Brahmamudi November 7th: ఆస్తిలో వాటా కావాలన్న స్వప్న.. సీతారామయ్యకు గుండెపోటు.. అసలు విషయం బయటపెట్టిన రాజ్

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో... కావ్య, స్వప్నలను ఇంట్లో ఉంచాలా వద్దా అనేది నిర్ణయించడానికి ఇంట్లో సమావేశం పెడుతారు. ఇక దుగ్గిరాల సీతారామయ్య తీర్పు వెలువరించనున్నారు. ఇందీరాదేవి నువ్వు చెప్పు బావ అంటూ సీతారామయ్యను అడుగుతుంది. ఇక సీతారామాయ్య మాట్లాడుతు ఉండగా.. రాహుల్ అడ్డుతలుగుతాడు. ఏమైంది అడుగుతాడు సీతారామయ్య. నేను తప్పు చేశాను.. ఒక్క తప్పు కాదు.. చాలా తప్పులు చేశాను.. ఇంత పెద్ద కుటుంబంలో మచ్చతెస్తాను అనే బాధతోనే చెప్పలేదు. మీరు ఒప్పుకున్న తర్వాతే నేను స్వప్నను పెళ్లి చేసుకున్నాను. స్వప్నను ప్రేమగా చూసుకున్నాను.. అంటూ రాహుల్ రివర్స్ డ్రామా ప్లే చేశాడు.

ఆమె ఏం కోరుకున్నా నేను చేశాను... కానీ ఆమె ఇంట్లో వాళ్లను అందరినీ మోసం చేసింది.. అదే చిన్న మోసం కాదు అని అందరికీ తెలుసు. ఇది అక్క చెల్లెళ్లు ఇద్దరు కలిసి చేసిన మోసం. కావ్య విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు కానీ... స్వప్నతో నేను కాపురం చేయలేను.. కాబట్టి మాకు విడాకులు ఇప్పించండి తాతాయ్య అంటాడు రాహుల్. ఇక రుద్రాణి కూడా ఈ కొడలు వద్దు అంటుంది. పక్కలో పామును పెట్టుకుని వాడు జీవితాంతం ప్రశాంతంగా ఉండలేడు అంటుంది రుద్రాణి.

Raj Discloses The Truth in November 7th 2023 Episode number 247 in Brahmamudi Telugu Serial

ఇక అపర్ణ కూడా మాట్లాడుతూ.. ఇందులో స్వప్న పాత్ర ఎంత ఉందో.. కావ్య పాత్ర కూడా అంతే ఉంది. స్వప్నతో పాటు కావ్యను పంపించేద్దాం.. రాజ్ కు విడాకులు ఇప్పిద్దాం.. అని చెప్తుంది. ఇక ఇదివిన్న కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. కావ్య మాట్లాడుతుండగా.. అపర్ణ అడ్డుకుంటుంది. స్వప్నను అపర్ణ మాట్లాడకుండా చేస్తుంది. ఇక స్వప్న రెచ్చిపోయి మాట్లాడుతుంది. మిమ్మల్ని రాహుల్ ను కోర్టుకు లాగుతా అంటుంది. మీకు ఎవరు సపోర్ట్ చేసినా.. వాళ్లను కోర్టు బోన్ ఎక్కిస్తా అంటుంది స్వప్న.

నేను గానీ బయటకు వెళ్లాల్సి వస్తే.. అందరినీ బయటకు లాగుతా.. అంటుంది స్వప్న. ఇక సుభాష్ ఆపండి అని అరుస్తాడు. ఈ తప్పులో రాహుల్ కి భాగం ఉంది.. ముందు వాడు మోసం చేయడం వల్లే.. స్వప్న ఈ అబద్ధం ఆడింది. కాబట్టి రాహుల్, స్వప్న, రుద్రాణి అందరూ కలిసి బయటకు వెళ్లండి అంటాడు. అన్నయ్యా అంటూ అరుస్తుంది రుద్రాణి. మొత్తం తప్పు మీ ముగ్గురిలోనే ఉందని సుభాష్ అంటాడు. అలాగే వెళ్లిపోతాం అంకుల్ అని స్వప్న అంటుంది.

మా ఆస్తి కూడా మాకు పంచండి అంటుంది. మీ పుట్టింటి నుంచి ఎన్ని కోట్లు తెచ్చావ్... మీ అత్త ఎన్ని కోట్లు తెచ్చింది.. ఆ మాత్రం లెక్కకు వస్తే... మా మావయ్య దయదలచి పెంచుకున్నాడు.. మీ అత్తకే గతిలేదు అంటుంది. ఇక రుద్రాణి.. నాన్న అంటూ సీతారామయ్యతో గొడవ పడుతుంది. ఆస్తీ దగ్గరకు వచ్చే సరికి నన్నే పరాయి దాన్ని చేస్తారా... మా నాన్న మాట ఇచ్చాడు.. ఈ ఇంట్లో పెద్ద అన్నయ్య ఎంతో.. చిన్న అన్నయ్య ఎంతో నేను అంతే అంటుంది రుద్రాణి.

