Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌కు ఇంతకు ముందే పెళ్లైందా... ఇదేంటీ ఇలా ఉన్నాడు?
బిగ్ బాస్ హౌజ్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఇటీవల కాలంలో బాగా క్రేజ్ కొట్టేస్తున్నాడు. మొదటి రెండు వారాలు ట్రోలింగ్ కు గురైనా... ఇప్పుడిప్పుడే ఆట తీరును మార్చుకుని మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. ఇక ఈ కుర్రాడు ఎప్పటి నుంచో బిగ్ బాస్ కు వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేయగా... 7వ సీజన్ లో ఆ ఛాన్స్ దక్కింది. మరి ప్రశాంత్ కు పెళ్లైనట్లు.. ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అసలు నిజంగానే ప్రశాంత్ కు ఇంతకు ముందే పెళ్లైందా... వారి తల్లిదండ్రులు చెప్పిన మాటల్లో నిజమెంత అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రతివారం ప్రేక్షకులకు ట్విస్టులు, షాక్ లు ఇస్తూ.. బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడు. అయితే ఈ ఇంట్లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్... గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పల్లవి ప్రశాంత్ మొదటి వారంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. రైతు బిడ్డ అంటూ జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే రతికతో పులిహోర కలపడం ఆయనకు మైనస్ గా మారింది.

రైతు బిడ్డ... రతిక బిడ్డగా మారాడంటూ ట్రోలింగ్ మొదలు అయింది. ఎక్కడ చూసిన హౌజ్ లో ఈ జంటే సపరేటుగా కనిపించింది. అంతే కాదు.. రాత్రి పూట వీరు ఒంటరిగా మాట్లాడుకోవడం.. మాది కూడా రైతు ఫ్యామిలే అంటూ రతిక కూడా మాటలు కలపడం జరిగింది. కానీ మొదటి వారం నామినేషన్స్ లో అందరూ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశారు. ఇక అప్పుడు రతిక కూడా ప్రశాంత్ కు హ్యాండ్ ఇచ్చి ప్రశాంత్ కు పెద్ద షాక్ ఇచ్చింది.
ఇక రెండో వారంలో వీళ్లు మాట్లాడుకోలేదు.. మళ్లీ సారీ చెప్పుకుని మాటలు కలిసినా... ఇక నాలుగో వారంలో బద్ధ శత్రువుల్లా మారిపోయారు. రతికను అక్క అని పిలిచాడు ప్రశాంత్. అయినా... ఆమె ఇతన్ని వదల్లేదు.. ఇంట్లోవాళ్లను లాగుతూ తిట్టింది. దీంతో ఆమె బయటకు వెళ్లిపోయింది అనుకోండి. అయితే సోషల్ మీడియాలో ప్రశాంత్ గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆయనకు పెళ్లైనట్లు ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ప్రశాంత్ కు పెళ్లికాలేదు... బిగ్ బాస్ నుంచి వచ్చాక పెళ్లి చేస్తామని ఇంతకు ముందు అతని పేరెంట్స్ చెప్పుకువచ్చారు. మరి సోషల్ మీడియాలో ప్రశాంత్ పెళ్లి ఫోటోలు ఎక్కడివి అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అయితే ఆ ఫోటోలు, వీడియోలు... ప్రశాంత్ కామెడీ కోసం చేసిన రీల్స్. వాటిని కొంత మంది కట్ చేసి... వైరల్ గా మార్చుతున్నారు. ఇంతకు ముందే పెళ్లైంది... అయినా హౌజ్ లో ఆ అమ్మాయితో సరసాలు అంటూ వైరల్ చేస్తున్నారు.
ఇవి చూసిన నెటిజన్స్... ప్రశాంత్ పై ఫైర్ అవుతున్నారు. అయితే అవి కేవలం రీల్స్ మాత్రమే అని తెలియక కొంతమంది భార్య ఉండి కూడా ఈ పులిహోర అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే అసలు విషయం ఇది తెలిస్తోంది. ఇక ప్రశాంత్ ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆటతో మెప్పిస్తున్నాడు. మరి ఇంకా ఎన్ని రోజులు ఉంటాడో వేచి చూడాల్సింది.


Click it and Unblock the Notifications











