Brahmamudi August 10th: భర్త చేసిన పనికి కావ్య షాక్.. ఇక కావ్య అత్తింటికి దూరం అవ్వనుందా?

బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. ఇప్పుడున్న సీరియల్స్ లో ఈ ధారావాహికకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణతో పాటు.. ఎక్కువ రేటింగ్ సాధిస్తోంది. ఇక ఈరోజు సీరియల్ లో రాహుల్ చెప్పుడు మాట‌లు న‌మ్మిన రాజ్...కావ్య‌కు వ‌చ్చిన బొమ్మ‌ల కాంట్రాక్ట్‌ను క్యాన్సిల్ చేస్తాడు. భ‌ర్త చేసిన ప‌నితో కావ్య షాక‌వుతుంది. ఈరోజు పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కావ్య తన పుట్టిల్లు తాకట్టులో ఉండటంతో.. త‌ల్లిదండ్రుల‌కు సాయం చేయాల‌నే ఉద్దేశ్యంతో కావ్య బొమ్మ‌ల కాంట్రాక్ట్ తీసుకుంటుంది. బొమ్మ‌లు త‌యారు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మ‌ట్టిని తానే స్వ‌యంగా తొక్కుతుంది. ఆమె మ‌ట్టి తొక్కుతున్న వీడియోను మీడియా ద్వారా వైర‌ల్ చేయిస్తాడు రాహుల్. దుగ్గిరాల ఫ్యామిలీ కోడ‌లు కూలీ ప‌నిచేసుకుంటూ బ‌తుకుతుంద‌ని అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేయిస్తాడు.

Raj cancelled kavya bussiness contract in August 10th 2023 Episode number 171 in Brahmamudi Telugu Serial

మ‌ట్టి ప‌నులు చేస్తూ కావ్య త‌మ కుటుంబ‌ప‌రువు తీసింద‌ని అపోహ ప‌డుతుంది అప‌ర్ణ‌. కావ్య‌ను త‌ప్పుప‌డుతుంది. ఇంట్లోకి రానివ్వ‌డ‌మే ఎక్కువ అంటూ నానామాట‌లు అంటుంది. రాజ్ కూడా కావ్య‌నే త‌ప్పుప‌డ‌తాడు. పుట్టింటి కోస‌మే తాను క‌ష్ట‌ప‌డుతోన్న‌ట్లు, తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని కావ్య చెప్పిన మాట‌ల్ని ఎవ‌రూ ప‌ట్టించుకోరు.

బొమ్మ‌లు చేసే ప‌నిని వ‌ద‌లివేయ‌మ‌ని, పుట్టింటితో సంబంధాలు తెంచుకోమ‌ని కావ్య‌కు అప‌ర్ణ‌తో పాటు రాజ్ వార్నింగ్ ఇస్తారు. లేదంటే దుగ్గిరాల ఫ్యామిలీలో నీకు చోటు ఉండ‌ద‌ని అంటారు. త‌న కుటుంబ‌ప‌రిస్థితి గుర్తొచ్చి వారి బెదిరింపుల‌కు కావ్య భ‌య‌ప‌డ‌దు. బొమ్మ‌లకు రంగులు వేసి కాంట్రాక్ట‌ర్‌కు అప్ప‌గించ‌డానికి పుట్టింటికి వ‌స్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ ముందు కావ్య‌ను దోషిని చేయాల‌నే త‌మ ప్లాన్ వ‌ర్క‌వుట్ కావ‌డంతో రాహుల్, రుద్రాణి హ్యాపీగా ఫీల‌వుతారు.

Raj cancelled kavya bussiness contract in August 10th 2023 Episode number 171 in Brahmamudi Telugu Serial

రాజ్ మ‌న‌సులో కావ్య ప‌ట్ల ఉన్న మంచి అభిప్రాయాన్ని దూరం చేయాల‌ని ఫిక్స్ అవుతాడు రాహుల్‌. చెప్పుడు మాట‌ల‌తో రాజ్ మ‌న‌సును మార్చేస్తాడు. బొమ్మ‌ల కాంట్రాక్ట్‌ దూర‌మైతే కావ్య‌కు మ‌రో మార్గం లేక స‌హాయం కోసం నిన్నే అర్థిస్తుంద‌ని రాజ్‌ను న‌మ్మిస్తాడు రాహుల్‌. నిన్నే హెల్ప్ అడుగుతుంద‌ని అంటాడు.

Raj cancelled kavya bussiness contract in August 10th 2023 Episode number 171 in Brahmamudi Telugu Serial

రాహుల్ మాట‌ల‌ను న‌మ్మిన రాజ్ అత‌డు చెప్పిన‌ట్లుగానే చేస్తాడు. కావ్య బొమ్మ‌ల కాంట్రాక్ట్‌ ను త‌న ప‌లుకుబ‌డితో క్యాన్సిల్ చేయిస్తాడు రాజ్. ఇక కావ్య ఇంటికి వెళ్లిన కాంట్రక్టర్ శ్రీను... అది చూసిన కావ్య పని జరుగుతుంది. బొమ్మలు పంపిస్తాను అంటుంది. అవసరం లేదమ్మా.. కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిందని చెబుతాడు శ్రీను. ఏమైందీ అని అడుగుతుంది కావ్య. పెద్ద వాళ్లతో వ్యవహారం వద్దమ్మా ఆపేసేయండి అంటాడు. ఇక కావ్య ఆ పెద్ద వాళ్లు ఎవరో చెప్తే కానీ పంపించను అని చెబుతుంది. దానికి మీ ఆయనే నన్ను ఈ కాంట్రక్ట్ క్యాన్సిల్ చేయమని బెదిరించాడు అని చెబుతాడు.

Raj cancelled kavya bussiness contract in August 10th 2023 Episode number 171 in Brahmamudi Telugu Serial

కాంట్రాక్ట‌ర్ ద్వారా రాజ్ ఈ ప‌నిచేయించాడ‌ని కావ్య తెలుసుకుంటుంది. భ‌ర్త చేసిన ప‌నికి కావ్య షాక్ కు గురవుతుంది. పుట్టింటికి సాయం చేయ‌బోయి అత్తింటికి కావ్య దూర‌మైందా.. కావ్య పుట్టింటి క‌ష్టాలు తీర్చ‌డం కోసం ఏం చేసింది.. రాజ్ త‌న త‌ప్పును తెలుసుకున్నాడా.. తాను కోరుకున్న‌ట్లుగానే కావ్య అత‌డి సాయం కోరిందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే.. రేపటి ఎపిసోడ్ లో మళ్లీ కలుద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X