Brahmamudi September 5th: కావ్యకు 3 నెలల గడువు.. నాటాకాలు మొదలెట్టిన రాజ్... షాక్‌లో అపర్ణ

ఇక బ్రహ్మముడి సీరియల్ ప్రారంభంలోనే రాజ్, సీతారామయ్య మాట్లాడుకుంటారు. వ్రతం ఇంకా పూర్తి కాలేదు. అది కూడా నీవల్లే అని చెబుతాడు సీతారామయ్య. నాకేం సంబంధం తాతయ్య అని రాజ్ అంటే... ఉదయం నుంచి కావ్య ఉపవాసం ఉంది. వ్రతం పనులన్నీ చేసి చేసి అలసిపోయింది. చివరిలో అక్షింతలు వేయకుండా ఆ అమ్మాయి మనసు బాధపెట్టావ్ అంటాడు సీతారామయ్య. అపర్ణ రగిలిపోతుంది.

వెళ్లి కావ్యని తీసుకొచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించు... నువ్వు అక్షింతలు వేస్తేనే కానీ కావ్య భోజనం చెయ్యదు అంటాడు సీతారామయ్య. దాంతో రాజ్.. ఇప్పుడే వెళ్లి తనని కిందకు తీసుకొస్తాను తాతయ్యా అంటూ కావ్య దగ్గరకు వేగంగా వెళ్తాడు. ఇక కావ్య అప్పటికే రాజ్‌తో చెప్పినట్లే ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లడానికి అన్నీ సర్థుకుని బ్యాగ్స్‌తో బయలుదేరబోతుంటే ఎదురుపడతాడు రాజ్. ఎక్కడికి అంటే.. వెళ్లిపోతున్నాను అంటుంది కావ్య. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అంటాడు. ఇంకొన్ని రోజులు చూశావ్.. ఇంకొక మూడు నెలలు ఓపిక పట్టి చూడు అని చెబుతాడు.

Raj Appeal to kavya in September 5th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

మూడు నెలల్లో మీరు మారిపోతారా? లేక మూడు నెలలు ఉండి వెళ్లిపోవాలా? నన్ను భార్యగా స్వీకరిస్తారా? ఇప్పటి వరకూ నేను ఎప్పుడెప్పుడు వెళ్లిపోతా అని ఎదురు చూసిన మీరు ఇంతలోనే నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఈ రోజు నుంచి నాకు మీ మనసులో స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కావ్య. 'నువ్వు అడిగిన అన్నింటికీ నెల గడువులోపే కచ్చితంగా జవాబు దొరుకుతుంది' అంటాడు రాజ్ కావ్యతో అంతే కోపాన్ని మనసులో దాచిపెట్టుకుని.

Raj Appeal to kavya in September 5th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

ఇక కావ్య చేతిని పట్టుకుని.. కిందకి తీసుకువెళ్తాడు రాజ్. 'తాతయ్యా మీరు చెప్పినట్లే మీ మనవరాలిని తీసుకొచ్చాను' అంటాడు రాజ్. 'చాలా సంతోషం రాజ్' అంటూనే అక్షింతలు ఇవ్వు చిట్టీ అంటాడు సీతారామయ్య. రాజ్ నానమ్మ వెంటనే పైకి లేచి అక్షింతలు తెచ్చి రాజ్‌కి ఇచ్చి.. 'అమ్మా కావ్యా ఆశీర్వాదం తీసుకోమ్మా' అంటుంది. దాంతో కావ్య చాలా సంతోషంగా సంబరంగా రాజ్ కాళ్ల మీద పడితే రాజ్ అయిష్టంగానే తాతయ్య కోసం అక్షింతలు వేస్తాడు.

Raj Appeal to kavya in September 5th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

ఇక భర్త కాళ్లకు నమస్కరించి పైకి లేచిన కావ్య.. సీతారామయ్యతో.. 'తాతయ్యగారు నా వ్రతం పూర్తి కాలేదన్న బాధ నుంచి నన్ను బయటపడేశారు. ఇంతకన్నా వ్రతఫలం ఇంకేం అసవరం లేదు తాతయ్యా' అంటుంది ఎమోషనల్‌గా. 'అమ్మవారి సాక్షిగా చెబుతున్నా మీది బ్రహ్మముడి. మిమ్మల్ని ఎవ్వరూ విడదియ్యాలని చూసినా వాళ్లకి భంగపాటు తప్పదు' అంటూ ఆశీర్వదిస్తాడు సీతారామయ్య.

Raj Appeal to kavya in September 5th 2023 Episode number 193 in Brahmamudi Telugu Serial

మరోవైపు అపర్ణను రుద్రాణి రెచ్చగొడుతుంది. నీ కోడలు సామాన్యురాలు కాదు వదినా.. ఇందరిని ఓ ఆట ఆడిస్తోంది. రాజ్‌కి భార్య అంటే పడేదే కాదు అలాంటిది ఏమాయ చేసిందో కావ్య చెప్పినట్లే వింటున్నాడు' అంటుంది రుద్రాణి. మరోవైపు ఇదంతా నీ మాయేనా కృష్ణయ్యా.. నా భర్త మారుతున్నాడా? అందుకే మూడు నెలలు గడువు అడిగారా? నాలో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. వాటిని నువ్వే నిజం చెయ్యాలి అని మొక్కి కావ్య వెళ్తుంది. ఇక రాజ్ వచ్చి... కళవతిని ప్రేమగా చూసుకుంటున్నట్లు నటించాలని.. నువ్వే చూసుకోవాలి అని చెబుతాడు. కళావతి మీద లేని ప్రేమను నటిస్తూ ఉంటాడు రాజ్. అది చూసి సీతారామయ్య నవ్వుకుంటే.. అపర్ణ రగిలిపోతుంది. ఆ వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X