Brahmamudi September 23rd:ఆ క్లూతో కనిపెట్టేసిన రాజ్.. మరి విగ్రహాలను తీసుకువస్తాడా?

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు కూడా ఆసక్తిగా సాగింది. కృష్ణమూర్తిని కొట్టి రాహుల్ పంపించిన రౌడీలు విగ్రహాలు ఎత్తుకెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న కావ్య... వెంటనే విగ్రహాల కార్ఖానాకు చేరుకుంటుంది. అక్కడ గాయాలతో కృష్ణ మూర్తి పడి ఉంటాడు. ఇక అది చూసిన కావ్య, అప్పు, కనకం..ఏడుస్తూ ఉంటారు. మరోవైపు నా విగ్రహాలు నాకు కావాలని కంట్రక్టార్ వచ్చి అడుగుతాడు. రాజ్ నేను తీసుకు వస్తాను... అని చెప్పి వెళ్తాడు. అసలు రాజ్ ఆ విగ్రహాలను పట్టుకుంటాడా.. కావ్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా.. అనేది ఈ స్టోరీలో చూద్దాం.

సీరియల్ ప్రారంభంలోనే రౌడీలు కృష్ణ మూర్తి కొట్టేందుకు వస్తారు. కృష్ణ మూర్తిని కొట్టి... అక్కడ ఉన్న వినాయక విగ్రహాలను డీసీఎంల్లో ఎక్కించుకుని వెళ్తాడు. అడ్డు వచ్చిన కృష్ణ మూర్తిని చితకబాదుతారు. కృష్ణమూర్తి వారిని బతిమిలాడుతాడు. వద్దు.. కష్టపడి చేసుకున్నామని చెబుతాడు. కాళ్లు కూడా పట్టుకుంటాడు. అయినా వారు వినకుండా కృష్ణమూర్తిని కొట్టి విగ్రహాలను తీసుకెళ్తారు. ఇది చూసిన బంతి... వెంటనే అక్కకు చెప్పాలి అని అనుకుంటాడు.

 Raj and Appu Searching For Ganesh idols in September 22nd 2023 Episode number 208 in Brahmamudi Telugu Serial

మరోవైపు కనకం ఇంట్లో రాజ్, కావ్య, కనకం డ్యాన్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈలోపు బంతి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. బంతి రావడాన్ని చూసి ఏమైంది అని కావ్య అడుగుతుంది. బంతి జరిగిన విషయం చెప్తాడు. పెదనాన్నను కొట్టి విగ్రహాలను ఎత్తుకెళ్తున్నారని కావ్యకు చెప్తాడు. అది విన్న వారంతా షాక్ అవుతారు. మరోవైపు కృష్ణ మూర్తి చావు బతుకుల మధ్య ఉంటాడు.

విషయం తెలుసుకున్న కావ్య, రాజ్, కనకం, అప్పు.. కార్ఖనాకు వస్తారు. గాయాలతో పడి ఉన్న కృష్ణమూర్తిని చూసి కంగారు పడుతారు. ఏడుస్తారు. అంతా అయిపోయిందని కృష్ణ మూర్తి బోరున ఏడుస్తాడు. మనం కష్టపడి సంపాదించుకున్నది అంతా పోయిందని విలపిస్తాడు. మనం ఆసుపత్రికి వెళ్దామని కావ్య చెబితే.. ఇక బతికి ఏం చేయాలని కృష్ణమూర్తి ఆవేదన చెందుతాడు. రాజ్ ఏం జరిగిందని అడుగుతాడు. తెలియదు బాబు.. ఎవరో వచ్చి మొత్తం ఎత్తుకెళ్లిపోయారు అని చెప్తాడు.

ఇల్లు నిలబెట్టుకోవడానికి ఇదంతా చేశానని అనుకుంటున్నారు కదా.. కాదు... నా కూతురు అప్పు కోసం ఇదంతా చేశాను. ఇల్లు ఉంటే అయినా.. మంచి సంబంధం వస్తే.. తను అయినా సుఖపడుతుందని ఆలోచించాను. కానీ ఈరోజు మొత్తం పోయిందని కృష్ణమూర్తి బోరున విలపిస్తాడు. కళ్ల ముందే పేక మేడల్లా కూలిపోయిందని అంటాడు. ఈలోపు కంట్రాక్టర్ శ్రీను వస్తాడు.

నా విగ్రహాలు ఏవి.. మొత్తం పోయాయా ఎలా అని టెన్షన్ పడుతాడు. మా నాన్న గాయాలతో ఉంటే.. మీకు విగ్రహాలు కావాలా అని అంటుంది అప్పు. దానికి కంట్రాక్టర్ ఇప్పుడు నన్ను చంపేస్తారు వారికి నేను ఏం సమాధానం చెప్పాలి. విగ్రహాలు ఆర్డర్ ఇచ్చిన వారిలో పెద్దవాళ్లు ఉన్నారు. వారంతా వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇల్లు పొలం తాకట్టు పెట్టి డబ్బు తీసుకువచ్చాను. మీ కాళ్లు పట్టుకుంటాను అని కంగారు పడుతాడు.

ఏదో ఒకటి చేద్దామని కావ్య చెప్తుంది. ఆలోచించడానికి టైం లేదు.. విగ్రహాలు ఆర్డర్ ఇచ్చిన వారిలో మినిస్టర్ కూడా ఉన్నారు. ఆయన నన్ను చంపేస్తాడు. నా విగ్రహాలు కావాలి అని అంటాడు. దానికి రాజ్ నీకు కావాల్సింది డబ్బే కదా నేను ఇస్తాను అంటాడు. కానీ డబ్బు ఎవరికి కావాలి... నాకు విగ్రహాలే కావాలి. అప్పు చేసి డబ్బు తీసుకువస్తాను.. విగ్రహాలు వస్తాయా అని అంటాడు కంట్రాక్టర్. రాజ్ కు ఓ ఆలోచన వస్తుంది. రాజ్ వచ్చే దారిలో డీసీఎంలు ఎదురు వస్తాయి. అది గుర్తుకు చేసుకుంటాడు.

వచ్చే దారిలో రెండు డీసీఎంలు ఎదురువచ్చాయి. కాబట్టి వాటిలో విగ్రహాలు తీసుకువెళ్లారు. అని గెస్ చేస్తాడు. ఆ బండి నంబర్ గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక అప్పు తన ఫ్రెండ్స్ తో వెతుకుతాను అంటుంది. ఇక రాజ్ తన అధికారాన్ని యూజ్ చేసి తెలుసుకుంటాను అని వెళ్తారు. తప్పకుంటా పట్టుకుంటా అని కావ్యకు మాట ఇచ్చి వెళ్తాడు.

ఇక రౌడీలకు రాహుల్ కాల్ చేసి... ఆ విగ్రహాలను నిమర్జనం చేసేయండి అని చెప్తాడు. డబ్బు కోసం కక్కూర్తి పడకండి నేను ఇస్తాను.. వాటిని నిమర్జనం చేయండి అని చెప్తాడు. మరోవైపు రాజ్ వారి కోసం వెతుకుతాడు. రౌడీలు చెరువు వద్దకు విగ్రహాలను తీసుకువెళ్తారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో రాజ్ వారి కోసం ఊరంతా వెతుకుతాడు. అప్పు సైతం ఫ్రెండ్స్ తో వెతుకుతూ ఉంటుంది. కంట్రాక్టర్ శ్రీను ఈ పాటికి వాటిని అమ్మేసి ఉంటారు అని అంటాడు. మరి రాజ్ ఆ విగ్రహాలను పట్టుకువస్తాడా.. లేదా అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X