Raj Discloses The Truth in November 7th 2023 Episode number 247 in Brahmamudi Telugu Serial

ఇంతలో సీతారామయ్యకు గుండెపోటు వస్తుంది. అందరూ కంగారు పడిపోతారు. ఈ ఇంట్లో అందరూ నటిస్తునే ఉన్నారు.. ఆఖరికి నువ్వు కూడా తప్పించుకోవడానికి ఎత్తు వేస్తున్నావా అని రుద్రాణి అంటుంది. రాజ్ వచ్చి షర్టప్ అత్త.. అంటూ అరుస్తాడు. నీకు ఆశ్రయం ఇచ్చినా తాతాయ్య.. నీ కొడుకు ఎన్ని తప్పులు చేసినా తాతాయ్య.. ఆస్తి పంపకాలు దగ్గరకు వచ్చే సరికి నటిస్తున్నాడు అని మాట్లాడుతావా... అని రాజ్ అంటాడు.

ఇక మాటాల్లో రాజ్ అసలు విషయం బయటపెడుతాడు. తాతాయ్యకు క్యాన్సర్ అని చెప్తాడు. ఇంకెంతో కాలం మనతో ఉండరు అని చెప్తాడు రాజ్. అని విన్న కుటుంబ సభ్యులు అంతా షాక్ అవుతారు. వరలక్ష్మి వ్రతం రోజు.. కళ్లు తిరిగిపడిపోయినప్పుడు.. అప్పుడు తెలిసింది ఈ నిజం. ఇక ఇందిరాదేవి కన్నీరు మున్నీరు అవుతుంది. మీరు లేకపోతే.. నేను ఎలా బతుకుతాను బావ అంటూ ఏడుస్తుంది. లేదు బావ.. నీకేమి కాదు.. కానివ్వను అంటూ ఇందిరాదేవి అంటుంది.

నీకు నేను ఉన్నాను బావ.. నీకేం జరిగినా నేను భరించలేను.. నేను పోతే.. పుణ్య స్త్రీగానే పోవాలి.. అని చెప్తుంది. సీతారామయ్య కూడా విలపిస్తాడు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ల మాట్లాడుతున్నారని అంటాడు. స్వప్న, కావ్యను క్షమించమని చెప్దాం అనుకున్నాను.. కానీ ఎవరి నిర్ణయాలు వాళ్లు తీసుకుంటున్నారు ఇంకేం మాట్లాడాలి అని అంటాడు. ఇక నేను చెప్తాను అని ఇందిరాదేవి లేచి.. తీర్పును చెప్తుంది. ఎవరినీ ఎవరు గడప దాటి వెళ్లమని చెప్పడానికి వీళ్లేదు అని చెప్తుంది. ఇక్కడే ఉంటారు.. కాదని ఎవరైనా అంటే.. నేను ఎవరినీ క్షమించను అని చెప్తుంది.

Raj Discloses The Truth in November 7th 2023 Episode number 247 in Brahmamudi Telugu Serial

ఇక కావ్య, స్పప్నను పిలుచుకుని కూర్చొమంటాడు సీతారామయ్య. రాహుల్ నీతో ఎప్పటిలాగానే ఉంటాడు అని స్వప్నతో చెప్తాడు. ఇక రాజ్ ను పిలిచి... కూర్చోమంటాడు. ఇంత కాలం నీ మంచితనం, నీ సంస్కారం అన్ని నిన్న శాసించడం వల్ల బలవంతంగా కాపురం చేస్తున్నావ్ అని నాకు అర్థం అయింది. కావ్య చేతిని రాజ్ లో చేతిలో పెట్టి... నువ్వు కావ్యను మనస్ఫూర్తిగా భార్యగా స్వీకరించాలని చెప్తాడు సీతారామయ్య. దానికి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో గదిలో ఉంటాడు రాజ్. ఇక కావ్య రాగానే వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తాడు. ఏవండి నాతో మాట్లాడటం కూడా మీకు ఇష్టం లేదని నాకు తెలుసు.. అని కావ్య అంటుంది. మరి తెలిసాక కూడా ఎందుకు మాట్లాతున్నావ్ అంటాడు రాజ్. గొడవ పడినా ప్రతి సారి మాట్లాడటం మానేస్తే.. బంధం ఎలా నిలబడుతుందని కావ్య అంటుంది. వద్దు అనుకున్నప్పుడు నిలబడ్డ.. తెగిపడినా ఒకటే అవుతుందని రాజ్ చెప్పి వెళ్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X