Brahmamudi November 9th: రుద్రాణి చెంప చెల్లుమనిపించిన ఇందిరా దేవి.. రాజ్‌కు అపర్ణ గోరుముద్దలు

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో తప్పని సరి పరిస్థితుల్లో నేను మౌనంగా ఉన్నాను అంటుంది కావ్య. నీ మౌనం ఖరీదు.. ఈ ఇంట్లో వాళ్ల అందరి సంతోషం.. దాన్ని దూరం చేశావ్ నువ్వు అంటాడు రాజ్. తాతాయ్య ఆరోగ్యం ఇలా ఉందని నాకు తెలియదు అండి అంటుంది కావ్య. తెలిసి ఉంటే.. మీ అక్కతో కలిసి ఇంకా ప్లాన్ చేసేదానివి కదా అంటాడు రాజ్. ఇక కావ్య ఎంత చెప్పినా... రాజ్ వినిపించుకోడు.. మా అమ్మను కూడా ఎదిరించాను అని చెప్తాడు రాజ్. ఏ భార్య అయినా నలుగురిలో తన భర్త పరువు కాపాడాలని అనుకుంటుంది. ఇలా జోకర్ లా చేయాలనుకోదు.. ఆ విషయంలో 100 పర్సంట్ సక్సెస్ అయ్యావ్... అంటాడు రాజ్.

ఇక కావ్య బాధపుడుతూ.. ఈయన కోపంలో అర్థం ఉంది.. అక్క చేసిన తప్పుకు నేను తోడు అయ్యాను అనుకుంటున్నాడు.. ఎలా చెప్పాలి అనుకుంటుంది. ఇక ఇంట్లో అంతా దీనంగా కూర్చొని ఉంటారు. మావయ్య గారు కాఫీ తీసుకుండి అని కావ్య అంటుంది. వద్దు అంటాడు సుభాష్. ఇంట్లో ఎవరికి ఇచ్చినా తీసుకోవడానికి ఇష్టపడరు. స్వప్న మాత్రం కాఫీ ఇవ్వవే అంటుంది.. కానీ కావ్య ఆమెకు ఇవ్వకుండా పోతుంది. ఇక ఇందిరా దేవి వచ్చి... ఆస్తి పేపర్లు అన్ని ముందట పెడుతుంది.

Raj Comforts Indradevi in November 9th 2023 Episode number 249 in Brahmamudi Telugu Serial

నేను సుమంగళిగా పోవాలని అనుకుంటున్నా... బయట ప్రపంచం నాకుతెలియదు.. మీరు ఎదిగిన వారు.. మీరు అన్ని ఎరిగిన వారు.. నా భర్త ప్రాణాలను నాకు దానం చేయండి అంటూ బాధ పడుతుంది. ఈ సమయంలో కల్యాణ్ కు అనామిక ఫోన్ చేస్తూ ఉంటుంది. కట్ చేసినా కూడా మళ్లీ చేస్తుంది. ఇక ఇందిరా దేవి బాధ పడుతూ.. నా భర్త ప్రాణాలను కాపాడండి అంటూ వేడుకుంటుంది. నాకు ఇప్పుడు కావాల్సింది.. ఓదార్పు కాదు.. పరిష్కరం అంటుంది ఇందిరాదేవి. ఇందులో డబ్బు, నగలు ఉన్నాయి.. ఇవన్నీ ఖర్చు పెట్టండి.. ఏ దేశంలో నా భర్త ప్రాణాలు నిలబెట్టగలిగే డాక్టర్లు ఉంటారో.. అక్కడికి తీసుకువెళ్లండి.. కాపాండండి అంటూ వేడుకుంటుంది.

ఇక రుద్రాణి.. ఎంత ఖర్చు పెట్టినా... ఆస్తి కరిగిపోవడం తప్ప.. ప్రయోజనం ఏం ఉంటుంది అని అంటుంది. ఆ అవకాశం ఉంటే.. రాజ్, పెద్దన్నయ్య ఆ పని చేసేవాళ్లు కదా అంటుంది. దీంతో ఇందిరా దేవి... రుద్రాణి చెంపపగుల గొడుతుంది. ఇన్నాళ్లు మనల్ని కాపాడుకుంటున్న ఓ పెద్ద దిక్కుకు ఆపద వస్తే... ఆస్తులు పెట్టాల్సిందే. ఇక ఇంట్లో వాళ్లు తలో మాట రుద్రాణిని అంటారు. ఇక ఇందిరా దేవి.. నా భర్త ప్రాణం కాపాడండి అని ఇంట్లో వాళ్లకు చెప్తుంది. నా బావ లేని నాడు.. ఈ చిట్టి కూడా ప్రాణాలతో ఉండదు అని గుర్తు పెట్టుకోండి అని చెప్తుంది.

ఇక రాజ్ వచ్చి... ఇందిరాదేవి ఆత్మనిబ్బరం గురించి మాట్లాడుతాడు. తాతాయ్య ప్రాణం ఖరీదు ఆస్తులే అయితే.. అంతా ధారపోయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కలుపు మొక్కలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తాతాయ్యను దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాం. తాతాయ్యను పూర్తి ఆరోగ్యంతో నీకు అప్పజెప్పుతాను అంటూ మాట ఇస్తాడు రాజ్. ఇక రుద్రాణి రగిలిపోతుంది.

Raj Comforts Indradevi in November 9th 2023 Episode number 249 in Brahmamudi Telugu Serial

ఇదేంటి అప్పు ఎప్పుడూ చూడు పడుకుని ఉంటుంది. ఇక దాని మనసులో ఏం ఉందో కూడా తెలుసుకో అని అన్నపూర్ణ అంటుంది. దాని మనసులో ఏం ఉంటుంది.. అని కనకం అంటుంది. ఇక ఇంతలో అనామిక వస్తుంది. ఇక అప్పుతో మాట్లాడుతుంది. అప్పు ఫోన్ తీసుకుని కళ్యాణ్ కు ఫోన్ చేస్తుంది. ఇక కల్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అది చూసి షాక్ అవుతుంది. ఇక అనామిక కోపంతో... నేను అనామిక అంటుంది.

అప్పు నా ఫ్రెండు.. ఏం చెప్పినా వింటుంది.. నువ్వు అలా కాదు.. మనం చాలా సేపు మాట్లాడాలి... అంటాడు కల్యాణ్. ఇక అనామికకు సారీ చెప్తాడు. ఇక మీ ఫ్రెండిషిప్ చూస్తే.. నాకు జలస్ వేస్తుంది.. అంటుంది అనామిక. మీ ఫ్రెండ్ షిప్ కు చాలా వాల్యూ ఇస్తాడు అంటుంది. ఇంతలో కనకం వచ్చి అవును అమ్మ.. అప్పుకి ఏ కష్టం వచ్చినా ఊరుకోడు.. అంటుంది. మరోవైపు రుద్రాణి.. సీతారామయ్య గదిలోకి వెళ్లతుంది. ఇక రుద్రాణి ఖాళీ పత్రాలు తీసుకువెళ్లి... సీతారామయ్యను కాక పడుతుంది. ఇంతలో సీరియల్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో రాజ్ భోజనం చేయను అంటాడు. ఇక కావ్య రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. దీంతో నేను తినిపిస్తే తింటాడు అని అపర్ణ అంటుంది. రాజ్ కు అన్నం తినిపిస్తుంది. అది చూసి కావ్య, ధాన్య లక్ష్మి మురిసిపోతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X