్ లో కామన్ మ్యాన్ ను తీసుకోవడం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే రైతు అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ ను తీసుకువచ్చారు. ఇక హౌజ్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్... రతికకు దగ్గరగా అయిన విషయం తెలిసిందే. లక్కీ లేడి అంటూ రతికను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి రతిక, పల్లవి ప్రశాంత్ లవ్ ట్రాక్ నడిచింది. ఇక హౌజ్ లో ఎక్కడ చూసిన ఈ జంటే సపరేట్ గా కూర్చొని మాట్లాడుకోవడం కనిపించింది.

ఇంత జరిగిన తర్వాత నామినేషన్స్ లో ప్రశాంత్ ఇంటి సభ్యులకు టార్గెట్ అయినప్పుడు రతిక పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కుక్కలాగా తిరిగిన అంటూ ప్రశాంత్ బాధతో చెప్పుకుంటుంటే... కుక్కలాగా తిరిగితే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావ్ అంటూ రతిక.. ప్రశాంత్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి రతిక వర్సెస్ ప్రశాంత్ లా నడిచింది. ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఇక ఆ తర్వాత మళ్లీ సారీ చెప్పుకుని మాట్లాడుకున్నారు.
ఇదంతా పక్కన ఉంచితే... నిన్నటి నామినేషన్స్ లో ప్రశాంత్ గౌతమ్ ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో అమ్మాయి షర్ట్ విప్పడం నచ్చలేదనే రీజన్ తో గౌతమ్ ను నామినేట్ చేయగా... రతిక పొట్టి బట్టల విషయం మధ్యలో ఎంటర్ అయింది. ఆమె సింగిల్ పీస్ డ్రస్ వేసుకుంటే ఏమన్నాడో చెప్పుకొచ్చాడు గౌతమ్. దీంతో గొడవ సైడ్ అయి... దీంతో రతిక, ప్రశాంత్ పంచాయితీ పెట్టుకున్నారు. తను చాలా నార్మల్ గా అన్నానని ప్రశాంత్ చెప్పగా.. ఎలా పడితే అలా అంటే ఒప్పుకొనేది లేదని రతిక ఫైర్ అయింది.
అలా కాసేపు వాదించిన తర్వాత.. ఇక నిన్ను రతిక కాదు ఏమని పిలవను అని ప్రశాంత్ అడిగాడు. దాంతో రతిక అని పిలువు.. ఏయ్ ఓయ్ అంటే పడను అని రతిక అంటుంటే... కేవలం అక్క అని మాత్రమే పిలుస్తానని రైతుబిడ్డ వరస మార్చేశాడు. దీంతో చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే తొలివారం లవ్ ట్రాక్ నడిపాడు... రెండో వారం గొడవపెట్టుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా అక్క అని పిలిచి రైతుబిడ్డా అపరిచితుడిలా ప్రవర్తించాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











